PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpb9eeb1dd-537b-49bd-9bfe-b5921dbbee3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpb9eeb1dd-537b-49bd-9bfe-b5921dbbee3a-415x250-IndiaHerald.jpgసీఎం జగ‌న్ కు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. కొత్త పీఆర్సీ కి సంబంధించి ఉద్యోగుల నుంచి తీవ్రమ‌యిన ఒత్తిళ్లు వ‌స్తున్నా యి. ముఖ్యంగా పీఆర్సీ నివేదిక అందించ‌డంలో సంబంధిత అధికారులు జాప్యం చేయ‌డంపై ర‌గడ నెల‌కొంటుంది. వాస్త‌వానికి పీఆర్సీ క‌న్నా ముందే రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్న‌డూ లేనంత‌గా 27శాతం ఐఆర్ ను ప్ర‌క‌టించింది. ఇక ర‌గ‌డ‌కు తావులేకుండా ఉండేందుకు ఇప్ప‌టికే ఎన్నో సార్లు ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. ycp{#}surya sivakumar;Alla Ramakrishna Reddy;Reddy;Bharatiya Janata Party;Government;CM;Andhra Pradeshఓవ‌ర్ టు జ‌గ‌న్ : స‌చివాల‌యంలో బీజేపీ కోవ‌ర్టులు!ఓవ‌ర్ టు జ‌గ‌న్ : స‌చివాల‌యంలో బీజేపీ కోవ‌ర్టులు!ycp{#}surya sivakumar;Alla Ramakrishna Reddy;Reddy;Bharatiya Janata Party;Government;CM;Andhra PradeshSat, 13 Nov 2021 11:55:53 GMTసీఎం జగ‌న్ కు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. కొత్త పీఆర్సీ కి సంబంధించి ఉద్యోగుల నుంచి తీవ్రమ‌యిన ఒత్తిళ్లు వ‌స్తున్నా యి. ముఖ్యంగా పీఆర్సీ నివేదిక అందించ‌డంలో సంబంధిత అధికారులు జాప్యం చేయ‌డంపై ర‌గడ నెల‌కొంటుంది. వాస్త‌వానికి పీఆర్సీ క‌న్నా ముందే రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్న‌డూ లేనంత‌గా 27శాతం ఐఆర్ ను ప్ర‌క‌టించింది. ఇక ర‌గ‌డ‌కు తావులేకుండా ఉండేందుకు ఇప్ప‌టికే ఎన్నో సార్లు ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగ సంఘాలు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీ ఏన్జీఓ లీడ‌ర్లకు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకపోయింది. దీంతో ఏపీ ఎన్జీఓ అధినేత బండి శ్రీ‌నుకు రాష్ట్ర ప్ర‌భుత్వ అధినేత‌కు మ‌ధ్య విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఏపీ ఎన్జీఓ సంఘం ప‌రువు తీసేందుకు మ‌రో సంఘం కూడా పావులు క‌దుపుతోంది. వాస్త‌వానికి ఏపీ ఎన్జీఓ సంఘంతో పాటు ఇంకొన్ని సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ద‌గ్గ‌ర చాలా చేరువ‌గానే ఉన్నాయి. కానీ పీఆర్సీ తీసుకువ‌స్తే మంచి క్రెడిట్ ఉద్యోగుల‌లో ద‌క్కుతుంద‌న్న పంతంలో భాగంగా వీళ్లంతా బాహాటంగా సీఎం ను వ్య‌తిరేకిస్తున్నారు. వాస్త‌వానికి వీరి ఉద్దేశం వేరేలా ఉంది.

ఇక ఏపీఎన్జీఓల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ఒక‌టి న‌డుస్తోంది. ఏపీ ఎంప్లాయీస్ యూనియ‌న్ (ఏపీఈఎస్) పేరిట కేఆర్ సూర్య నారాయ‌ణ న‌డిపిస్తున్న ఈ సంఘం ఎప్ప‌టి నుంచో బీజేపీకి అనుబంధంగా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో సీఎం కూడా వీరిని దూరం పెట్టార‌ని ఏపీ ఎన్జీఓ సంఘం ఆరోపిస్తుంది. మొద‌ట్లో వీరంతా సీఎంకు ద‌గ్గ‌ర కావడానికి ప్ర‌య‌త్నించి కాస్త స‌ఫ‌లీకృతం అయిన‌ప్ప‌టికీ త‌రువాత వీరంతా బీజేపీ మ‌నుషులు అని తెలిసి సీఎం జాగ్ర‌త్త ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీంతో కేఆర్ వ‌ర్గాన్ని సొంతం చేసుకునేందుకు ఏపీ స‌ర్కారు ఇష్ట‌ప‌డ‌డం లేదు. గ‌తంలో మాదిరిగా ఏపీఎన్జీఓల‌తోనే పోవాల‌న్న‌ది జ‌గ‌న్ యోచ‌న‌గా ఉంది. బండి శ్రీ‌నుతో ఉన్న అనుబంధం రీత్యా ఆయ‌న‌తోనే అన్ని చ‌ర్చ‌లూ జ‌రిపేందుకు సిద్ధం అవుతున్నారు జ‌గ‌న్. ఇదే సమ‌యంలో వెంట‌క్రామి రెడ్డి అనే ఉద్యోగ సంఘం నేత కూ జ‌గ‌న్ కూ మంచి బంధం ఉండడంతో ఆయ‌నే అన్నీ అయి కొంత స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తున్నార‌ని  స‌మాచారం. ఇప్పుడు ఏపీ స‌చివాల‌యంలో పీఆర్సీపై ర‌గులుతున్న ర‌గ‌డ‌కు కొంత రాజకీయ నేప‌థ్యం కూడా ఉంద‌న్న‌ది  సుస్ప‌ష్టం.



మోడీ 51 గంటల దీక్ష ఎందుకు...?

ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అంటున్న ఉద్యోగులు....!

8 ఏళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడి..!

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>