PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-bf732c60-e056-4d7b-bd9e-fbcf2e7f2d1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-bf732c60-e056-4d7b-bd9e-fbcf2e7f2d1a-415x250-IndiaHerald.jpgస్పష్టం చేస్తోంది. తాజాగా ఢిల్లీ భేటీలోనూ ఈ అంశంపై చర్చ జరిగిందని, దీంతో రేవంత్ సీనియర్ల భేటీలో చేరికలపై తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్ కు వెల్లడించినట్లు సమాచారం. జిల్లాల్లో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తూ ఉన్నా స్థానికంగా పట్టున్న కొందరు నేతల వ్యవహారశైలి వల్లే ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదని రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు పార్టీ చేరికలపై మోకాల్లంటిన నేతలు ఇప్పుడు చిక్కుల్లో పడనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై హైకమాండ్ ఏం చెబుతుందో అన్నది ఆసక్తికరంగా మాPolitical {#}Josh;revanth;Delhi;Jr NTR;Revanth Reddy;Telangana Rashtra Samithi TRS;Government;Congress;Partyరేవంతుపై విమర్శల జోరు..ఎందుకు..?రేవంతుపై విమర్శల జోరు..ఎందుకు..?Political {#}Josh;revanth;Delhi;Jr NTR;Revanth Reddy;Telangana Rashtra Samithi TRS;Government;Congress;PartyTue, 16 Nov 2021 21:37:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిందా లేదా..? ఒకవేళ వస్తే చేరికలు ఎందుకు ఉండడం లేదు..? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిందట. తెలంగాణలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పూర్వవైభవం అందుకోవడానికి చేస్తోంది. బహిరంగ సభలతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ  సత్తా నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి సన్నిహితులు క్షేత్రస్థాయిలో కష్టించి పని చేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పై వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజాభిమానం చూరగొన్నడానికి శ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది.

హుజరాబాద్ ఉప ఎన్నిక ఫలితం పార్టీ శ్రేణులను మానసికంగా దెబ్బ తీసినప్పటికీ రేవంత్ రెడ్డి దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని బిజెపిని కూడా నిలువరించడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి అనేక సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తాయి. సొంత పార్టీ నేతల అసమ్మతి చర్యలతో రేవంత్ రెడ్డి అనుకున్నంత దూకుడుగా పార్టీని పరుగులు పెట్టించలేకపోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. పిసిసి అధ్యక్ష పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఉన్న  కొందరు సీనియర్లు తమకంటే జూనియర్ కు పదవి వచ్చిందన్న భావనతో మరికొందరు రేవంత్ కు  సహకరించడంలేదన్న చర్చ  కూడా జరుగుతోంది. ఏదో విధంగా రేవంత్ ను నిలువరించే ప్రయత్నాలు ప్రత్యర్థివర్గం నుండి ఎదురుతూనే ఉన్నాయనదడానికి ఆగమేఘాల మీద రేవంత్ ఢిల్లీ పర్యటన స్పష్టం చేస్తోంది. తాజాగా ఢిల్లీ భేటీలోనూ ఈ అంశంపై చర్చ జరిగిందని, దీంతో రేవంత్ సీనియర్ల భేటీలో చేరికలపై తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్ కు వెల్లడించినట్లు సమాచారం.

జిల్లాల్లో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తూ ఉన్నా స్థానికంగా పట్టున్న కొందరు నేతల వ్యవహారశైలి వల్లే ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదని రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు పార్టీ చేరికలపై  మోకాల్లంటిన నేతలు ఇప్పుడు చిక్కుల్లో పడనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై హైకమాండ్ ఏం చెబుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుతానికి చేరికలు లేకున్నా వచ్చే ఎన్నికల నాటికి భారీగా నేతల రాక ఉంటుందని రేవంత్ దీమా వ్యక్తం చేస్తున్నారు.



జగనన్న ఇలాకా : ఫలించిన మాజీ కమ్యూనిస్టు మంత్రాంగం?

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>