HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-553ab182-b3de-4d07-a557-4be0d2d3f84b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-553ab182-b3de-4d07-a557-4be0d2d3f84b-415x250-IndiaHerald.jpgప్రపంచంలోని అన్ని దేశాల రాజధానులు తో కంపేర్ చేస్తే ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన గాలి నాణ్యత ఉన్న దేశ రాజధానిగా నిలిచింది. కాలుష్యం కారణంగా ఛాతి సమస్యలు, గుండె జబ్బులు ఉన్న వారికి ఈ కాలుష్యం చాలా ప్రమాదకరం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు అయితేనే దేశ రాజధాని పౌరులకు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో 10 నుంచి 15 శాతం పిల్లలు అస్తమా తో బాధపడుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇది మరింత టెన్షన్ పెడుతోంది.మామూలుగానే ఢిల్లీ కాలుష్యం ఎక్కువ. అందులోనూ దీవాలి పరిణామాలు పరిస్థితిని మరింత దిగజార్చాయిHealth {#}pollution;Supreme;Heart;Government;Capital;air pollution;Delhi;Diwali;Air;CM;central government;mondayవాయు కాలుష్యంతో ఢిల్లీ గజ గజ.. సొల్యూషన్ ఏమిటి..?వాయు కాలుష్యంతో ఢిల్లీ గజ గజ.. సొల్యూషన్ ఏమిటి..?Health {#}pollution;Supreme;Heart;Government;Capital;air pollution;Delhi;Diwali;Air;CM;central government;mondaySun, 14 Nov 2021 21:14:00 GMTకరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీని కాలుష్యం కోరలు చాస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి  రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అటు సుప్రీం కూడా సీరియస్ అవ్వడంతో హస్తిన ప్రభుత్వం అలర్ట్ అయింది. లాక్ డౌన్ కానీ లాక్ డౌన్ ఒకటి విధించింది. వారం రోజులపాటు అన్ని బంద్ అని ప్రకటించింది. అసలు ఢిల్లీ లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? చలేస్తే వనికే ప్రాణాలు చూస్తుంటాం, చలికాలం వస్తుందన్న వార్త వినగానే భయంతో వణికే  ప్రాణాలు ఢిల్లీ లో మాత్రమే కనిపిస్తాయి. హస్తిన ఆ స్థాయిలో కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. చలికాలంలో మాత్రమే అంటున్నాను అంటే ఇదేదో సీజనల్ గా వచ్చే సమస్య కాదు శాశ్వతంగా ఎదురైనా ఎదురవుతున్న సమస్య. ఎప్పుడూ జరిగేదే ఇప్పుడు కూడా జరిగింది.కాకపోతే ఇప్పుడు మరింత భయపెడుతోంది. మరోసారి దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ పరిస్థితులకు దారి తీస్తుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత  దిగజారింది. దీంతో దేశరాజధానిలో వాయు కాలుష్యం పై సుప్రీమ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.

ఢిల్లీ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అత్యవసర ప్లాన్ ను సిద్ధం చేయాలని ఆదేశించింది. రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించయినా సరే కాలుష్యాన్ని తగ్గించాలని క్లియర్ కట్ గా చెప్పేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 నుంచి 200 తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారో అని నోటీసుల్లో తెలిపింది. ఇంట్లో కూడా మాస్కులు లేకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తోందని, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. పైకి చెప్పడం లేదు గాని లాక్ డౌన్ మళ్ళీ మొదలైంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు కుళ్ళు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపార, నిర్మాణ పనులన్ని వెంటనే నిలిపి వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం  కల్పించారు. కరోనాతో తల్లడిల్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హస్తినా పై ఈ కాలుష్యం భారీ ప్రభావం చూపిస్తోంది. వారం రోజుల్లో కంట్రోల్ లోకి తీసుకు రావాలని సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలని సీఎం కేజ్రీవాల్ కోరుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల రాజధానులు తో కంపేర్ చేస్తే ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన గాలి నాణ్యత ఉన్న దేశ రాజధానిగా నిలిచింది. కాలుష్యం కారణంగా ఛాతి సమస్యలు, గుండె జబ్బులు ఉన్న వారికి ఈ కాలుష్యం  చాలా ప్రమాదకరం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు అయితేనే దేశ రాజధాని పౌరులకు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో 10 నుంచి 15 శాతం పిల్లలు అస్తమా తో బాధపడుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇది మరింత టెన్షన్ పెడుతోంది.మామూలుగానే ఢిల్లీ కాలుష్యం ఎక్కువ. అందులోనూ దీవాలి పరిణామాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. జనాలను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసాయి.



జగన్ తో బంధం బలపడుతోంది... ?

బాల భారతం: ఫిజికల్ గేమ్స్ ఎక్కడ...?

బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>