MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kangana-means-shaking-3f38ff08-f2fd-40dd-be2a-9e4551f57a32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kangana-means-shaking-3f38ff08-f2fd-40dd-be2a-9e4551f57a32-415x250-IndiaHerald.jpgకాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తన కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీ పురాస్కారాన్ని అందుకుంది. ఆ తరువాత ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదని, కేవలం భిక్ష అని, 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాకే అసలైన స్వాతంత్యం వచ్చింది అని అంటూ కంగనా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కంగనా అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ పలు పార్టీలతో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రమKangana Ranaut Controversy;{#}Queen;Kangana Ranaut;Padma Shri;Government;Singer;Chitram;Cinemaభగత్ సింగ్ ను గుర్తు చేస్తూ కంగనాకు సింగర్ కౌంటర్భగత్ సింగ్ ను గుర్తు చేస్తూ కంగనాకు సింగర్ కౌంటర్Kangana Ranaut Controversy;{#}Queen;Kangana Ranaut;Padma Shri;Government;Singer;Chitram;CinemaSun, 14 Nov 2021 17:30:00 GMTకాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తన కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీ పురాస్కారాన్ని అందుకుంది. ఆ తరువాత ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదని, కేవలం భిక్ష అని, 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాకే అసలైన స్వాతంత్యం వచ్చింది అని అంటూ కంగనా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కంగనా అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ పలు పార్టీలతో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ గాయకుడు విశాల్ దద్లానీ భగత్ సింగ్ త్యాగాన్ని గుర్తు చేస్తూ కంగనాపై ఓ పోస్ట్ ద్వారా విరుచుకుపడ్డారు.

విశాల్ దద్లానీ తన ఫోటోతో కూడిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో అతను బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని కూర్చున్నాడు ఆయన టీ షర్ట్ మీద భగత్ సింగ్ చిత్రం ఉంది. "మన స్వాతంత్య్రం 'భిక్ష' అని చెప్పిన మహిళను గుర్తు చేసుకోండి. నా టీ షర్ట్ మీద ఉన్న వ్యక్తి షహీద్ సర్దార్ భగత్ సింగ్, నాస్తికుడు, కవి తత్వవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశపు కుమారుడు మరియు ఒక రైతు కుమారుడు. ఆయన 23 సంవత్సరాల వయస్సులో మన స్వాతంత్య్రం కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించాడు. అతని పెదవులపై చిరునవ్వుతో పాట పాడుతూ ఉరికి సిద్ధమయ్యాడు. ఆయన గురించి సుఖ్‌దేవ్, రాజ్‌గురు, అష్ఫాఖుల్లా వంటి నమస్కరించడానికి, అడుక్కోవడానికి నిరాకరించిన అనేక వేల మంది గురించి ఆమెకు గుర్తు చేయండి. ఆమెకు మర్యాదపూర్వకంగా, కానీ గట్టిగా గుర్తు చేయండి. అప్పుడు ఆమె మళ్ళీ మరచిపోయే ధైర్యం చేయదు.

సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే కంగనా మాత్రం సమర్థిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన కథనాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల ఆమెపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. దేశ ద్రోహం కింద కేసులు పెట్టాలని రాజకీయ పార్టీలు అంటున్నాయి.