ActorsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/actors-26b072a4-ac4d-4bcf-9911-90c4f03d6057-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/actors-26b072a4-ac4d-4bcf-9911-90c4f03d6057-415x250-IndiaHerald.jpg2014కు ముందు గుజరాత్లో మోడీ కూడా బిక్ష కాలంలోనే సీఎం గా ఉన్నారా,నిజమైన దేశభక్తురాలా సమాధానం చెప్పంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంట్రవర్సీ కామెంట్స్ కు ఓ అవార్డు పెడితే అందులోనూ పద్మశ్రీ అందుకునే స్థాయికి ఆమె ఎదిగింది అన్నది కొందరి విమర్శ. కంగనా వ్యాఖ్యలపై కేంద్ర మౌనం వీడాలని లేదంటే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అంటోంది. దేశ వీరులను అవమానించేలా మాట్లాడిన కంగనాకు తగిన బుద్ధి చెప్పాలని ఆమెకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నేత నారాయణరావుActors {#}Kangana Ranaut;tara;Konakalla Narayana Rao;Shiv Sena;Padma Shri;Raccha;bollywood;media;Queen;Congress;Bharatiya Janata Party;Government;central government;CM;Indiaకంగనా కావాలనే అలా మాట్లాడిందా..?కంగనా కావాలనే అలా మాట్లాడిందా..?Actors {#}Kangana Ranaut;tara;Konakalla Narayana Rao;Shiv Sena;Padma Shri;Raccha;bollywood;media;Queen;Congress;Bharatiya Janata Party;Government;central government;CM;IndiaSat, 13 Nov 2021 11:45:21 GMTనీతులు చెప్పే వాళ్ళు తమ మూతులు చూసుకోరు అని ఒక సామెత ఉంది. ఇది కంగనారనౌత్ పక్కాగా సరిపోతుందని  సోషల్ మీడియా టాక్. సంబంధం లేని విషయాన్ని కదిలించి మరీ కాంట్రవర్సీ కేరాఫ్ గా నిలవడం ఆమెకు అలవాటు. చేసింది గుప్పెడు సినిమాలు, అయినా సరే మోయలేనంత, మోయడానికి తీరిక లేనంత వివాదాన్ని సంపాదించుకుంది కంగనా . నటి కావాలని ఇండస్ట్రీకి వచ్చింది. చాలా కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. ఇలా వచ్చిన పేరును అనవసర వివాదాలతో పోగొట్టుకుంటుంది కంగనా రనౌత్ అన్నది కొందరి వాదన. నేటి రాజకీయాల నుంచి స్వాతంత్ర పోరాటం వరకు అన్నింటిపై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెరపై నటించే తార వివాదాలకు తెర తీస్తుంటుంది . లేటెస్ట్ గా మరో కాంట్రవర్సీ లో చిక్కుకుంది. వరుస రాజకీయ విమర్శలతో నానా రచ్చ చేస్తున్న కంగనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కి భక్తురాలిగా మారిపోయారని ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయ్యారు. కంగనా పై మాటలు హద్దులు దాటుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఛాన్స్ దొరికితే చాలు మహారాష్ట్రలోని శివసేన పై అంతెత్తున ఎగురుతుంది. అది కూడా తన ఇష్టమే అనుకోవచ్చు కానీ స్వాతంత్రం గురించి ఈ కాంట్రవర్సి క్వీన్ చేసినటువంటి వ్యాఖ్యలు కొత్త వేడి రాజేస్తున్నాయి. పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యక్తి మాట్లాడే స్థాయేనా ఇది అన్న విమర్శలకు కారణమవుతోంది. 1947లో భారత్ కు స్వాతంత్య్రం రాలేదని, అది కేవలం బిక్ష మాత్రమేనని దేశానికి 2014లో మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని  కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. 2014 మే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు కంగనా కామెంట్ చేసింది. కంగనా మాటలు రాజకీయంగా సెగలు లేపుతుండగా, నెటిజన్లు  కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. 2014లో స్వాతంత్రం వచ్చిందంటున్నారు కదా 1999లో వాజ్ పేయి సారథ్యంలోనీ ప్రభుత్వం కూడా బిక్ష కాలమేనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

 2014కు ముందు గుజరాత్లో మోడీ కూడా బిక్ష కాలంలోనే సీఎం గా ఉన్నారా,నిజమైన దేశభక్తురాలా సమాధానం చెప్పంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంట్రవర్సీ కామెంట్స్ కు ఓ అవార్డు పెడితే అందులోనూ పద్మశ్రీ అందుకునే స్థాయికి ఆమె ఎదిగింది అన్నది కొందరి విమర్శ. కంగనా వ్యాఖ్యలపై కేంద్ర మౌనం వీడాలని లేదంటే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అంటోంది. దేశ వీరులను అవమానించేలా మాట్లాడిన కంగనాకు తగిన బుద్ధి చెప్పాలని ఆమెకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నేత  నారాయణరావు కంగనాను విలాసవంతమైన బిక్షగత్తె అన్నారు. కంగనాకు స్వాతంత్ర పోరాటం గురించి ఏమీ తెలియదా అని ఫైర్ అయిన నారాయణ ఆమె అభిమానించే బిజెపికి కూడా స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియదంటూ విమర్శలు గుప్పించారు.



మోడీ 51 గంటల దీక్ష ఎందుకు...?

ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అంటున్న ఉద్యోగులు....!

8 ఏళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడి..!

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>