PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/zonal-council-meet04942151-1cb4-48c5-b82a-635c4f1c3128-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/zonal-council-meet04942151-1cb4-48c5-b82a-635c4f1c3128-415x250-IndiaHerald.jpgతిరుపతిలో ఆదివారం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనెంట్ గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు?ఏఏ అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి? అన్న ప్రశ్న సహజంగానే అందరిలోనూ తలెత్తుతుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర హోం శాఖ ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకుంది కూడా. ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఇవే.zonal council meet{#}Andhra Pradesh;sunday;electricity;Tamilnadu;Governor;Minister;Aqua;Jagan;central government;News;Telanganaసదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం : అజెండా ఇదేసదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం : అజెండా ఇదేzonal council meet{#}Andhra Pradesh;sunday;electricity;Tamilnadu;Governor;Minister;Aqua;Jagan;central government;News;TelanganaSat, 13 Nov 2021 09:18:09 GMT
తిరుపతి... దేశం అందరి దృష్టి  ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రం పై ఉంది.  ఆదివారం ఈ నగరంలో సదరన్ జోనల్  కౌన్సినల్ సమావేశం జరగ నుండటంతో ఈ ప్రాధాన్యత ఏర్పడింది.  దక్షిణ భారత దేశంలో ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్ లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ జోనల్  కౌన్సిల్ కు వై.ఎస్ . జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యక్షుడు కావడంతో ఆయనకు ఆతిథ్యం అవకాశం లభించింది. ఈ సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చిస్తున్నారు ? అన్న విషయం పై అందరూ దృష్టి సారించారు.
అంతర్ రాష్ట్ర సమస్యలను ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రాల మధ్య ఉన్న విబేధాలను తొలగించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశంలో ఏఏ అంశాలను చర్చించాలనే విషయం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు  తమ, తమ రాష్ట్రాలలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.  కేంద్ర హోం శాఖ దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల నుంచి  నివేదికలు తెప్పించింది. ఈ మేరకు అజెండా రూపొందించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రధానంగా చర్చిస్తారు. ఇవి చాలా కాలంగా అపరిష్క్రుతంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు బొగ్గు కొరత కారణంగా ఎదుర్కోంటున్న విద్యుత్ సమస్య కూడా ప్రధానంగా అజెండాగా ఉంది.  వివిధ దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర హోం శాఖ కు అందిన నివేదిక ప్రకారం  దాదాపు 26 అంశాలు ప్రాధాన్యతాక్రమంలో చర్చకు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం  నీటి పంపకాల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించ నుంది.  సరిహద్దు రాష్ట్రాలతో  మత్స్యకారులు ఎదుర్కోంటున్న సమస్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్థాలిన్ ప్రస్తావించనున్నారు.
కేరళ, కర్ణాటక  రాష్ట్రాలు కూడా సరిహద్దు సమస్యలు, నీటి పంపకాల విషయాన్నే తమ అజెండాలో చేర్చినట్లు సమాచారం.  అయితే అధ్యక్షుని అనుమతితో ఏ ఇతర అంశమైనా అన్న కాలమ్  కూడా అజెండాలో  చోటు చేసుకుని ఉండటంతో రాష్ట్రాలు అప్పటికప్పుడు  కొత్త అంశాలను ప్రస్తావించే అవకాశం కూడా ఉంది.







టీడీపీలో ఉన్న ఆ న‌లుగురు ల‌గేజ్ స‌ర్దేస్తున్నారా..!

షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?

దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ప్ర‌భావం..?

ఇప్పుడు ఎక్కువగా వీటి హవానే నడుస్తోంది..!

ఏపీలో 3 రోజులు అమిత్‌షా.. జగన్‌ ఏం అడుగుతారో..?

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>