Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f4328500-e8bf-4239-997f-69909785957b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f4328500-e8bf-4239-997f-69909785957b-415x250-IndiaHerald.jpg2021 టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు ఎంత అద్భుతమైన పోరాటం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి మ్యాచ్ నుంచి విజయ పరంపరను కొనసాగించింది పాకిస్థాన్ జట్టు. అంతేకాదు సెమీఫైనల్లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా కూడా పాకిస్థాన్ జట్టు నిలిచింది అని చెప్పాలి. ఇలా మొదటి నుంచి అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్లో మాత్రం తడబాటుకు గురైంది. మొదట అద్భుతంగా రాణించింది అనిపించినప్పటికీ చివరికి ఒత్తిడికి తలొగ్గింది పాకిస్థాన్ జట్టు. ఒకానొక సమయంలో పాకిస్థాన్ జట్టు గెలుస్తుంది అని అనుకున్నప్పటCricket {#}ali;Pakistan;Australia;Wife;mediaక్షమించండి.. పెద్ద తప్పు చేశాను : పాక్ బౌలర్క్షమించండి.. పెద్ద తప్పు చేశాను : పాక్ బౌలర్Cricket {#}ali;Pakistan;Australia;Wife;mediaSun, 14 Nov 2021 19:00:00 GMT2021 టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు ఎంత అద్భుతమైన పోరాటం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి మ్యాచ్ నుంచి విజయ పరంపరను కొనసాగించింది పాకిస్థాన్ జట్టు. అంతేకాదు సెమీఫైనల్లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా కూడా పాకిస్థాన్ జట్టు నిలిచింది అని చెప్పాలి. ఇలా మొదటి నుంచి అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్లో మాత్రం తడబాటుకు గురైంది. మొదట అద్భుతంగా రాణించింది అనిపించినప్పటికీ చివరికి ఒత్తిడికి తలొగ్గింది పాకిస్థాన్ జట్టు. ఒకానొక సమయంలో పాకిస్థాన్ జట్టు గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.



అయితే సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.ఎంతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో అన్ని సందర్భాల్లో కూడా పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తుంది అనే విధంగానే ఉంది పరిస్థితి. కానీ పాకిస్థాన్ ఆటగాడు హసన్ అలీ చేసిన చిన్న తప్పిదం ఏకంగా జట్టుకు శాపంగా మారిపోయింది. క్రీజులోకి వచ్చి ఎంతో దూకుడుగా ఆడుతున్న మాత్యు వెడ్  క్యాచ్ ఇచ్చిన సందర్భంలో ఇక ఒత్తిడితో  క్యాచ్  మిస్ చేశాడు పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వరుసగా సిక్సర్ల మోత మోగించాడు.


 దీంతో ఓడిపోతుంది అనుకున్న ఆస్ట్రేలియా జట్టు కాస్త విజయం సాధించింది. అయితే హసన్ అలీ   కారణంగానే పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్లో ఓడిపోయింది అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హసన్ అలీ తో పాటు అతని భార్య ని కూడా ఈ వ్యవహారంలో లాగి దారుణంగా సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ బౌలర్  స్పందించాడు. ఫాన్స్ అందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అభిమానుల అంచనాలను అందుకోవడంలో తాను విఫలం అయ్యాను.. తను ఈ ఓటమి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. ఇకపై ఉత్తమ ప్రదర్శన చేస్తాను అంటూ హసన్ అలీ  బహిరంగ క్షమాపణలు చెప్పాడు.



చంద్రబాబు, పవన్ లు రోడ్డెక్కబోతున్నారా..?

బాల భారతం: ఫిజికల్ గేమ్స్ ఎక్కడ...?

బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>