PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/electioncf76d318-7887-4034-8947-7b605adaac36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/electioncf76d318-7887-4034-8947-7b605adaac36-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు బాగా హైలెట్ అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. అధికార పార్టీ నాయకులు చాలా సీరియస్ గా ప్రచారం నిర్వహిస్తూ విపక్షాలను గట్టిగా ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపిలో మినీ పల్లెపోరుకు సై అంటున్నాయి కొన్ని పార్టీలు. రేపు మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు సర్వం సిధ్దం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నాహకాలపై నేడు ఎస్ ఇ సి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీelection{#}Mini;Elections;local language;Andhra Pradesh;sunday;District;Partyఏపీలో రేపే పల్లెపోరు... ఎన్ని పంచాయితీల్లో...?ఏపీలో రేపే పల్లెపోరు... ఎన్ని పంచాయితీల్లో...?election{#}Mini;Elections;local language;Andhra Pradesh;sunday;District;PartySat, 13 Nov 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు బాగా హైలెట్ అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. అధికార పార్టీ నాయకులు చాలా సీరియస్ గా ప్రచారం నిర్వహిస్తూ విపక్షాలను గట్టిగా ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపిలో మినీ పల్లెపోరుకు సై అంటున్నాయి కొన్ని పార్టీలు. రేపు మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు సర్వం సిధ్దం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నాహకాలపై  నేడు ఎస్ ఇ సి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.

మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఏకగ్రీవం అయిన 30 స్ధానాలు అని ప్రకటన చేసారు. 36 పంచాయితీల్లో ఆదివారం  సర్పెంచ్ స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. 3 స్ధానాల్లో  నామినేషన్ దాఖలు కాలేదని తెలిపింది. 36 స్ధానాలకు బరిలో 88మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 533 వార్డు మెంబర్ల స్ధానాలకు నోటిఫికేషన్  విడుదల చేసారు. ఏకగ్రీవం అయిన స్ధానాలు 380గా ప్రకటన చేసారు.

85 వార్డులలో నామినేషన్ లు దాఖలు కాలేదని ఎన్నికల సంఘం వివరించింది. 68 వార్డు మెంబర్లకు రేపు పోలింగ్ జరుగుతుంది అని తెలిపింది. బరిలో 148మంది అభ్యర్ధులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యప్తంగా రేపు మినీ పల్లె పోరులో  ఓటు హక్కును వినియోగంచుకోనున్న ఓటర్లు 1,00032మంది అని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం పోలీంగ్ స్టేషన్లు 350గా ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 154గా గుర్తించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 46 అని ఎన్నికల సంఘం వివరించింది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవి 1 అని తెలిపారు. 63స్ధానాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేసామని ఎన్నికల కోసం 363 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. 219 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారని 420మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారని వివరించారు. ఇతర పోలింగ్ సిబ్బంది 852మంది కాగా జోనల్ ఆఫీసర్లు 158 ఉన్నారు.



భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?

ఈ దేశాలకు వెళ్ళడానికి వీసా అక్కర్లేదని తెలుసా ?

అటు కరోనా వైరస్.. ఇటు నోరా వైరస్.. అజాగ్రత్త వహిస్తే అంతే..!

ఈఢీ : కేసీఆర్ కు జ‌గ‌న్ త‌ర‌హా ట్రీట్మెంట్

జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్ ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>