PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpe131a23e-b140-409e-a681-b8cb236ac196-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpe131a23e-b140-409e-a681-b8cb236ac196-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మురుగుడు హ‌నుమంత‌రావును ఎంపిక చేయ‌డంపై వైసీపీ శ్రేణులు షాక్ లోకి వెళ్లి పోయాయి. అస‌లు ఆయ‌న వైసీపీ లో ఉన్నారా ? అని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో క్లోజ్ గా ఉంటున్నారే త‌ప్పా.. ఇంకా వైసీపీలో చేర‌లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు చెబుతుండ‌డం పెద్ద ట్విస్టే ఉంది.ఇకYsrcp{#}Guntur;Lokesh;Lokesh Kanagaraj;Backward Classes;local language;రాజీనామా;TDP;Y. S. Rajasekhara Reddy;YCP;Minister;Party;Congressవైసీపీలో చేర‌కుండానే ఎమ్మెల్సీ ప‌ద‌వా... ఇదేం విచిత్రం రా బాబు...!వైసీపీలో చేర‌కుండానే ఎమ్మెల్సీ ప‌ద‌వా... ఇదేం విచిత్రం రా బాబు...!Ysrcp{#}Guntur;Lokesh;Lokesh Kanagaraj;Backward Classes;local language;రాజీనామా;TDP;Y. S. Rajasekhara Reddy;YCP;Minister;Party;CongressSat, 13 Nov 2021 10:42:47 GMTఏపీలో స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మురుగుడు హ‌నుమంత‌రావును ఎంపిక చేయ‌డంపై వైసీపీ శ్రేణులు షాక్ లోకి వెళ్లి పోయాయి. అస‌లు ఆయ‌న వైసీపీ లో ఉన్నారా ? అని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో క్లోజ్ గా ఉంటున్నారే త‌ప్పా.. ఇంకా వైసీపీలో చేర‌లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు చెబుతుండ‌డం పెద్ద ట్విస్టే ఉంది.

ఇక మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మురుగుడు హ‌నుమంత‌రావు చేనేత వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన బీసీ నేత‌. ఆయ‌న గ‌తంలో రెండు సార్లు 1999, 2004లో మంగ‌ళ‌గిరి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేశారు. 2014లో ఆయ‌న టీడీపీలో చేర‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఆప్కో చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డంతో ఆయ‌న ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడికి చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరి టిక్కెట్ ఇస్తాన‌ని చెప్పారు. అయితే చివ‌ర్లో అక్క‌డ లోకేష్ పోటీ చేయ‌డంతో ఆ ఛాన్స్ రాలేదు.

అయితే గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ లోకేష్‌పై ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిని ఓడిస్తే ఇక్క‌డ చేనేత‌ల‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్టు గానే హ‌నుమంత  రావ‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే పార్టీలో న‌మ్మ‌కంగా ఉన్న చేనేత‌ల‌కు కాకుండా అస‌లు పార్టీలో ఎప్పుడు చేరారో ?  ఎప్పుడు పార్టీ లో ఉన్నారో ?  కూడా తెలియ‌ని నేత‌కు ఇవ్వ‌డ‌మే అంద‌రికి షాక్ ఇచ్చింది. మ‌రి ఇలాంటి నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం వ‌ల్ల జ‌గ‌న్ పార్టీ కేడ‌ర్ కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారో ? ఆయ‌న‌కే తెలియాల్సి ఉంది.

 



సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు సైబ‌ర్ కిలాడి వ‌ల.. 95 ల‌క్ష‌లు చోరీ..!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !

బాబు వరుస తప్పులు.. ఇలాగైతే టీడీపీ కోలుకునేదెలా..?

భారత్ లో.. మరో కొత్త వైరస్..!

బీజాపూర్‌ జిల్లాలో సబ్‌ఇంజినీర్‌, అటెండ‌ర్ కిడ్నాప్‌..

డేటింగ్‌పై ర‌ష్మిక ఏమ‌న్న‌దో తెలుసా..?

ఇలా సులభంగా బరువు తగ్గచ్చు..!

షాకింగ్ బ్రహ్మనందాన్ని భరించలేకపోయిన నితిన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>