PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/forensic4401217d-42bf-4ee1-a1a5-3672fc986db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/forensic4401217d-42bf-4ee1-a1a5-3672fc986db6-415x250-IndiaHerald.jpgడ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. కొన్నాళ్లుగా న్యూస్‌లో బాగా నానుతున్న పదం ఇది.. డ్రగ్స్ ఎప్పటి నుంచో వాడకంలో ఉన్నా.. ఇటీవలి కాలంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. డ్రగ్స్ ను నేరుగా వినియోగించడంతో పాటు అనేక రూపాల్లో అనేక ఆహార పదార్దాల్లో డ్రగ్స్ కలిపి వాడుతున్నారు. చివరకు స్కూలు పిల్లల చాక్లెట్లలోనూ డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారు. ఈ డ్రగ్స్ కారణంగా యువత బలవుతున్నారు. మరి ఈ డ్రగ్స్‌ను అరికట్టాలంటే.. తగినంత సిబ్బంది ఉండాలి. ఒక డ్రగ్స్ కేసు డీల్ చేయాలంటే.. ఆ పోలీస్‌ బృందానికి ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్forensic{#}Drugs;central government;local languageడ్రగ్స్ జోరు.. ఈ ఉద్యోగాలకు యమా డిమాండ్..?డ్రగ్స్ జోరు.. ఈ ఉద్యోగాలకు యమా డిమాండ్..?forensic{#}Drugs;central government;local languageSun, 14 Nov 2021 23:00:00 GMTడ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. కొన్నాళ్లుగా న్యూస్‌లో బాగా నానుతున్న పదం ఇది.. డ్రగ్స్ ఎప్పటి నుంచో వాడకంలో ఉన్నా.. ఇటీవలి కాలంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. డ్రగ్స్ ను నేరుగా వినియోగించడంతో పాటు అనేక రూపాల్లో అనేక ఆహార పదార్దాల్లో డ్రగ్స్ కలిపి వాడుతున్నారు. చివరకు స్కూలు పిల్లల చాక్లెట్లలోనూ డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారు. ఈ డ్రగ్స్ కారణంగా యువత బలవుతున్నారు.


మరి ఈ డ్రగ్స్‌ను అరికట్టాలంటే.. తగినంత సిబ్బంది ఉండాలి. ఒక డ్రగ్స్ కేసు డీల్ చేయాలంటే.. ఆ పోలీస్‌ బృందానికి ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సేవలు చాలా అవసరం.. విచిత్రం ఏంటంటే.. అసలు మన ఇండియాలో ఈ ఫోరెన్సిక్ సైన్స్‌ చదివేవారి సంఖ్య చాలా తక్కువ. అసలు ఈ ఫోరెన్సిస్ సైన్స్ కోర్సులు కూడా తక్కువ. ఈ ఫోరెన్సిక్ సైన్స్ బోధించే కాలేజీలూ తక్కువే. అందుకే నిపుణులైన ఫోరెన్సిక్ సిబ్బంది అవసరం ఇప్పడు దేశంలో విపరీతంగా పెరిగిపోయింది.


హత్య, దోపిడీ, దొంగతనం.. ఇలా ఏ నేరమైనా ససాక్ష్యంగా నిరూపించాలంటే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాల్సిందే. కానీ.. మన దగ్గర సిబ్బంది చాలా తక్కువ. అందువల్ల చాలా కేసులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. దర్యాప్తు చాలా ఆలస్యం అవుతోంది. అందుకే.. తాజాగా తిరుపతిలో జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. మాదకద్రవ్యాల కట్టడికి దక్షిణాది సీఎంలు ప్రాధాన్యం ఇవ్వాలన్న అమిత్‌షా.. డ్రగ్స్‌పై విచారణలను రాష్ట్రాలు వేగవంతం చేయాలన్నారు.


ఇదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణుల కొరత అంశాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రస్తావించారు. అన్ని రాష్ట్రాలు కనీసం ఒక ఫోరెన్సిక్‌ సైన్స్‌ కళాశాల ఏర్పాటు చేయాలని.. ఆ ఫోరెన్సిక్‌ కళాశాలలో స్థానిక భాషలో సిలబస్‌ ఉండేలా చూడాలని అమిత్‌షా అన్నారు.  దీని వల్ల దర్యాప్తు అవసరాలకు శిక్షణ పొందిన సిబ్బందిని కలిగి ఉంటారని అమిత్‌షా అంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ సిబ్బందికి యమా డిమాండ్ ఉంది.  



లోకేష్ పప్పు కాదా..అంతా వారి దయే!

బాల భారతం: ఫిజికల్ గేమ్స్ ఎక్కడ...?

బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>