PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maharastrac60-222643f7-0702-4fb8-954f-0cf0338b62e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maharastrac60-222643f7-0702-4fb8-954f-0cf0338b62e0-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి లోని జిల్లా గార్యపట్టి అడవులలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 26మంది మృతి చెందినట్టు తెలుసుంది. ఇందులో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన స్థలంలో నేటి ఉదయం నుండి హోరాహోరీగా పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల మావో అగ్రనేత మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఘటనలో కూడా భారీగానే మావోలు మృతిచెందారు. ఉదయం నుండి జరిగిన ఈ పోరులో పలువురు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ప్రాంతీయ ఎస్పీ అంకిత్ గోయల్maharastrac60;{#}Prize;Krack;Gift;Maharashtra;police;local language;District;Government;Newsభారీ ఎన్కౌంటర్ : గడ్చిరోలిలో.. 26మంది మృతి..!భారీ ఎన్కౌంటర్ : గడ్చిరోలిలో.. 26మంది మృతి..!maharastrac60;{#}Prize;Krack;Gift;Maharashtra;police;local language;District;Government;NewsSat, 13 Nov 2021 22:25:36 GMTమహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి లోని జిల్లా గార్యపట్టి అడవులలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 26మంది మృతి చెందినట్టు తెలుసుంది. ఇందులో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన స్థలంలో నేటి ఉదయం నుండి హోరాహోరీగా పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల మావో అగ్రనేత మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఘటనలో కూడా భారీగానే మావోలు మృతిచెందారు. ఉదయం నుండి జరిగిన ఈ పోరులో పలువురు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ప్రాంతీయ ఎస్పీ అంకిత్ గోయల్ స్పందించారు. ఘటనలో 26మంది మావోలు మరణించినట్టు ధ్రువీకరించారు. ఈ హొరాహొరిపోరులో అనేక మావోల శిబిరాలు ధ్వంసం చేయబడ్డాయి. ఉదయం 7కు ప్రారంభం అయిన ఈ ఆపరేషన్ గంటలపాటు సాగింది.

ఇందులో గాయపడిన అధికారులను హెలికాఫ్టర్ ద్వారా నాగపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు ముందస్తు సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. గడ్చిరోలిలో పెద్ద ఎత్తున మావోల శిబిరాలు ఉన్నట్టు తెలియడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆపరేషన్ ప్రారంభించారు. స్థానిక ప్రాంతాలలో శిబిరాల కోసం వెతుకుతుండగా ఇరువురు ఎదురవ్వడం, కాల్పులు ప్రారంభించడం జరిగింది. దీనితో ఇరు వర్గాల మధ్య గంటలపాటు ఈ పోరు జరిగింది. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే ఛత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో కూడా గత వారంలో జరిగిన రెండు ఎన్కౌంటర్ లలో నలుగురు మావోలు మృతి చెందారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల బహుమతి కూడా ప్రకటించింది.

మహారాష్ట్ర ఆపరేషన్ లో పోలీసులకు చెందిన సి60 స్క్వాడ్ భారీగా మావోలను హతమార్చగలిగింది. అయితే తాజాగా మావోలు దాడి చేసి మరి పోలీసులను 15మందిని హతమార్చడంతో నేటి చర్య ప్రతీకారంగా పరిగణించబడుతుంది. మరణించిన వారందరు సి60 స్క్వాడ్ కు చెందినవారు కావడం తో వాళ్ళే నేడు సరైన సమాచారంతో మావోల శిబిరాలపై దాడులు చేశారు. ఈ దాడిలో 26 మంది మావోలు చనిపోగా, 3 అధికారులు గాయాలపాలయ్యారు. మావోల కోసమే ఈ సి60 స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 1990లో ఏర్పాటు చేశారు. తెలంగాణాలో గ్రేహౌండ్ బలగాలు, ఏపీలో సొగ్(ఎస్.ఓ.జి) ప్రత్యేక బలగాలు మాదిరే ఈ సి60 మహారాష్ట్ర ప్రత్యేకంగా మావోల కోసం ఏర్పాటు చేసుకున్న బలగాలు. ఈ బలగాల ప్రధాన ఉద్దేశ్యం మావోలను ఎదుర్కోవడమే. వీళ్ళను క్రాక్ కమాండోస్ అని కూడా పిలుస్తారు.



వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు

కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!

కేసీఆర్ టాక్స్ : త్వ‌ర‌లో జైలుకు! ఇది ఫిక్స్‌!

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>