WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe15efbc19-4dc8-4371-b09a-20bda1feef33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe15efbc19-4dc8-4371-b09a-20bda1feef33-415x250-IndiaHerald.jpgమనకు దొరికిన ఒకే ఒక్క అధ్బుతమైన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటాము అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పని పూర్తిగా మనకు తెలిసే జరుగుతుంది, కాబట్టి ఆ పని వలన మంచి లేదా చెడు జరిగినా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి. మనిషి జీవితం ఎప్పుడూ ఒక దగ్గర ఆగిపోదు. ఈ రోజు మనకు ఒక లక్ష్యం ఉంటుంది.VIJAYAM MEEDHE{#}Manam;Successవిజయం మీదే: మీకు సాయం చేసే మనసుందా?విజయం మీదే: మీకు సాయం చేసే మనసుందా?VIJAYAM MEEDHE{#}Manam;SuccessSun, 14 Nov 2021 21:00:00 GMTమనకు దొరికిన ఒకే ఒక్క అధ్బుతమైన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటాము అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పని పూర్తిగా మనకు తెలిసే జరుగుతుంది, కాబట్టి ఆ పని వలన మంచి లేదా చెడు జరిగినా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి. మనిషి జీవితం ఎప్పుడూ ఒక దగ్గర ఆగిపోదు. ఈ రోజు మనకు ఒక లక్ష్యం ఉంటుంది. అది పూర్తయ్యాక మరో లక్ష్యం వైపు మనము ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ ప్రయత్నంలో భాగంగా మనకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నో సవాళ్లు ఎదురు కావొచ్చు. అయితే ఈ సవాళ్లు కటినంగా కూడా ఉండవచ్చు. అంత మాత్రాన మనము దానిని సాధించలేమని ఫీల్ కాకూడదు.

ఈ సమయంలో మనము మనకు దగ్గరైన వారి నుండి సహాయాన్ని పొందాలి. అంటే అన్నీ సమస్యలు మనమే పరిష్కరించుకోవడం కుదరదు. కొన్ని సమయాల్లో ఇతరుల  సహాయం ఖచ్చితంగా అవసరం. అయితే సహాయం మనం కోరే ముందు...ఒక్క విషయం మనకు మనము ప్రశ్నించుకోవాలి. మనము ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉన్నామా? అంటే పెద్ద వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. సహాయానికి సహాయం చెయ్యాలి అని, కాబట్టి మీలో ఆ లక్షణం ఉందా అనేది బాగా ఆలోచించండి. మీకు ఈ సమయంలో సహాయం చేసిన వారు ఏదో ఒక సమయంలో  కష్టాల్లో ఉండవచ్చు. అలాంటప్పుడు వారు అడిగినా అడగకపోయినా వారి గురించి మీకు తెలియగానే సహాయం చేయడానికి సిద్దంగా ఉండాలి.

అప్పుడే మీరు పరిపూర్ణమైన మనిషి అనిపించుకుంటారు. అలా కాకుండా కొందరు స్వార్థ పరులు ఉంటారు, ఇతరులను తమ అవసరం కోసం వాడుకుని... వారికి సమస్య వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. ఇది మానవత్వం అనిపించుకోదు. ఇలాంటి వారు ఎప్పుడూ  సక్సెస్ కాలేరు. ఒకవేళ సక్సెస్ అయినా అది కేవలం తాత్కాలికం మాత్రమే. కాబట్టి గుర్తు పెట్టుకోండి సహాయం చేసే గుణం ఉంటేనే ఇతరుల సహాయం పొందండి.



జగన్ తో బంధం బలపడుతోంది... ?

బాల భారతం: ఫిజికల్ గేమ్స్ ఎక్కడ...?

బాంబు పేల్చిన విజయసాయి, టీడీపీ అగ్ర నేతలు నాతో టచ్ లో ఉన్నారు అంటూ...!

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>