PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-5e9f338c-34fd-4cf3-8e11-f6bb24268b99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-5e9f338c-34fd-4cf3-8e11-f6bb24268b99-415x250-IndiaHerald.jpgజరుగుతున్నాయి. పలు పంచాయతీలు విలీనం చేయడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. పదేళ్ల తర్వాత కోర్టు ఆమోదంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 29 వార్డులో ఉన్న ఈ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని జనరల్ కు కేటాయించారు. ఏకగ్రీవ ల కోసం ప్రయత్నించినా సాధ్యపడక పోవడంతో అన్ని చోట్లా పోటీ నెలకొంది. కానీ ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేసేందుకు రాజంపేట ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దీటుగా పోటీని ఇచ్చేందుకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి భత్యాల చెంగల్ రాయులు, టిడిపPolitical {#}Scheduled caste;Rajampet;srinivas;Elections;kadapa;local language;court;YCP;TDP;Party;Chequeకడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!Political {#}Scheduled caste;Rajampet;srinivas;Elections;kadapa;local language;court;YCP;TDP;Party;ChequeSat, 13 Nov 2021 19:15:00 GMTకడప జిల్లాలో రాజంపేట, కమలాపురం పురపోరులో అధికారిక వైసిపి ఏకగ్రీవాల వ్యూహం  ఫలించలేదు. అధికార పార్టీ వ్యూహాన్ని గమనించిన ప్రతిపక్ష పార్టీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేవరకు అష్టకష్టాలు పడి తన అభ్యర్థులను కాపాడుతుంది. దీంతో ఒక్క వార్డు మినహా అన్ని చోట్ల టిడిపి బరిలో నిలిచింది. ఉపసంహరణ గడువు ముగియడంతో  పార్టీలు ప్రచారాలపై దృష్టి సారించాయి. ప్రధాన పార్టీలైన వైసిపి,టిడిపి లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైసిపి అదే వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేయాలని భావించింది. కానీ అధికార పార్టీ ఎత్తులకు తలోగ్గక అన్ని వార్డులకు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎక్కడ తమ అభ్యర్థులను పోటీ నుంచి విరమింప చేస్తారన్న భయంతో క్యాంపులకు తరలించి మరి అభ్యర్థులను కాపాడుతుంది. కమలాపురం నగర పంచాయతీగా ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికలో మొత్తం 20 వార్డులు పోటీలో ఉన్నాయి. చైర్మన్ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. మొత్తం 20 వార్డులకు గాను వైసిపి,టిడిపి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే పలు చోట్ల జనసేన, సిపిఐ, స్వతంత్రులు నామినేషన్లు వేశారు.

కొన్ని వార్డుల్లో అయిన టీడీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారని ప్రచారం. కానీ జిల్లాలోని కమలాపురంలో టిడిపి నాయకులు పర్యటించి అధికార పార్టీ ఎత్తుకు చెక్ పెట్టి, ఒక అభ్యర్థిని చేజారకుండా కాపాడుకున్నారు. ఇక రాజంపేట మున్సిపాలిటీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. పలు పంచాయతీలు విలీనం చేయడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. పదేళ్ల తర్వాత కోర్టు ఆమోదంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 29 వార్డులో ఉన్న ఈ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని జనరల్ కు కేటాయించారు. ఏకగ్రీవ ల కోసం ప్రయత్నించినా సాధ్యపడక పోవడంతో అన్ని చోట్లా పోటీ నెలకొంది. కానీ ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేసేందుకు రాజంపేట ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దీటుగా పోటీని ఇచ్చేందుకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి భత్యాల చెంగల్ రాయులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డిలు పోరాడుతున్నారు. మొత్తంమీద అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా తలపడుతుండడంతో  కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట పుర పోరు రసవత్తరంగా మారింది.



కిషన్ రెడ్డి సూటి ప్రశ్న.. వరి ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పిందా..?

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?

ఈ దేశాలకు వెళ్ళడానికి వీసా అక్కర్లేదని తెలుసా ?

అటు కరోనా వైరస్.. ఇటు నోరా వైరస్.. అజాగ్రత్త వహిస్తే అంతే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>