Lady: అర్దరాత్రి మహిళ ఇంట్లో దూరిన రౌడీషీటర్ ?, బయట శిష్యులు కాపలా, రివాల్వర్ తో పోలీసులు!
చెన్నై/మదురై: యుక్తవయసు వచ్చినప్పటి నుంచి చిల్లరగా, జులాయిగా తిరుగుతున్న యువకుడు నేరాలు చెయ్యడం ప్రారంభించాడు. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఆ యువకుడు ఆ సిటీలో పేరుమోసిన రౌడీగా ముద్రవేసుకున్నాడు. కొందరు రౌడీలను వెంట వేసుకుని సెటిల్ మెంట్ లు చెయ్యడం, ఎదురు తిరిగిన వారిని చితకబాది వారిని దోచుకోవడం చేశాడు. రౌడీ ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసులు అతని పేరు రౌడీషీటర్ల జాబితాలో చేర్చారు. అనేక క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లిన రౌడీషీటర్ శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇతని మీద హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారం, లూటీలు, దోపిడీలు తదితర క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
చాలా కాలం నుంచి వివాహిత మహిళ మీద కన్ను వేసిన రౌడీషీటర్ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మహిళ ఎదురు తిరగడంతో ఆమె మీద అత్యాచారం చెయ్యాలని ప్లాన్ వేశాడు. అనుచరులతో కలిసి ఆమె ఇంటి దగ్గరకు వెళ్లిన రౌడీషీటర్ అతని శిష్యులను బయట కాపలా పెట్టి మహిళ ఇంటి లోపలికి వెళ్లాడు. మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు. పోలీసుల మీదే రౌడీషీటర్, అతని అనుచరులు దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. పోలీసులకు ఎక్కడో కాలిపోయి రౌడీషీటర్ మీద కాల్పులు జరపడం కలకలం రేపింది.
Facebook: అమ్మాయిలు, ఆంటీలతో ఫుట్ బాల్ ఆడుకున్నాడు, టార్టెట్ లేడీస్, క్లైమాక్స్ లో భర్తలు ఎంట్రీ!

జులాయిగా తిరిగుతూ రౌడీ అయ్యాడు
తమిళనాడులోని మధురై సిటీలో విజయ్ అలియాస్ కురివి విజయ్ అనే రౌడీషీటర్ నివాసం ఉంటున్నాడు. యుక్తవయసు వచ్చినప్పటి నుంచి చిల్లరగా, జులాయిగా తిరుగుతున్న విజయ్ నేరాలు చెయ్యడం ప్రారంభించాడు. విచ్చలవిడిగా రెచ్చిపోయిన విజయ్ మధురై సిటీలో పేరుమోసిన రౌడీగా ముద్రవేసుకున్నాడు.

సెటిల్ మెంట్ లు, దందాలు
కొందరు రౌడీలను వెంట వేసుకుని తిరిగిన విజయ్ సెటిల్ మెంట్ లు చెయ్యడం, ఎదురు తిరిగిన వారిని చితకబాది వారిని దోచుకోవడం చేశాడు. రౌడీ విజయ్ ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసులు విజయ్ పేరు రౌడీషీటర్ల జాబితాలో చేర్చారు. రానురాను విజయ్ హత్యలు చెయ్యడం మొదలు పెట్టాడు. విజయ్ అతనికంటూ ప్రత్యేకంగా ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు.

బెయిల్ మీద బయటకు వచ్చిన రౌడీ
విజయ్ అనే పేరు చాలా మందికి ఉండటంతో తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న రౌడీషీటర్ విజయ్ అతని పేరును కురివి విజయ్ గా మార్చుకున్నాడు. అనేక క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లిన రౌడీషీటర్ కురవి విజయ్ శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చాడు. విజయ్ మీద హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారం, లూటీలు, దోపిడీలు తదితర క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

వివాహిత మహిళ మీద కన్నుపడింది
మధురైలోని అన్నానగర్ లోని షెన్ బగతోట్టం ఏరియాలో అందంగా ఉన్న ఓ వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. చాలా కాలం నుంచి వివాహిత మహిళ మీద కన్ను వేసిన రౌడీషీటర్ విజయ్ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మహిళ ఎదురు తిరగడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని, ఆమె మీద అత్యాచారం చెయ్యాలని విజయ్ ప్లాన్ వేశాడు.

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
శుక్రవారం అర్దరాత్రి అనుచరులతో కలిసి అన్నానగర్ లోని ఆమె ఇంటి దగ్గరకు వెళ్లిన రౌడీషీటర్ విజయ్ అతని శిష్యులను ఆమె ఇంటి బయట కాపలా పెట్టి మహిళ ఇంటి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి రౌడీషీటర్ విజయ్ విఫలయత్నం చేశాడు. ఆ సమయంలో మహిళ గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాల్పులు జరిపిన పోలీసులు
విషయం తెలుసుకున్న మధురై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్ విజయ్ ని, అతని అనుచరులను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు. పోలీసుల మీదే రౌడీషీటర్ విజయ్, అతని అనుచరులు దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులకు ఎక్కడో కాలిపోయి రౌడీషీటర్ విజయ్ మీద కాల్పులు జరిపారు. విజయ్ కాలిలో తూటాలు దూసుకుపోయియి.

కాలాంతకుడు
మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో రౌడీషీటర్ విజయ్ కి చికిత్స అందిస్తున్నారు. విజయ్ అనుచరునుల పోలీసులు అరెస్టు చేశారు. పేరు మోసిన రౌడీషీటర్ విజయ్ మీద కాల్పులు జరపడం మధురైలో కలకలం రేపింది. ఎన్నో కేసుల్లో నిందితుడు అయిన కురివి విజయ్ మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన కేసులో అడ్డంగా బుక్కైపోయాడని పోలీసులు అంటున్నారు.