Bigg Boss 5: శ్రీరామ చంద్రే విన్నర్..? సజ్జనార్ సపోర్ట్.. వీడియో పోస్ట్
ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు. ఈసారి జర్నలిస్టులకు కూడా గుడ్ న్యూస్ అందజేశారు. 2/3 ఆన్ లైన్ చేశారు.

బిగ్ బాస్ షోపై కామెంట్
ఇప్పుడు బిగ్ బాస్‌పై సజ్జనార్ ఫోకస్ చేశారు. అంటే కంటెస్టెంట్ల గురించి మాట్లాడారు. బిగ్ బాస్ ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం అనారోగ్యం కారణంగా జెస్సి వెళ్లిపోవడంతో నామినేషన్స్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్లల్లో ఒకరిద్దరు నెక్స్ట్ వీక్‌లోనే వెళ్ళిపోతారని తెలిసిపోతుంది. కొంతమంది కంటెస్టెంట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. బయట నుంచి సపోర్ట్ బాగుండటంతో నామినేట్ అయినా సేఫ్ అవుతున్నారు.

శ్రీరామ్.. షన్ను, రవి కూడా
మిగిలిన కంటెస్టెంట్స్ లో టాప్ 3లో రవి, షన్ను, శ్రీరామ్ ఉన్నారు. రవికి ఫ్యాన్స్‌తోపాటు నాగార్జున సపోర్ట్ కూడా ఉంది. ఇక షన్నుకి ఫ్యాన్స్ సపోర్ట్ చాలా బాగుంది. శ్రీరామ్‌కి మాత్రం సెలబ్రిటీలంతా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సింగర్ శ్రీరామచంద్రకు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ ఉందని పోస్ట్ చేసింది.

సెలబ్రిటీలు రిక్వెస్ట్
శ్రీరామ్‌కి వోట్ వేయమని తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్ కూడా శ్రీరామ చంద్ర తనకు స్నేహితుడు తనను గెలిపించండి అంటూ వీడియో షేర్ చేసింది. ఆ తర్వాత అందరికి హెల్ప్ చేసే సోనూసూద్ కూడా సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు.

శ్రీరామ్‌కే సపోర్ట్
తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక వీడియో ద్వారా శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్‌లో అద్భుతంగా గేమ్ ఆడుతున్నడని, పాటలు కూడా బాగా పాడుతాడని పేర్కొన్నారు. ఈ సారి ఆయనే కప్ గెలుస్తాడనే నమ్మకం ఉందన్నారు. ఈ వీడియోని శ్రీరామ చంద్ర ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఇక శ్రీరామ్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. సజ్జనార్‌కి జనాల్లోమంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌తో శ్రీరామ్ చంద్రకి కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది.