PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/heavy-rains03c2c7bb-5605-4530-b638-e0343fbb3a13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/heavy-rains03c2c7bb-5605-4530-b638-e0343fbb3a13-415x250-IndiaHerald.jpgబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతవారం రోజులుగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తున్నాయి. జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ఏడుగేట్లను ఎత్తేసి, నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని అనేక చెరువులు నిండిపోయాయి. భారీవర్షాలకు కాలువలు పొంగి, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. heavy-rains{#}Godavari River;Vijayanagaram;Srikakulam;Nellore;Prakasam;Chittoor;East Godavari;Vizianagaram;Varshamకోస్తాకు ముప్పు తప్పింది.. గోదావరి మునుగుతోంది..కోస్తాకు ముప్పు తప్పింది.. గోదావరి మునుగుతోంది..heavy-rains{#}Godavari River;Vijayanagaram;Srikakulam;Nellore;Prakasam;Chittoor;East Godavari;Vizianagaram;VarshamSat, 13 Nov 2021 07:03:55 GMTబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతవారం రోజులుగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తున్నాయి. జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ఏడుగేట్లను ఎత్తేసి, నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని అనేక చెరువులు నిండిపోయాయి. భారీవర్షాలకు కాలువలు పొంగి, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ రెండు జిల్లాలను ఇంతలా వణికించిన వాయుగుండం తీరం దాటాక ఇప్పుడు గోదావరి జిల్లాలను కూడా వణికిస్తోంది.

వాయుగుండం తీరం దాటినా.. ఆ ప్రభావంతో గోదావరి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు వాయుగుండం తోడవడంతో వర్షాలు అదుపు లేకుండా కురుస్తున్నాయి. దీంతో గోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరితో పాటూ రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. విశాఖనగరంలోనూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. విశాఖతోపాటు విజయనగరం జిల్లాలోకూడా భారీగా వర్షం కురుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో కూడా వాయుగుండం ప్రభావం కనిపించింది. వీటితో పాటూ ప్రకాశం జిల్లాలోనూ వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో రైతులు నష్టపోయారు. వందలాది ఎకరాల్లో వేసిన వరిపైరు నీట మునిగింది. మినుము పంటకు నష్టం వాటిల్లింది. ఈ వర్షాలు మరో నాలుగు రోజులు ఇలాగే కొనసాగితే వేసిన పంట నాశనం అవుతుందని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిన్నటివరకూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలను వణికించిన భారీవర్షాలు, ఇప్పుడు గోదావరిజిల్లాలపై పగబట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలాగ్రామాలు జలదిగ్భంధంలో ఉండగా, ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందనే వార్తలతో జనం వణికిపోతున్నారు. కొత్తగా ఏర్పడే అల్పపీడనం ప్రభావం ఈనెల 17నుంచి కనిపిస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. అయితే దాని ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉంటుందా, లేక ఉత్తరాంధ్రవైపు వెళ్తుందా అనేది వేచి చూడాలి.



రెండు రోజుల పాటు సీఎం జగన్ తిరుపతి పర్యటన

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>