Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death56cc9e94-d5eb-4db7-b518-459b5f156603-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death56cc9e94-d5eb-4db7-b518-459b5f156603-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయ్. ఈ సీజన్లో ఎవరు కూడా వరి పంట వేయవద్దని ఒకవేళ రైతులు ప్రభుత్వ ఆదేశాలను కాదని వరి పంట వేస్తే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోము అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈసారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని రైతులు ఆలోచన చేసి వరి కాకుండా వేరే వంట వేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. రైతులకు ఇలాంటి సూచనలు చేయడంతో అటు బీజేపీ మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కెసిఆర్ రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ తెలంగాణ Death{#}Telangana Rashtra Samithi TRS;Suryapeta;politics;Khammam;Kodad;Bharatiya Janata Party;Government;Party;Telangana;KCR;Telangana Chief Minister;Yevaruటిఆర్ఎస్ ఫ్లెక్సీ.. యువకుడి ప్రాణం తీసింది?టిఆర్ఎస్ ఫ్లెక్సీ.. యువకుడి ప్రాణం తీసింది?Death{#}Telangana Rashtra Samithi TRS;Suryapeta;politics;Khammam;Kodad;Bharatiya Janata Party;Government;Party;Telangana;KCR;Telangana Chief Minister;YevaruFri, 12 Nov 2021 09:00:00 GMTతెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయ్. ఈ సీజన్లో ఎవరు కూడా వరి పంట వేయవద్దని ఒకవేళ రైతులు ప్రభుత్వ ఆదేశాలను కాదని వరి పంట వేస్తే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోము అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈసారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని రైతులు ఆలోచన చేసి వరి కాకుండా వేరే వంట వేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. రైతులకు ఇలాంటి సూచనలు చేయడంతో అటు బీజేపీ మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కెసిఆర్ రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


 ఇలాంటి సమయంలోనే ఇక బీజేపీ నేతల విమర్శల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయము అని చెప్పడం తోనే తాము ఇలాంటి ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవలే అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కూడా టిఆర్ఎస్ శ్రేణులు రైతులందరూ ధర్నాకు దిగాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు అన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అధికార పార్టీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.



 అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎంతో మంది టిఆర్ఎస్ నేతలు రైతులు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ నేడు ధర్నాకు  దిగనున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ లో పార్టీ ధర్నా ఏర్పాటు లో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  మరొకరికి తీవ్రగాయాలు కాగా అతnన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మరికొద్ది సేపట్లో ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు నిచ్చిన ధర్నా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కాబోతోంది.



నెల్లూరు నగర రాజకీయం : జంట మిత్రులకు పరీక్ష

చలికాలంలో ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ?

అచ్చ తెలుగందం ప్రియాంక జవాల్కర్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>