MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-singers9c8464fa-5644-4b1a-93fd-102e716c3c43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-singers9c8464fa-5644-4b1a-93fd-102e716c3c43-415x250-IndiaHerald.jpgమధురమైన స్వరంతో మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్న సింగర్ శ్రీ రామ చంద్ర. బీటెక్ చదివి మ్యూజిక్ ని తన కెరియర్ గా ఎంచుకుని పాపులర్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2013 లో ఇండియన్ ఐడల్ అయిదవ సీజన్ విన్నర్ గా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ తెలుగు గాయకుడు తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషల్లోనూ పాటలు పాడి బాగా పాపులర్ అయ్యారు.TOLLYWOOD-SINGERS{#}AdiNarayanaReddy;WhatsApp;Indian Idol;Oh Baby;sri reddy;Prasthanam;sree raam;sree;Winner;siri;GEUM;Bigboss;Hero;Telugu;prema;Loveశ్రీరామచంద్ర లైఫ్ పై శ్రీరెడ్డి ముద్ర... తేరుకుంటాడా?శ్రీరామచంద్ర లైఫ్ పై శ్రీరెడ్డి ముద్ర... తేరుకుంటాడా?TOLLYWOOD-SINGERS{#}AdiNarayanaReddy;WhatsApp;Indian Idol;Oh Baby;sri reddy;Prasthanam;sree raam;sree;Winner;siri;GEUM;Bigboss;Hero;Telugu;prema;LoveFri, 12 Nov 2021 17:04:30 GMTమధురమైన స్వరంతో మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్న సింగర్ శ్రీ రామ చంద్ర. బీటెక్ చదివి మ్యూజిక్ ని తన కెరియర్ గా ఎంచుకుని పాపులర్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2013 లో ఇండియన్ ఐడల్ అయిదవ సీజన్ విన్నర్ గా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ తెలుగు గాయకుడు తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషల్లోనూ పాటలు పాడి బాగా పాపులర్ అయ్యారు. ఇతడు సింగర్ గానే కాదు మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీ రామ్. జగద్గురు ఆది శంకర, ప్రేమ గీమా జాన్తా నై వంటి పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. "నోట్ బుక్" అనే చిత్రంతో డెబ్యూ సింగర్ గా తన సినీ ప్రస్థానం మొదలయ్యింది.

ఆ తర్వాత ఎన్నో పాటలను పాడిన శ్రీ రామ్ చంద్ర ఓ బేబీ , టచ్ చేసి చూడు, సీతమ్మ వాకిట్లో సిరి మళ్లీ చెట్టు వంటి స్టార్ హీరో చిత్రాల్లో పాటలు పాడి హిట్స్ ను అందుకున్నాడు. అంతేకాదు దుబాయ్, సింగపూర్, లండన్‌లతో పాటు పలు దేశాలలో ఇప్పటికి 200కు పైగా స్టేజీ షోలు ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటి చెబుతున్నారు ఈ యంగ్ సింగర్.
ఆ మధ్య ఈ సింగర్ పై శ్రీ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనతో అసభ్యకరంగా మాట్లాడాడని తనతో చాలా సన్నిహితంగా ఉండేవాడని వాట్సాప్ చాటింగ్ చూపి నానా రభస చేయగా..అది మళ్ళీ ఇపుడు తను బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఉండగా మరోసారి వైరల్ గా మారింది. అయితే ఇది తన లైఫ్ పై ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన శ్రీ రామ్ తొలుత హమీద తో క్లోజ్ గా ఉంటూనే గేమ్ పై ఫోకస్ పెట్టడం లేదని బయట చాలా చర్చలే జరిగాయి. ఆ తరువాత హమీద ఎలిమినేట్ అయ్యాక శ్రీ రామ్ మళ్ళీ సోలోగా హౌజ్ లో తన గేమ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ స్టార్ సింగర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫేవరెట్ కంటిస్టేంట్ టాప్ ఫైవ్ లిస్ట్ లో లీడ్ లో ఉన్నాడు. మరి ఈ ఐడెల్ విన్నర్ బిబి సీజన్ ఫైవ్ విన్నర్ గా నిలుస్తారో లేదో చూడాలి.



శ్రీరామచంద్ర లైఫ్ పై శ్రీరెడ్డి ముద్ర... తేరుకుంటాడా?

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి పరిస్థితి విషమం !!

'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు

వైరల్ : నాటు నాటు పాటపై సులభంగా స్టెప్పులు నేర్చుకోండి ఇలా?

సింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఐదు రోజుల్లో శిక్ష ఖరారు

సిగరెట్ తాగి.. జైలు పాలయ్యాడు?

జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు

మూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>