PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-28d7a1e7-3314-4441-87d6-266903d1d5bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-28d7a1e7-3314-4441-87d6-266903d1d5bc-415x250-IndiaHerald.jpgవరి కోనుగోలు విషయంలో బీజేపీ, కెసిఆర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ అన్నదాతలకు సున్నం పెడుతున్నారు అని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇందిరా పార్క్ వద్ద దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వడ్ల కుప్పలమీదే రైతులు చనిపోతున్న కెసిఆర్ లో చలనం లేదు అని ఆరోపణలు చేసారు. వడ్లు కొనడంలో కెసిఆర్ కు ఉన్న ఇబ్బందేంటి అని నిలదీశారు. కేంద్రానికి ఏజెంట్ గా ఎందుకు మారారో సమాధానం చెప్పాలి అని ఆమె డిమాండ్ చేసారు. కేంద్రం విధించే ఆంక్షలపై ఎందుకు సంతకాలు పెట్టారు అని ప్రశ్నించారు షర్మిల. ఆంక్షలు పెట్టినరోజే ఢిల్లీలోనే కదా ధర్sharmila{#}Indira Gandhi;Press;Y. S. Rajasekhara Reddyదమ్ముంటే ఆ రిపోర్ట్ బయటపెట్టండి: షర్మిల కామెంట్స్దమ్ముంటే ఆ రిపోర్ట్ బయటపెట్టండి: షర్మిల కామెంట్స్sharmila{#}Indira Gandhi;Press;Y. S. Rajasekhara ReddySat, 13 Nov 2021 15:50:22 GMTవరి కోనుగోలు విషయంలో బీజేపీ, కెసిఆర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ అన్నదాతలకు సున్నం పెడుతున్నారు అని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇందిరా పార్క్ వద్ద దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వడ్ల కుప్పలమీదే రైతులు చనిపోతున్న కెసిఆర్ లో చలనం లేదు అని ఆరోపణలు చేసారు. వడ్లు కొనడంలో కెసిఆర్ కు ఉన్న ఇబ్బందేంటి  అని నిలదీశారు. కేంద్రానికి ఏజెంట్ గా ఎందుకు మారారో సమాధానం చెప్పాలి  అని ఆమె డిమాండ్ చేసారు. కేంద్రం విధించే ఆంక్షలపై ఎందుకు సంతకాలు పెట్టారు   అని ప్రశ్నించారు షర్మిల.

ఆంక్షలు పెట్టినరోజే ఢిల్లీలోనే కదా ధర్నాలు చేయాల్సింది, ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ అది చేతకాక ఇక్కడ ధర్నాలు చేస్తారా  అని నిలదీశారు ఆమె. మీరు చేసే ధర్నాల వాళ్ళ ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు కెసిఆర్ అని ఆరోపణలు చేసారు. 20 శాతం బోనస్ ఇచ్చిమరీ వడ్లు కొన్న ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది అని స్పష్టం చేసారు. పక్క రాష్ట్రాలు ఎమ్మెస్పీ పై బోనస్ ఇచ్చి ధాన్యం సేకరిస్తుంటే కెసిఆర్ మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు రైతులపై ఉన్న చిత్తశుద్ధి కెసిఆర్ కు ఎందుకు లేదు  అని ప్రశ్నించారు. భారం మొత్తం రైతులపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదు అన్నారు. రైస్ ఎక్కడ అమ్మాలి, వాటిని ఏం చేసుకుంటారనేది ప్రభుత్వాలు చేసుకోవాల్సింది అని వ్యాఖ్యలు చేసారు. రైతు పండించిన పంట కొనడం ముమ్మాటికీ ప్రభుత్వ విధి అని అన్నారు షర్మిల. మీ కాళ్లుపట్టుకొని బతిమలాడే స్థితికి తీసుకొచ్చేనందుకేనా బీజేపీ, టీఆరెస్ లను అధికారంలోకి తెచ్చింది అని నిలదీశారు. మిల్లర్లకు మేలు చేయాలనే కెసిఆర్ ప్రయత్నాలు అని ఆమె ఆరోపించారు. రైతు నష్టపోవాలని, మిల్లర్లు లాభపడాలనే కెసిఆర్ వడ్లు కొనడం లేదు అన్నారు ఆమె. కెసిఆర్ కు నిజాయితీ ఉంటే సివిల్ సప్లె అడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి అని డిమాండ్ చేసారు.



ప్రభాస్ ఎలాంటోడో.. చెప్పడానికి ఇది చాలదా..!

800 కోట్ల జనాభాకు..లక్ష ఏళ్లకు సరిపడా ఆక్సీజన్ !!

బ్రేకింగ్: దొంగ నోట్ల కేసులో టాలీవుడ్ నిర్మాత అరెస్ట్...!

మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన పవన్ కళ్యాణ్..?

పవన్ కు షాక్ ఇచ్చిన నితిన్..!

దాసరి పై అలా పగ తీర్చుకున్నానంటున్న హీరో ..!

రామ్ చరణ్ సినిమా కోసం హైదరాబాద్ లో మకాం వేయనున్నా శంకర్..!

జగన్ బీసీ మంత్రం... లాభమా.. నష్టమా...!

మహారాష్ట్ర లో భారీ ఎన్‌కౌంటర్‌ ..మావోయిస్టులు హతం !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>