MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaitanya50342b38-b0c6-44b7-bbde-714c8debfa22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaitanya50342b38-b0c6-44b7-bbde-714c8debfa22-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకుని ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు.. ఇకపై కలిసి ఉండలేమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం అటు సమంత తన కెరీర్ పై దృష్టి సారించి వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో సైతం అడుగు పెట్టేందుకు సిద్ధమైంది సమంత. ఇప్పటికే ఈమె ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సమంత బాటలోనే ప్రయాణిస్తున్నాడు నాగ చైతన్య. చైNaga Chaitanya{#}Kumaar;kalyan krishna;sekhar;vikram;Amazon;media;Silver;Love Story;Audience;Tollywood;Naga Chaitanya;Samantha;Wife;bollywood;Father;Hero;News;naga;Cinemaవిలన్ గా మారబోతోన్న అక్కినేని హీరో..?విలన్ గా మారబోతోన్న అక్కినేని హీరో..?Naga Chaitanya{#}Kumaar;kalyan krishna;sekhar;vikram;Amazon;media;Silver;Love Story;Audience;Tollywood;Naga Chaitanya;Samantha;Wife;bollywood;Father;Hero;News;naga;CinemaSun, 14 Nov 2021 15:04:06 GMTఅక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకుని ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు.. ఇకపై కలిసి ఉండలేమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం అటు సమంత తన కెరీర్ పై దృష్టి సారించి వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో సైతం అడుగు పెట్టేందుకు సిద్ధమైంది సమంత. ఇప్పటికే ఈమె ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సమంత బాటలోనే ప్రయాణిస్తున్నాడు నాగ చైతన్య. చైతు కూడా తన కెరీర్ పై పూర్తి దృష్టి సారించడానికి సిద్ధమయ్యాడు.

 గతంలో ఎప్పుడూ చేయనటువంటి పలు విభిన్న పాత్రలతో ఆడియన్స్ ని మెప్పించాలని చైతు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హారర్ కథాంశంతో సాగే ఓ వెబ్ సిరీస్ కి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ తో చైతు ఓటి టి లో అడుగు పెట్టనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఈ హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు గా సమాచారం. ఇప్పటికే వెండి తెరపై హీరోగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య.. అనూహ్యంగా ఓ టి టి లో అదికూడా వెబ్ సీరీస్ కి విలన్ పాత్రను ఒప్పుకోవడం అనేది విశేషం అనే చెప్పాలి. ఇక విక్రమ్ కె.కుమార్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

 ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక మరోవైపు ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చైతు..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా 'థాంక్యూ' అనే సినిమాలో చైతు తో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాతో పాటు 'బంగార్రాజు' సినిమా లో కూడా తన తండ్రి నాగార్జునతో కలిసి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగచైతన్య. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!



విలన్ గా మారబోతోన్న అక్కినేని హీరో..?

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!

బాల భార‌తం : ఆ చిన్నారుల కోసం ఆన్లైన్ పాఠాలు ఎందుకంటే?

యూట్యూబ్ ని షేక్ చేసిన 'సర్కారు వారి పాట బ్లాస్ట్'..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>