PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-2243b054-dc1c-4083-b496-2df59a787a34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-2243b054-dc1c-4083-b496-2df59a787a34-415x250-IndiaHerald.jpgచిన్న చిన్న ఉద్యోగులు, ప్ర‌యివేటు ఉద్యోగులు తిండికి లేక నెల‌లు త‌ర‌బ‌డి క‌రోనా కాలంలో అవ‌స్థ‌లు ప‌డ్డారు. వారిని ఇప్ప‌టికీ ఎవ్వ‌రూ ఆదుకునే వారే లేరు. పాపం నాలుగైదు వేలు జీతానికి ప‌నిచేసే ప్ర‌యివేటు టీచ‌ర్లు క‌రోనా కాలంలో క్లాసులు లేక, జీతం రాక ఆత్మ హ‌త్యల‌కు సైతం సిద్ధ‌ప‌డ్డారు. కొంద‌రు కూర‌గాయలు అమ్ముకుని జీవ‌నోపాధి పొందారు. ఇక్క‌డ మాత్రం జ‌గ‌న్ జీతం ఇవ్వ‌డం ఆల‌స్య‌మయితే చాలు ఇది చేత‌గాని ప్ర‌భుత్వం అని అంటారు. ఎందుకు అంటారు.. ఎలా అంటారు. ఇదే అవ‌స్థ ఓ ప్ర‌యివేటు ఉద్యోగి కాకుండా ఓ ప్ర‌భుత్వ ఉద్యycp {#}District;Andhra Pradeshఓవర్ టు జగన్ : ఉద్యోగులకు ఏం కష్టం వచ్చింద్రా?ఓవర్ టు జగన్ : ఉద్యోగులకు ఏం కష్టం వచ్చింద్రా?ycp {#}District;Andhra PradeshSat, 13 Nov 2021 12:35:32 GMTచిన్న చిన్న ఉద్యోగులు, ప్ర‌యివేటు ఉద్యోగులు తిండికి లేక నెల‌లు త‌ర‌బ‌డి క‌రోనా కాలంలో అవ‌స్థ‌లు ప‌డ్డారు. వారిని ఇప్ప‌టికీ ఎవ్వ‌రూ ఆదుకునే వారే లేరు. పాపం నాలుగైదు వేలు జీతానికి ప‌నిచేసే ప్ర‌యివేటు టీచ‌ర్లు క‌రోనా కాలంలో క్లాసులు లేక, జీతం రాక ఆత్మ హ‌త్యల‌కు సైతం సిద్ధ‌ప‌డ్డారు. కొంద‌రు కూర‌గాయలు అమ్ముకుని జీవ‌నోపాధి పొందారు. ఇక్క‌డ మాత్రం జ‌గ‌న్ జీతం ఇవ్వ‌డం ఆల‌స్య‌మయితే చాలు ఇది చేత‌గాని ప్ర‌భుత్వం అని అంటారు. ఎందుకు అంటారు.. ఎలా అంటారు.


ఇదే అవ‌స్థ ఓ ప్ర‌యివేటు ఉద్యోగి కాకుండా ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి ఏనాడ‌యినా పొందాడా.. అస‌లు కాంట్రాక్టు ఉద్యోగికి రెగ్యుల‌ర్ ఉద్యోగికి ఉన్న ప‌ని భారం ఎంత? ఎప్పుడ‌య్యా పాటిస్తారు స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం అన్న మాట‌ను. ఇన్ని స‌మ‌స్య‌లు ఉన్నా కూడా జ‌గ‌న్ విని ఓపిగ్గా భ‌రిస్తున్నాడు. అయినా కూడా ఉద్యోగులు రాజ‌కీయ దృక్ప‌థాల్లో భాగంగా రోడ్డెక్కుతున్నారే త‌ప్ప వీరు సాధించేదేమీ లేదు.
 

ఏపీ ఉద్యోగుల‌కు ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన క‌ష్టం ఏంటో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. కొత్త పీఆర్సీ రానంత మాత్రాన ఉద్యోగి జీవితం ఏమీ ఆగిపోదు. కాక‌పోతే జీతం పెరుగుద‌ల‌లో కాస్త ఆల‌స్యం అవుతుంది. అయినా పీఆర్సీ ఆల‌స్యం అవుతుంద‌నే క‌దా ఐఆర్ ఇచ్చింది..అప్ప‌టికీ శాంతించ‌కుండా నానా డ్రామాలు న‌డుపుతున్నారెందుక‌ని?  వాస్త‌వానికి చిన్న చిన్న ఉద్యోగులు ముఖ్యంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చాలా చాలీ చాల‌ని జీతాలతో నెట్టుకు వ‌స్తున్నారు. అంతేకాదు వ‌లంటీర్ల‌కు కూడా జ‌గ‌న్ జీతాలు పెంచ‌లేదు. పాపం వార‌యితే నాలుగు వేల జీతానికే గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇక స‌చివాల‌య ఉద్యోగులు అయితే ప్రొబిష‌న్ పీరియ‌డ్ క‌న్ఫం కాక దిక్కులు చూస్తున్నారు. జిల్లా వారీగా చేస్తామ‌న్న ఈ ప్ర‌క్రియ రోజు రోజుకూ ఆల‌స్యం అవుతోంది. ఇప్ప‌టికే వీరి జీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. 18 వేల జీతానికి వీరు ప‌నిచేస్తున్నారు. కాస్త ప్రొబిష‌న్ పిరియ‌డ్ క‌న్ఫం అయితే ముప్పై వేలు జీతం పొంద‌వ‌చ్చ‌ని ఆశ‌తో ఉన్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల బ‌యోమెట్రిక్ స‌రిగా ప‌నిచేయ‌నందున కొంద‌రికి హాజ‌రు న‌మోదు కావ‌డం లేదు. అయినా కూడా జీతాల్లో కోత‌లు ఉంటూనే ఉన్నాయి. ఇవేవీ ప‌ట్టించుకోకుండా క‌నీసం చాలా చోట్ల డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల‌కు కూడా జీతాలు ఇవ్వ‌లేని దుఃస్థితిలో ప్ర‌భుత్వం ఉంటే ఒక‌టో తారీఖుకే జీతం అంటూ ఉద్యోగి ప‌ట్టుబ‌ట్ట‌డంలో అర్థం లేదు. ఒక‌వేళ అలా ప‌ట్టుబ‌ట్టి జీతం ఇప్పించుకున్నా ఆ స్థాయిలో అంతే ప‌ట్టుద‌ల‌తో ఉద్యోగి ప‌నిచేయాలి.






ఓవర్ టు జగన్ : ఉద్యోగులకు ఏం కష్టం వచ్చింద్రా?

మోడీ 51 గంటల దీక్ష ఎందుకు...?

ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అంటున్న ఉద్యోగులు....!

8 ఏళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడి..!

ములుగు జిల్లాలో పులి కలకలం

జ‌గ‌న్‌కు ' క‌మ్మ ' ల‌పై ఇంత క‌ప‌ట ప్రేమ ఉందా..!

పసుపు ముళ్లు : లోకేశానికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ!

ఢిల్లికి తెలంగాణ హ‌స్తం నేతలు

తెలంగాణ ప్రభుత్వంపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>