PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp6b264f95-e5bc-4496-933d-d94f82df5aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp6b264f95-e5bc-4496-933d-d94f82df5aaf-415x250-IndiaHerald.jpg ఇక నెల్లూరు కేంద్రంగా రాజ‌కీయం న‌డుపుతున్న మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ అంతా తానై న‌డిపిస్తున్నారు. అయితే అన్ని వేళ‌ల్లోనూ జ‌గ‌న్ కు అనుకూలంగా తీవ్ర స్థాయిలో ఆయ‌న‌ మాట వినిపిస్తున్నా కూడా కొన్ని వ్యాఖ్య‌లు అధినేత‌ను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మంత్రి అనీల్ , మ‌రో మంత్రి సీదిరి లాంటి స్పీడున్న లీడ‌ర్ల కార‌ణంగా జ‌గ‌న్ ను చాలా చాలా సార్లు వివాదాలు ప‌ల‌క‌రించాయి. అనీల్ స్పీడును అసెంబ్లీలో విపరీతంగా వాడుకున్న జ‌గ‌న్ త‌రువాత అదే పంథాలో ఆయ‌న‌కు బ‌య‌ట మాత్రం మ‌ద్ద‌తివ్వ‌లేదు అన్న‌ది ఓ వాస్త‌వం. ycp{#}Ram Madhav;Nara Lokesh;Assembly;Kumaar;Congress;CBN;Reddy;Nellore;Minister;Partyనెల్లూరోడు : జగనన్న భక్తులకు తిరుగేలేదు రా!నెల్లూరోడు : జగనన్న భక్తులకు తిరుగేలేదు రా!ycp{#}Ram Madhav;Nara Lokesh;Assembly;Kumaar;Congress;CBN;Reddy;Nellore;Minister;PartyFri, 12 Nov 2021 21:28:03 GMTనెల్లూరు కేంద్రంగా రాజ‌కీయం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడే కాదు గ‌తంలోనూ ఇదే విధంగా ఉంది. దీంతో టీడీపీకి ఎదురీత త‌ప్పేలా లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ భ‌క్తుల హ‌వా ఇక్క‌డ బాగానే న‌డుస్తోంది. గ‌తంలోనూ ఇదే విధంగా జ‌గ‌న్ భ‌క్తులే పార్టీకి అండ‌గా నిలిచి బ‌లీయంగా త‌మ గొంతుక‌ను వినిపించి టీడీపీకి ముచ్చెమ‌టలు పోయించారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ,  నెల్లూరులో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల కు గాను అన్నింటినీ గెలుచుకుని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేశారు ఇక్క‌డి నాయ‌కులు. కాంగ్రెస్ హ‌యాంలో ఉంటే ఆనం వాయిస్ బాగానే వినిపించింది కానీ ఇప్పుడు అంత సీన్ లేకుండా పోయింది. పార్టీలో ఆనం రాం నారాయ‌ణ రెడ్డి ఉన్నా కూడా లేని విధంగానే రాజ‌కీయం న‌డుస్తోంది. తాజాగా ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నా కూడా అది ద‌క్కేలా లేదు. కొన్ని సంద‌ర్భాల్లో జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా గొంతు వినిపించిన‌ప్ప‌టికీ అవేవీ పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోలేదు.

ఇక నెల్లూరు కేంద్రంగా రాజ‌కీయం న‌డుపుతున్న మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ అంతా తానై  న‌డిపిస్తున్నారు. అయితే అన్ని వేళ‌ల్లోనూ జ‌గ‌న్ కు అనుకూలంగా తీవ్ర స్థాయిలో  ఆయ‌న‌ మాట వినిపిస్తున్నా కూడా కొన్ని వ్యాఖ్య‌లు అధినేత‌ను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మంత్రి అనీల్ , మ‌రో మంత్రి సీదిరి లాంటి స్పీడున్న లీడ‌ర్ల కార‌ణంగా జ‌గ‌న్ ను చాలా చాలా సార్లు వివాదాలు ప‌ల‌క‌రించాయి. అనీల్ స్పీడును అసెంబ్లీలో విపరీతంగా వాడుకున్న జ‌గ‌న్ త‌రువాత అదే పంథాలో ఆయ‌న‌కు బ‌య‌ట మాత్రం మ‌ద్ద‌తివ్వ‌లేదు అన్న‌ది  ఓ వాస్త‌వం. అలానే మంత్రి సీదిరికి కూడా!  సో.. అసెంబ్లీ వ‌ర‌కూ మాట్లాడేందుకే ఇలాంటి నోటి దురుసు నాయ‌కుల‌ను వాడుకుంటార‌ని కూడా కొన్ని సంద‌ర్భాల్లో తేలిపోయింది. ఇదే సంద‌ర్భంలో అచ్చెన్న‌ను తిట్టేందుకు దువ్వాడ‌ను, చంద్ర‌బాబును తిట్టేందుకు కొడాలి నానిని, అదేవిధంగా లోకేశ్ ను తిట్టేందుకు వంశీని ఇలా ఎక్క‌డిక‌క్క‌డ నోటి దురుసు నేతలను నియ‌మించి జ‌గ‌న్ రాజ‌కీయం చేస్తున్నా ప్ర‌స్తుతానికి సంబంధిత వ్యూహాలేవీ విక‌టించ‌లేదు. ఇక తాజా రాజకీయాల్లో కార్పొరేష‌న్ ఎన్నిక‌లన్నీ వైసీపీకి అనుకూలం అనే తేలిపోయింది. ఇక్క‌డ అచ్చెన్న, య‌న‌మ‌ల లాంటి లీడ‌ర్లు ప్ర‌చారం చేస్తున్నా ఒడ్డెక్కే ఛాన్స్ అయితే లేదు. సోమిరెడ్డి లాంటి లీడ‌ర్లు ఎప్పుడో ఔట్ డేటెడ్ లీడ‌ర్ల‌యిపోయారు. టీడీపీకి ఊతం ఇచ్చేందుకు లోకేశ్ సీన్ లోకి వ‌చ్చినా, బాబు వ‌చ్చినా ఉప‌యోగం లేనేలేదు. సో! నెల్లూరు రెడ్లంతా ప్ర‌స్తుతం జ‌గ‌న్ వైపే.. వారితో పాటు యాద‌వులు కూడా!





ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి కొత్త పాఠం నేర్పబోతున్నాడా..?

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!

నెల్లూరోడు : జగనన్న భక్తులకు తిరుగేలేదు రా!

MBA చేస్తే కెరీర్ బాగుంటుందా?

విజయం మీదే: ఈ 7 అద్భుతాలలోనే మీ విజయం?

గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి జగన్... ?

ఆర్కే జీవిత చరిత్ర ప్రింటింగ్‌.. పీఓడబ్ల్యూ సంధ్య భర్త అరెస్ట్‌

మరోసారి వార్తల్లో హిద్మా, మావోయిస్టుల భారీ ప్లాన్..?

హైద‌రాబాద్‌లో మ‌రో మ‌హిళ అదృశ్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>