MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-3051e5c19c-170e-4a81-80ef-2f9ff9e98191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-3051e5c19c-170e-4a81-80ef-2f9ff9e98191-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా.. సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ల లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయNTR 30{#}Shiva;sudhakar;vijay sethupathi;NTR Arts;Comedian;lord siva;Writer;Leader;Sangeetha;Jr NTR;Kollywood;ravi anchor;December;NTR;Darsakudu;Director;News;sridhar;Tamil;kalyan;Cinemaఎన్టీఆర్ కోసం కొరటాల భారీ ప్లాన్.. ఏకంగా ఆ ముగ్గురితో..?ఎన్టీఆర్ కోసం కొరటాల భారీ ప్లాన్.. ఏకంగా ఆ ముగ్గురితో..?NTR 30{#}Shiva;sudhakar;vijay sethupathi;NTR Arts;Comedian;lord siva;Writer;Leader;Sangeetha;Jr NTR;Kollywood;ravi anchor;December;NTR;Darsakudu;Director;News;sridhar;Tamil;kalyan;CinemaSat, 13 Nov 2021 20:30:00 GMTటాలీవుడ్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా.. సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ల లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి రేపటి నుంచి స్టోరీ సిట్టింగ్స్ జరగబోతున్న ట్లు సమాచారం. ఇక ఈ సిట్టింగ్స్ లో రచయితలైన శ్రీధర్ సీపాన, మచ్చ రవి తో పాటుగా సీనియర్ రచయిత సత్యానంద్ కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కథ ఫైనల్ అయ్యాక ఆ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ జరగనున్నాయి. ఈ సినిమాకు తమిళ అగ్ర సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనే ఎన్టీఆర్ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

 అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చొరవతో నే ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు సమాచారం. ఇక మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విలన్ కి రైట్ హ్యాండ్ పాత్రలో కమెడియన్ సునీల్ మరో ప్రత్యేకమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో దాదాపు మూడు వేరియేషన్స్ లో ఎన్టీఆర్ కనిపిస్తారట. ఇక తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 22 న సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...!!



ఎన్టీఆర్ కోసం కొరటాల భారీ ప్లాన్.. ఏకంగా ఆ ముగ్గురితో..?

కడప జిల్లాలో ఆ విషయంలో టీడీపీ నెగ్గిందా..!

కేసీఆర్ టాక్స్ : త్వ‌ర‌లో జైలుకు! ఇది ఫిక్స్‌!

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ భరోసా !

తరచుగా వ్యాధులు... ఈ వాస్తు దోషాలు కారణం !

లైఫ్ స్టైల్ : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?

ఆ రెండు శాఖల మీదే కేసీఆర్ ఫుల్ ఫోకస్...?

ఏమౌతుందో! : జగన్ భక్తురాలికి సీబీఐ భయం?

బ్రేకింగ్: సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>