PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vidadala-rajini3ba7fafb-d1be-4867-b5a8-a7c5f98e0349-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vidadala-rajini3ba7fafb-d1be-4867-b5a8-a7c5f98e0349-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో అనూహ్యంగా ఎమ్మెల్యే విడదల రజినీ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఈ ఎన్నికలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ కి ఈసారి కూడా వైసీపీ హ్యాండివ్వడం ఇక్కడ చర్చనీయాంశం అయింది. వాస్తవానికి చిలకలూరిపేటలో రజినీ ప్లేస్ లో 2019లో రాజశేఖర్ పోటీ చేయాల్సింది. 2014లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కూడా టికెట్ కన్ఫామ్ అనుకున్నారు కానీ చివరి నిముషంలో సామాజిక సమీకరణాల లెక్కల్లో టికెట్ రజినీకి దక్కింది. vidadala rajini{#}dr rajasekhar;Jagan;Rajani kanth;Cabinet;MLA;Minister;YCP;Chilakaluripeta;Partyవిడదల రజినీ.. పండగ చేసుకుంటున్నారా..?విడదల రజినీ.. పండగ చేసుకుంటున్నారా..?vidadala rajini{#}dr rajasekhar;Jagan;Rajani kanth;Cabinet;MLA;Minister;YCP;Chilakaluripeta;PartySat, 13 Nov 2021 10:00:00 GMTవైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో అనూహ్యంగా ఎమ్మెల్యే విడదల రజినీ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఈ ఎన్నికలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ కి ఈసారి కూడా వైసీపీ హ్యాండివ్వడం ఇక్కడ చర్చనీయాంశం అయింది. వాస్తవానికి చిలకలూరిపేటలో రజినీ ప్లేస్ లో 2019లో రాజశేఖర్ పోటీ చేయాల్సింది. 2014లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కూడా టికెట్ కన్ఫామ్ అనుకున్నారు కానీ చివరి నిముషంలో సామాజిక సమీకరణాల లెక్కల్లో టికెట్ రజినీకి దక్కింది.

వైసీపీని నమ్ముకుని ఉన్న రాజశేఖర్ ని కాదని, టీడీపీనుంచి వచ్చిన విడదల రజినీకి టికెట్ ఇవ్వడంతో కొంతమంది అసంతృప్తికి లోనైన మాట వాస్తవం. అప్పట్లో రాజశేఖర్ వర్గం కూడా రజినీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకుంది. కానీ ప్రచారానికి వచ్చిన జగన్ స్వయంగా రాజశేఖర్ కి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఊరించారు. రజినీని గెలిపించుకుని వస్తే రాజశేఖర్ ని మంత్రిని చేస్తానన్నారు. అక్కడ రజినీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాజశేఖర్ కి మంత్రి పదవి కాదు కదా కనీసం ఎమ్మెల్సీ కూడా దక్కలేదు. రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పేర్లు ప్రకటిస్తున్నారే కానీ, రాజశేఖర్ కి టైమ్ రాలేదు. అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఈ దఫా పెద్దపీట వేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఈసారి అసంతృప్తులు ఎక్కువమంది ఉంటారనే ఉద్దేశంతోటే.. ప్రకటన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంతగా ఇదయ్యారు. అవకాశాలున్నాయి, ఎవరూ నొచ్చుకోవద్దు, అందరికీ న్యాయం చేస్తామంటూ పదే పదే చెప్పుకొచ్చారు. అయితే రాజశేఖర్ కి హ్యాండివ్వడంతో చిలకలూరిపేటలో ఎమ్మెల్యే రజినీ వర్గం పండగ చేసుకుంటోందని సమాచారం. ఒకరకంగా అక్కడ రజినీకి, రాజశేఖర్ కి మధ్య సయోధ్య లేదు. రెండు గ్రూపులుగా పార్టీ విడిపోయింది. ఇప్పుడు రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఇస్తే కచ్చితంగా అది రజినీ వర్గానికి షాకే. ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి గురించి కూడా ఆలోచించారంటే.. కచ్చితంగా కేబినెట్ లో సీటుపై ఆశపెట్టుకున్న రజినీకి డోర్ క్లోజ్ అయినట్టే. సో.. ఒకరకంగా ఎమ్మెల్యే రజినీ ఆశలు సజీవంగానే ఉన్నాయి, రాజశేఖర్ కి ఛాన్స్ దక్కలేదు. దీంతో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే రజినీ వర్గం సంబరపడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.



తెరాస ఎమ్మెల్సీ సమీకరణాలు.. ఆ నేతలు ఎక్కువగా ఉన్నారా..?

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>