PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3c214efd-69a6-449c-ab2d-1444379aeb1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3c214efd-69a6-449c-ab2d-1444379aeb1d-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఘాటు వ్యాఖ్యలు, పరుష పదజాలం అంత్యంత సామాన్యంగా మారిపోయాయి. అసలు అలా తిట్టుకోకపోతే.. నాయకులే కారు అన్నట్టుగా రోజులు మారాయి. ఎంత ఎక్కువగా తిట్టగలిగితే.. అంత గొప్ప.. ఎంత ఎక్కువగా రెచ్చగొట్టగలిగితే అంత గొప్ప.. అలా తయారయ్యింది రాజకీయం. దీనికి తోడు సొంత రాష్ట్రం వ్యవహారాలే కాదు.. పొరుగు రాష్ట్ర వ్యవహారాల్లోనూ కొందరు వేలు పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో టీఆర్ఎస్ నేతలు ముందు వరుసగా ఉంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితంతో దిమ్మతిరిగిందో.. లేక హుజూరాబాద్ ఫలితం నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నాkcr{#}Car;prasanth;Prashant Kishor;Telangana Rashtra Samithi TRS;Minister;Jagan;Telangana;KCR;Andhra Pradesh;Partyజగన్‌ను కెలుకుతున్న కేసీఆర్‌ టీమ్.. ఏం ఓపికరా బాబూ..?జగన్‌ను కెలుకుతున్న కేసీఆర్‌ టీమ్.. ఏం ఓపికరా బాబూ..?kcr{#}Car;prasanth;Prashant Kishor;Telangana Rashtra Samithi TRS;Minister;Jagan;Telangana;KCR;Andhra Pradesh;PartySat, 13 Nov 2021 00:00:00 GMTరాజకీయాల్లో ఘాటు వ్యాఖ్యలు, పరుష పదజాలం అంత్యంత సామాన్యంగా మారిపోయాయి. అసలు అలా తిట్టుకోకపోతే.. నాయకులే  కారు అన్నట్టుగా రోజులు మారాయి. ఎంత ఎక్కువగా తిట్టగలిగితే.. అంత గొప్ప.. ఎంత ఎక్కువగా రెచ్చగొట్టగలిగితే అంత గొప్ప.. అలా తయారయ్యింది రాజకీయం. దీనికి తోడు సొంత రాష్ట్రం వ్యవహారాలే కాదు.. పొరుగు రాష్ట్ర వ్యవహారాల్లోనూ కొందరు వేలు పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో టీఆర్ఎస్ నేతలు ముందు వరుసగా ఉంటున్నారు.


హుజూరాబాద్ ఎన్నికల ఫలితంతో దిమ్మతిరిగిందో.. లేక హుజూరాబాద్ ఫలితం నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారో తెలియదు కానీ.. టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పొరుగు రాష్ట్రం ఏపీతో వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న.. కేసీఆర్ స్వయంగా తమను ఏపీలో పార్టీ పెట్టమని వేల కొద్దీ ఉత్తరాలు, ఫోన్లు వస్తున్నాయని ఓ రాయి విసిరారు. ఇక ఇప్పుడు తాజాగా మరో మంత్రి ఏకంగా హద్దులు దాటేశాడు. పక్కరాష్ట్రం సీఎంను వాడు, వీడు అంటూ మాట్లాడుతూ తన స్థాయి దిగజార్చుకున్నాడు.  


జగన్ రోజూ కేంద్రం ముందు బిచ్చమెత్తుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అప్పట్లో ఉమ్మడి ఏపీ విడిపోతే.. తెలంగాణ అడుక్కుతింటుందని ప్రచారం చేశారని.. ఇప్పుడు ఆ ఆంధ్రోల్లే అడుక్కుతింటున్నారని ప్రశాంత్ రెడ్డి రెచ్చిపోయారు. కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలో టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అది కేంద్రాన్ని వ్యతిరేకిచే దీక్ష.. అసలు అక్కడ ఏపీ ప్రస్తావన అవసరమే లేదు.


కేంద్రాన్ని ఎంతైనా తిట్టుకోవచ్చు.. కానీ.. పనిగట్టుకుని జగన్‌ ను టీఆర్ఎస్ నాయకులు తిట్టాల్సిన అవసరం ఏముంది.. సొంత ప్రభుత్వాన్ని ఏ మంత్రి అయినా ఎంతైనా పొగుడుకోవచ్చు.. కానీ.. పొరుగు రాష్ట్రాన్ని అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. ఏపీ సీఎం జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. సజ్జల వంటి సీనియర్ నాయకులతో బదులు చెప్పించడం తప్ప.. లైట్ గానే తీసుకుంటున్నారు. ఎంతైనా జగన్ ఓపికకు మెచ్చుకోవాల్సిందేనేమో.  





కొత్త మంత్రులకు అసలు పట్టు దొరకలేదా?

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>