PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/note-for-vote8b1a84f4-34cb-4ae9-8cb0-07710de2fc09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/note-for-vote8b1a84f4-34cb-4ae9-8cb0-07710de2fc09-415x250-IndiaHerald.jpgఎన్నికలంటే చాలు.. ప్రచారం, హంగామా, బిర్యానీలు, మందు పంపకాలు, నగదు పంపిణీ ఇలా జాతర వాతావరణం కనిపిస్తుంది. ఒక్క అసెంబ్లీ ఎన్నికలే కాదు..స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే జోరు నడుస్తూ ఉంటుంది. ఇటీవలే తెలంగాణాలోని హుజూరాబాద్ ఎన్నికల్లోనూ నగదు ప్రవాహం ఓ రేంజ్ లో సాగింది. ఒక్క ఓటుకు ఆరువేల నుంచి పదివేల రూపాయల వరకూ ఖర్చు చేసినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు కూడా ప్రసారమయ్యాయి. ఇంతభారీగా నగదు ప్రవాహం జరిగినా ఎక్కడా ఎవరిమీదా చర్యలు లేవు. ఎన్నికలు ముగిశాక ఆ విషయాలేవీ ఎవరికీ గుర్తుండవు. అయితే ఏపీలో జరిగిన బద్note for vote{#}Lokesh;Janasena;Assembly;Elections;TDP;local language;Success;Lokesh Kanagaraj;YCP;Nellore;Chittoorప్రచారానికి నేడు తెర.. పంపకాల పండగ ఉందా..? లేదా..?ప్రచారానికి నేడు తెర.. పంపకాల పండగ ఉందా..? లేదా..?note for vote{#}Lokesh;Janasena;Assembly;Elections;TDP;local language;Success;Lokesh Kanagaraj;YCP;Nellore;ChittoorSat, 13 Nov 2021 08:12:28 GMTఎన్నికలంటే చాలు.. ప్రచారం, హంగామా, బిర్యానీలు, మందు పంపకాలు, నగదు పంపిణీ ఇలా జాతర వాతావరణం కనిపిస్తుంది. ఒక్క అసెంబ్లీ ఎన్నికలే కాదు..స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే జోరు నడుస్తూ ఉంటుంది. ఇటీవలే తెలంగాణాలోని హుజూరాబాద్ ఎన్నికల్లోనూ నగదు ప్రవాహం ఓ రేంజ్ లో సాగింది. ఒక్క ఓటుకు ఆరువేల నుంచి పదివేల రూపాయల వరకూ ఖర్చు చేసినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు కూడా ప్రసారమయ్యాయి. ఇంతభారీగా నగదు ప్రవాహం జరిగినా ఎక్కడా ఎవరిమీదా చర్యలు లేవు. ఎన్నికలు ముగిశాక ఆ విషయాలేవీ ఎవరికీ గుర్తుండవు. అయితే ఏపీలో జరిగిన బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో పెద్దగా డబ్బుతో అవసరం రాలేదు.

అయితే ప్రస్తుతం ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఈనెల 15న ఎన్నికలు జరుగుతున్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్ ఇందులో ఒకటి. 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా మిగతా 46 చోట్ల వైసీపీ, టీడీపీతో పాటూ జనసేన, కొన్ని చోట్ల వామపక్షాల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఢీ అంటే ఢీ అంటూ అధికార పార్టీతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు భారీ వర్షాల్లోనూ, దాదాపుగా ప్రచారాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అసలు ఘట్టం ఇప్పటి నుంచే మొదలు కానుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటుకు ఎంత ముట్ట జేబుతారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

నెల్లూరులో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారంతా భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏకగ్రీవాల కోసం టీడీపీ నేతలకు భారీగా నగదును ఎరచూపి, నామినేషన్లను విత్ డ్రా చేసుకునేలా చేశారనే ప్రచారం వినిపిస్తోంది.  మరికొందరిని ప్రచారం చేయనీయకుండా చేయడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఏకాగ్రీవాలు అయిన డివిజన్ల మినహా మిగిలిన డివిజన్లలో నేటి నుంచి నగదు పంపిణీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా పంపకాల విషయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీరు డబ్బులిస్తున్నారంటే, మీరే డబ్బు పంచుతున్నారంటూ.. రెండు వర్గాలు ఎవరికి వారే పని కానిచ్చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ ముక్కుపుడకలు పంచిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలోని కుప్పంలోనూ లోకేష్ పర్యటనలోనగదు పంచేశారని వినిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణతో పోల్చితే ఏపీలో ఎన్నికల నగదు ప్రవాహం తక్కువగానే కనిపిస్తోంది.



మద్యం కంపెనీకే అమ్మఒడి: జగనన్నా.. ఇదేం లాజిక్కన్నా..?

ఏపీలో 3 రోజులు అమిత్‌షా.. జగన్‌ ఏం అడుగుతారో..?

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>