PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-modicabinate02e2564d-a0ca-4493-b050-20af1955f8e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-modicabinate02e2564d-a0ca-4493-b050-20af1955f8e9-415x250-IndiaHerald.jpgకేంద్రంపై విమర్శలు చేస్తే.... కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే... కేంద్ర పాలకులను నిలదీస్తే... అమ్మో ఇంకేమైనా ఉందా... ఐటీ దాడులు, ఈడీ దాడులు, సీబీఐ కేసులు, దేశ ద్రోహులు అనే ముద్ర... ఇలా ఎన్నో ఉంటాయి. నిన్నటి వరకు కేంద్రానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి పక్కలో బల్లెంలా మారారు. కేంద్రంలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడారు. ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కేంద్రాన్ని ఓడించారు కూడా. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రం అగ్గి మీద గుగ్గిలంలా మారింది. ఒక దశలో స్వయంగCabinet{#}KCR;Telangana;West Bengal - Kolkata;Assembly;Aqua;Mamta Mohandas;Uri;Varsham;Bharatiya Janata Party;Prime Minister;CBI;Government;Telangana Chief Minister;central governmentకేంద్రం టార్గెట్... దాడులు తప్పవా...!కేంద్రం టార్గెట్... దాడులు తప్పవా...!Cabinet{#}KCR;Telangana;West Bengal - Kolkata;Assembly;Aqua;Mamta Mohandas;Uri;Varsham;Bharatiya Janata Party;Prime Minister;CBI;Government;Telangana Chief Minister;central governmentSat, 13 Nov 2021 07:50:26 GMTకేంద్రంపై విమర్శలు చేస్తే.... కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే... కేంద్ర పాలకులను నిలదీస్తే... అమ్మో ఇంకేమైనా ఉందా... ఐటీ దాడులు, ఈడీ దాడులు, సీబీఐ కేసులు, దేశ ద్రోహులు అనే ముద్ర... ఇలా ఎన్నో ఉంటాయి. నిన్నటి వరకు కేంద్రానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి పక్కలో బల్లెంలా మారారు. కేంద్రంలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడారు. ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కేంద్రాన్ని ఓడించారు కూడా. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రం అగ్గి మీద గుగ్గిలంలా మారింది. ఒక దశలో స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... నేరుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు కేంద్రం టార్గెట్ మారినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అటు నీటి కేటాయింపులు మొదలు, యాసంగి పంట వడ్లు కొనుగోలు అంశం వరకు కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది కేసీఆర్ ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే నిరసన దీక్షలు చేపడుతోంది. యాసంగి వడ్లు కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి వేస్తే ఉరి అంటూ ప్రకటన చేసింది. దీనిపై రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎదురుదాడి కూడా చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. రైతు ధర్నా పేరుతో కేంద్రం విధానాలను ఎండుగడుతోంది కూడా. కేంద్రానికి ఎదురు తిరగడంతో... రాష్ట్ర ప్రభుత్వంపై దాడుల పర్వం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దాడులు తప్పవని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ హింట్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురిపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ వంతు... ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వంతు వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.





ఇప్పుడు ఎక్కువగా వీటి హవానే నడుస్తోంది..!

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>