MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-singers9017cc0d-c50a-4016-a48c-7c4a31b7bf02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-singers9017cc0d-c50a-4016-a48c-7c4a31b7bf02-415x250-IndiaHerald.jpgబహుశా సంగీతం నచ్చని ఆస్వాదించని మనిషే ఉండరేమో. సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు. అలాంటి సంగీతానికి మనిషి మనసు కరుగదా..!! పలు సింగింగ్ షోస్ ద్వారా ఎందరో గాయని గాయకులు గొప్ప గుర్తింపు దక్కించుకుని సినిమాల్లోనూ పాడే ఛాన్స్ లు అందుకున్నారు. అలా మా టివి లో అప్పట్లో ప్రసారమైన సూపర్ సింగర్స్ సింగింగ్ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు గాయని గీతా మాధురి. TOLLYWOOD-SINGERS{#}Nacchavule;Nachavule;Chirutha;Singer;geetha;Tollywood;February;krishna;Music;prema;Love;Reality Show;Teluguసింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...సింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...TOLLYWOOD-SINGERS{#}Nacchavule;Nachavule;Chirutha;Singer;geetha;Tollywood;February;krishna;Music;prema;Love;Reality Show;TeluguFri, 12 Nov 2021 16:00:00 GMTబహుశా సంగీతం నచ్చని ఆస్వాదించని మనిషే ఉండరేమో. సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు. అలాంటి సంగీతానికి మనిషి మనసు కరుగదా..!! పలు సింగింగ్ షోస్ ద్వారా ఎందరో గాయని గాయకులు గొప్ప గుర్తింపు దక్కించుకుని సినిమాల్లోనూ పాడే ఛాన్స్ లు అందుకున్నారు. అలా మా టివి లో అప్పట్లో ప్రసారమైన సూపర్ సింగర్స్ సింగింగ్ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు గాయని గీతా మాధురి. తన పేరు లాగే ఆమె స్వరం కూడా ఎంతో మధురంగా ఉంటుంది. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ గాయకుల్లో ఈమె కూడా ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాలలో పాటలు పాడి పలు సూపర్ హిట్స్ లను తన కాతలో వేసుకుంది ఈ సూపర్ సింగర్.

ఇటు సోషల్ మీడియాలోనూ గీతకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన న్యూ అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు గీతా. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ మరియు తన సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోవడం అలాగే సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటివి చేస్తూ తన అభిమానులకు ఎపుడు టచ్ లో ఉంటారు. చిన్న వయసు నుండే  శాస్త్రీయ, లలిత, సినీ వంటి  సంగీతాలలో శిక్షణ పొంది నైపుణ్యం సంపాదించారు గీతా మాధురి. సినిమాలలో పాటలు పాడటమే కాకుండా ఎన్నో  స్టేజ్ షోలు కూడా చేశారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని మరింత క్రేజ్ ను పెంచుకున్న ఈమె ఆ రియాలిటీ షో లో టాప్ 2 లో నిలిచారు.  ఇక ఈమె ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడగా వాటిలో నచ్చావులే మూవీ లో నిన్నే నిన్నే కోరా, చిరుత మూవీలో "చంక చంక చంకెరె", గోలీమార్ మూవీలో "మగాళ్లు వట్టి మాయగాల్లే" వంటి పలు పాటలు  సంచలనం సృష్టించాయి. సినీ నటుడు ఆనంద కృష్ణ అలియాస్ నందుని 2014 ఫిబ్రవరి 9న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. తన పేరు దాక్షాయణి ప్రకృతి. గీత మాస్ సాంగ్స్ పాడడంలో దిట్ట అని చెప్పాలి.



సింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఐదు రోజుల్లో శిక్ష ఖరారు

సిగరెట్ తాగి.. జైలు పాలయ్యాడు?

జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు

మూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయి

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ

బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుద‌ల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>