PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-pinnacle-blooms-1f3d35b1-67da-474e-ba65-c98b25db2e52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-pinnacle-blooms-1f3d35b1-67da-474e-ba65-c98b25db2e52-415x250-IndiaHerald.jpgప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల కోసం ప్రత్యేక శ్ర‌ద్ధ వ‌హించి రూపొందించిన కోర్సులు కొన్ని పినాకిల్ బ్లూమ్స్ రూపొందించింది. ముఖ్యంగా ఆటిజంతో పాటు మ‌రికొన్ని మానసిక స‌మ‌స్య‌లు ఉండి సరైన ఎదుగుల‌ద‌ల లేని పిల్ల‌ల‌కు పినాకిల్ బ్లూమ్స్ సంస్థ అండ‌గా ఉంటోంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందుకు వ‌స్తే ప్ర‌తి జిల్లాలోనూ ఆటిజం థెర‌ఫీ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధం అంటోంది. ఇందుకోసం అయ్యే ఖ‌ర్చును కూడా తామే భ‌రిస్తామ‌ని చెబుతోంది. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల కోసం ఇప్ప‌టికే అనేక అధ్య‌య‌pinnacle blooms {#}central government;Koti Reddy Saripalliబాల భార‌తం : ఆ చిన్నారుల కోసం ఆన్లైన్ పాఠాలు ఎందుకంటే?బాల భార‌తం : ఆ చిన్నారుల కోసం ఆన్లైన్ పాఠాలు ఎందుకంటే?pinnacle blooms {#}central government;Koti Reddy SaripalliSun, 14 Nov 2021 12:43:09 GMTప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల కోసం ప్రత్యేక శ్ర‌ద్ధ వ‌హించి రూపొందించిన కోర్సులు కొన్ని పినాకిల్ బ్లూమ్స్ రూపొందించింది. ముఖ్యంగా ఆటిజంతో పాటు మ‌రికొన్ని మానసిక స‌మ‌స్య‌లు ఉండి సరైన ఎదుగుల‌ద‌ల లేని పిల్ల‌ల‌కు పినాకిల్ బ్లూమ్స్ సంస్థ అండ‌గా ఉంటోంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందుకు వ‌స్తే ప్ర‌తి జిల్లాలోనూ ఆటిజం థెర‌ఫీ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధం అంటోంది. ఇందుకోసం అయ్యే ఖ‌ర్చును కూడా తామే భ‌రిస్తామ‌ని చెబుతోంది. ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల కోసం ఇప్ప‌టికే అనేక అధ్య‌య‌నాలు చేసి కోట్ల రూపాయ‌లు అందుకు వెచ్చించిన పినాకిల్ బ్లూమ్స్ సంస్థ అధినేత కోటి రెడ్డి స‌రిప‌ల్లి సేవే మార్గంగా దూసుకుపోతున్నారు. ముందు త‌మ బిడ్డ‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌ను అధ్య‌య‌నం చేశాక, మా ఇంటికి కష్టం ఇంకెవ్వ‌రికీ రావొద్ద‌ని భావించి, ఈ త‌ర‌హా కౌన్సిలింగ్, థెర‌ఫీ సెంట‌ర్ల రూప‌క‌ల్ప‌న ను ఓ బాధ్య‌త‌గా తీసుకున్నాం. సంపాద‌న‌లో 30 శాతం కేవ‌లం వీటి కోసమే వెచ్చిస్తున్నామ‌ని స‌రిప‌ల్లి శ్రీ‌జారెడ్డి చెబుతున్నారు.

ఎవ్వ‌రైనా ఎప్పుడైనా
ఆన్లైన్ కోర్టులు నేర్చుకోండిలా!
మాన‌సికంగా ఎదుగుద‌ల లేని పిల్ల‌లు దేశంలో ఐదు ల‌క్ష‌ల‌కు పైగా ఉన్నార‌ని ఒక‌ప్ప‌టి గ‌ణ‌న‌. ఇదిప్పుడు ఇంకా పెర‌గ‌వ‌చ్చు.
స్పెష‌ల్ కిడ్స్ కోసం  వారి చికిత్స కోసం ఏమ‌యినా చేయాల‌న్న ఆలోచన మా అబ్బాయికి వినికిడి స‌మ‌స్య ఉంద‌ని గుర్తించి అందుకు త‌గ్గ చికిత్స చేయించాకే క‌లిగింది. ఇదే స‌మ‌యంలో ఇలాంటి వారికోసం సామాజిక సేవ‌లో భాగంగా ఏమ‌యినా చేయ‌గ‌ల‌మా అన్న ఆలోచ‌న వ‌చ్చిందే తడ‌వుగా చేసిన అధ్య‌య‌నం మాకెన్నో విష‌యాలు నేర్పింది. కేవ‌లం స‌మ‌స్య అధ్య‌య‌నానికే నాలుగు కోట్ల పైగా వెచ్చించాం. ఇంకా సెంట‌ర్ల ఏర్పాటుకు మ‌రో కోటిన్న‌ర ఖ‌ర్చు చేశాం.ఈ సెంట‌ర్ల ద్వారా ప్ర‌త్యేక
అవ‌స‌రాలున్న పిల్ల‌ల‌కు ఆడియాలజీ, సైకాల‌జీ, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్, స్పీచ్ థెర‌ఫీ త‌దిత‌ర ప‌ద్ధ‌తులలో వారికి సర‌యిన చికిత్స అందిస్తున్నాం. ఇక మేం రూపొందించిన చికిత్సా విధానం కానీ లేదా ఇత‌ర కోర్సు వివ‌రాలు కానీ కావాలంటే ప్ర‌భుత్వాల‌కు అందించేందుకు సిద్ధం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ్వ‌రైనా మా ఆన్లైన్ క్లాసుల‌కు హాజ‌రుకావొచ్చు. ఆన్లైన్ లో ఎవ్వ‌ర‌యినా ఈ క్లాసులు
ఫాలో అయితే త‌మ పిల్ల‌లను ఆటిజం నుంచి దూరం చేయ‌వ‌చ్చు. ఇందుకోసం పినాకిల్ నెట్ వ‌ర్క్ ఆన్ లైన్ టార్చ్ బేర‌ర్ ప్రొగ్రాం ను ఏర్పాటు చేశాం.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎవ‌రైనా స‌రే ఈ కోర్సులు నేర్చుకోవ‌చ్చు. వీరికో స‌ర్టిఫికెట్ కూడా అందిస్తున్నాం.
అని చెప్పారు కోటిరెడ్డి దంప‌తులు.





బాల భార‌తం : ఆ చిన్నారుల కోసం ఆన్లైన్ పాఠాలు ఎందుకంటే?

బాల భార‌తం : ఆటిజమా మేమున్నాం!

బాల భార‌తం : స‌మ‌స్య ప్ర‌త్యేకం సేవ అనిత‌రం పినాకిల్ బ్లూమ్స్

బిగ్ బాస్ 5: లెక్కలు మారాయి... టాప్ లో సన్నీ?

బీజేపీ అభివృద్ధి : ఏడేళ్లలో.. 300 విశ్వవిద్యాలయాలు..!

కుప్పం పాలిటిక్స్ : వైసీపీపై టీడీపీ ఫిర్యాదు !

రష్యా.. ద్వంద వైఖరి..!

జూనియర్ ఇచ్చిన సూచనలతో కొరటాల శివకు నిరాశ !

చైనాకు.. తప్పని పరీక్ష..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>