PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpfb326e43-9431-4c1f-8ae3-ba5d972013b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpfb326e43-9431-4c1f-8ae3-ba5d972013b2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు అక్కడి రైతులు పాదయాత్ర చేయడం దీని విషయంలో అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు రెండు మూడు రోజుల నుంచి కాస్త దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అమరావతి పాదయాత్రను పూర్తిగా టీడీపీ యాత్రగా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దానిని తన రాజకీయంగా మార్చుకోని కుట్రలోభాగంగా పసుపుమయం చేశారని ఆరోపణలు గుప్పించారు. అందులో భycp{#}Amaravati;Capital;MLA;politics;CBN;Minister;TDP;YCP;police;Jaganఎంతకైనా తెగించే కార్యకర్తలను తయారు చేస్తాం: వైసీపీ ఎమ్మెల్యేఎంతకైనా తెగించే కార్యకర్తలను తయారు చేస్తాం: వైసీపీ ఎమ్మెల్యేycp{#}Amaravati;Capital;MLA;politics;CBN;Minister;TDP;YCP;police;JaganSun, 14 Nov 2021 16:06:23 GMTఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు అక్కడి రైతులు పాదయాత్ర చేయడం దీని విషయంలో అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు రెండు మూడు రోజుల నుంచి కాస్త దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అమరావతి పాదయాత్రను పూర్తిగా టీడీపీ యాత్రగా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దానిని తన రాజకీయంగా మార్చుకోని కుట్రలోభాగంగా పసుపుమయం చేశారని ఆరోపణలు గుప్పించారు.

అందులో భాగంగా ఆయా నియోజకవర్గ టీడీపీ నాయకులు ఇన్వాల్వు అవుతున్నారు అని అసహనం వ్యక్తం చేసారు. పాదయాత్రకు టీడీపీ జనాలను భారీ ఎత్తున సేకరిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదు...కాని టీడీపీ తన మంది మార్భలాన్ని మాత్రమే అడ్డుకున్నారు అని అన్నారు ఆయన. కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టి ప్రజలో అపోహలు నెలకొల్పి ప్రశాంత వాతావరణాన్ని టీడీపీ చెడగొట్టాలని చూస్తోంది అని మండిపడ్డారు. మంత్రి బాలినేని ఆద్వర్యంలో జిల్లాలో సంక్షేమ పథకాలు అభివృద్ది బాటలో నడుస్తున్నాయి అని స్పష్టం చేసారు.

చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం లేక పోవడంతో రైతుల పాదయాత్రలోకి చొరబడి సానుబూతి పొందాలని చూస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలన్ని గతంలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడు అని మండిపడ్డారు. చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలను తిప్పికొట్టేందుకు సిఎం జగన్ ను సిఎం కుర్చీపై పధిలంగా కూర్చో బెట్టేందుకు ఎంతటికైనా తెగించే కార్యకర్తలను తయారు చేస్తాం అని స్పష్టం చేసారు. చట్టాలను చేతుల్లోకి తీసుకోని రాష్ట్రంలో చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారు అని  అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికల్లో లబ్ధీ పొందాలనే భావనతో రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు అని మండిపడ్డారు.



ఎంతకైనా తెగించే కార్యకర్తలను తయారు చేస్తాం: వైసీపీ ఎమ్మెల్యే

మంచిమాట: కష్టపడితేనే కదా సుఖం వచ్చేది..!!

మహేష్ పట్టు విడువకపోవడానికి కారణం ఇదా!!

బాల భార‌తం : అమ్మా! న‌న్ను ఒంట‌రిని చేయొద్దు ప్లీజ్

ప్రభాస్ "సాహో" ఫ్యాన్స్ కి మాత్రమే..

చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

బుల్లి పిట్ట: సగం ధరకే.. షావోమి స్మార్ట్ వాచ్..!

బాల భార‌తం : ఆ చిన్నారుల కోసం ఆన్లైన్ పాఠాలు ఎందుకంటే?

యూట్యూబ్ ని షేక్ చేసిన 'సర్కారు వారి పాట బ్లాస్ట్'..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>