PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan4a7d1fe5-b02c-4e02-a037-dbe01ca0949b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan4a7d1fe5-b02c-4e02-a037-dbe01ca0949b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ముందుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలనే టార్గెట్ చేశారు. పార్టీ అధిష్ఠానం పెద్ద నేతలపై కేసులు వేశారు. ఇక కింది స్థాయి కార్యకర్తల అయితే తమ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారు కూడా. అదే సమయంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదు చేసి.. నేతలను అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు అధినేతలపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టేశారు. నిన్న మొనJagan{#}Turmeric;Hanu Raghavapudi;kuppam;Mangalagiri;CBN;TDP;Telugu Desam Party;Jagan;YCP;Party;Y. S. Rajasekhara Reddy;Minister;politics;Capital;Arrestకుప్పంపై జగన్... మంగళగిరిపై చంద్రబాబు... పాలి"ట్రిక్స"..!కుప్పంపై జగన్... మంగళగిరిపై చంద్రబాబు... పాలి"ట్రిక్స"..!Jagan{#}Turmeric;Hanu Raghavapudi;kuppam;Mangalagiri;CBN;TDP;Telugu Desam Party;Jagan;YCP;Party;Y. S. Rajasekhara Reddy;Minister;politics;Capital;ArrestSat, 13 Nov 2021 16:32:50 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ముందుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలనే టార్గెట్ చేశారు. పార్టీ అధిష్ఠానం పెద్ద నేతలపై కేసులు వేశారు. ఇక కింది స్థాయి కార్యకర్తల అయితే తమ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారు కూడా. అదే సమయంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదు చేసి.. నేతలను అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు అధినేతలపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టేశారు. నిన్న మొన్నటి వరకు ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తెలుగు దేశం పార్టీ అధినేతను ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓడించాలని వైసీపీ అధినేత జగన్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల్లో విజయం కోసం అవకాశం ఉన్న అన్ని మార్గాలను జగన్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో టీడీపీని ఓడించిన వైసీపీ... కుప్పం మునిసిపాలిటీపై కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆ బాధ్యతను జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు అప్పగించారు వైఎస్ జగన్.

అయితే చంద్రబాబు కూడా తక్కువేం తినలేదు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.... వైసీపీ అధినేతకు గట్టి షాక్ ఇచ్చారు. జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావించే మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇప్పటికే పరిషత్ పోరులో టీడీపీ విజయాలు అందుకుంది. దుగ్గిరాల మండలంలో టీడీపీ జెండా రెపరెపలాడటంతో... వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సొంత నియోజకవర్గంలోనే రాజధాని సెగ తగలడంతో... పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురుతుందని ఇప్పటికే అంతా భావిస్తున్నారు. దీంతో తన క్యాంపు కార్యాలయం ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ ఓడితే పరువు పోతుందని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆర్కే తీరు, మూడు రాజధానుల వ్యవహారం... మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు జగన్ భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే... నివాసం ఉంటున్న సొంత నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమే.





కుప్పం కోట కోసం నానా పాట్లు..!

బ్రేకింగ్: ఢిల్లీలో మళ్ళీ లాక్ డౌన్, అయితే కారణం కరోనా కాదు...?

ఇన్‌స్టాగ్రామ్ లో 10 వేల డాలర్ల బోనస్

800 కోట్ల జనాభాకు..లక్ష ఏళ్లకు సరిపడా ఆక్సీజన్ !!

బ్రేకింగ్: దొంగ నోట్ల కేసులో టాలీవుడ్ నిర్మాత అరెస్ట్...!

మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన పవన్ కళ్యాణ్..?

పవన్ కు షాక్ ఇచ్చిన నితిన్..!

దాసరి పై అలా పగ తీర్చుకున్నానంటున్న హీరో ..!

రామ్ చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో మకాం వేయనున్నా శంకర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>