MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag28020986-e4ac-4dce-8e39-86c2d80f963e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag28020986-e4ac-4dce-8e39-86c2d80f963e-415x250-IndiaHerald.jpgవచ్చే ఏడాది సంక్రాంతి మీద అందరి కన్నూ పడుతోంది. మొదట అనుకున్న వారు వెనక్కి పోతున్నారు. కొత్త వారు వచ్చి చేరుతున్నారు. నిజం చెప్పాలంటే మహేష్ బాబు సర్కార్ వారి పాట దాదాపుగా పది నెలల క్రితం సంక్రాంతి 2022 అని ఫిక్స్ అయింది. nag{#}Cinemaబంగార్రాజుకి ఆ మూవీతోనే లింక్....?బంగార్రాజుకి ఆ మూవీతోనే లింక్....?nag{#}CinemaFri, 12 Nov 2021 19:14:06 GMTవచ్చే ఏడాది సంక్రాంతి మీద అందరి కన్నూ పడుతోంది. మొదట అనుకున్న వారు వెనక్కి పోతున్నారు. కొత్త వారు వచ్చి చేరుతున్నారు. నిజం చెప్పాలంటే మహేష్ బాబు సర్కార్ వారి పాట దాదాపుగా పది నెలల క్రితం సంక్రాంతి 2022 అని ఫిక్స్ అయింది.

కానీ ఆ మూవీ ఇపుడు ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది. దానికంతటికీ కారణం ట్రిపుల్ ఆర్. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూండడంతో మిగిలిన సినిమాలు  స్నేహపూర్వకంగా పోటీ నుంచి తప్పుకుంటూ వస్తున్నాయి. ఈ విధంగానే దిల్ రాజు తన ఎఫ్ 3 మూవీని ఫిబ్రవరికి వాయిదా వేస్తే మహేష్ బాబు ఏకంగా ఏప్రిల్ ఫస్ట్ అంటూ చాలా దూరమే వెళ్లిపోయాడు. ఇపుడు పవన్ కళ్యాణ్ భీమ్లా  నాయక్ వంతు. ఈ మూవీ కూడా ఫిబ్రవరికి వాయిదా పడుతుంది అంటున్నారు.

ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లాంటి మూవీకి కనీసం వారం అయినా సోలోగా వదలకపోతే కలెక్షన్ల ఇబ్బంది అంటున్నారు. దాంతో సర్దుకోవడం అంటూ మొదలుపెడితే భీమ్లా నాయక్  వెనక్కి జరగాలి. ఇక కచ్చితంగా సంక్రాంతి బరిలో రెండు మూవీస్ మాత్రమే ఉంటాయని అనుకుంటారు. ఆ రెండోది ప్రభాస్ రాధేశ్యామ్. అయితే అది కాదు, మూడవ సినిమా కూడా వస్తుంది అంటున్నారు.

అదే ఎవరూ ఊహించని విధంగా బంగార్రాజు సినిమా. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మూవీకి సీక్వెల్ గా దీన్ని తీస్తున్నారు. చాలా తొందరగా ఫినిష్ చేసిన ఈ మూవీ కచ్చితంగా జనవరిలోనే రిలీజ్ చేస్తారట. ముఖ్యంగా  భీమ్లా నాయక్ తోనే ఈ మూవీకి లింక్ అంటున్నారు. భీమ్లా నాయక్ కనుక వెనక్కి వెళ్తే అదే డేట్ అంటే జనవరి 12న రావడానికి చూస్తున్నారని టాక్. ఫ్యామిలీ మూవీగా గ్రామీణ నేపధ్యం కలిగిన నాగ్ బంగార్రాజ్ మూవీ కనుక అపుడు వస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్ కూడా ఉందిట. సో పవన్ కనుక చోటు ఇస్తే ఆ గ్యాప్ లో ఈ మూవీ వస్తుంది అంటున్నారు. చూడాలి మరి.










సామాన్యులకు షాక్.. పెరుగుతున్న విద్యుత్ చార్జీలు..!!

భారత్ దే భవిష్యత్తు.. నాటి చైనా స్థితిలో..!

నిధులు అడిగితే.. బిచ్చ‌మెత్తుకుంటార‌నేది అజ్ఞాన‌మే : స‌జ్జ‌ల

పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..?

డ్రగ్స్ వాడే వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్...?

ప్రభుత్వంపై కేసు పెడతాం: ఏపీ ఉద్యోగులు

హసన్ అలీకి మద్దతుగా నిలిచిన బాబర్...

ఆ ఒక్క విషయంలో రాఘవేంద్రరావు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటారట..?

కేసీఆర్ టాక్స్ : ఒక ధర్నా లక్ష సందేహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>