PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srikakulambba3fbcc-754a-4e7c-83eb-6793b4524f64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srikakulambba3fbcc-754a-4e7c-83eb-6793b4524f64-415x250-IndiaHerald.jpgశ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన జూడో క్రీడాకారుల్లోనే కాదు ఎంద‌రికో తానొక స్ఫూర్తిగా నిలిచింది. చరిత్రలో ముందెన్న‌డూ లేని రికార్డును న‌మోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ జూ డో అసోసియేషన్ ను పేరు తెచ్చింది. విజేత‌ను డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ దాసు అభినందించారు. విజేత‌కు శుభాకాంక్ష‌లు అం దించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూడో అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ నామి శెట్టి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుం దరావు, శ్రీకాకుళం జిల్లా జూడో అసోసియేషన్ చైర్మన్ చింతాడ రవికుమార్, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ srikakulam{#}venkat;Deputy Chief Minister;Srikakulam;gold;Kumaar;Punjab;sowmya;Winner;Tangirala Sowmya;anjana sowmya;krishna;District;Andhra Pradeshఆ విజేత క‌థ అత్యంత ఆస‌క్తిదాయ‌కంఆ విజేత క‌థ అత్యంత ఆస‌క్తిదాయ‌కంsrikakulam{#}venkat;Deputy Chief Minister;Srikakulam;gold;Kumaar;Punjab;sowmya;Winner;Tangirala Sowmya;anjana sowmya;krishna;District;Andhra PradeshFri, 12 Nov 2021 14:48:07 GMTమారుమూల ప్రాంతాల‌లో ఉండే మ‌నుషులు, వారి క‌ష్ట‌న‌ష్టాలు, వారి అవ‌రోధాలు ఇవ‌న్నీ ఎంతో విభిన్నంగా ఉంటాయి. కనీసం తిం డికి నోచుకోలేని కుటుంబాల్లో పేద పిల్ల‌లు రాణించ‌డం అంత సులువు కాదు. అయినా ప్ర‌తిభ అన్న‌ది ఎక్క‌డుంటే ఏం.. రాణించేం దుకు సంక‌ల్పం ఉంటే చాలు అని నిరూపించిన బిడ్డ‌లు ఎంద‌రో! సాధార‌ణ కుటుంబాల నుంచి వ‌చ్చి అసాధార‌ణ విజ‌యాలు నమోదు చేసింది ఎంద‌రో! అలాంటి విజేత క‌థ ఇది. కొందరు దాత‌ల సాయంతో వెలుగులోకి వ‌చ్చిన ప్ర‌తిభ‌కు రూపం ఈ క‌థ.

కూలి ఇంట పుట్టిన ఆ బిడ్డ‌కు జూడో అంటే ఇష్టం. శాప్ శిక్ష‌కులు, అదేవిధంగా జిల్లా జూడో అసోసియేష‌న్ పెద్ద‌లు ఇలా అంతా క‌లిసి ఆ ఆడ‌బిడ్డ‌కు అండ‌గా నిలిచి ఇవాళ జాతీయ స్థాయిలో రాణించేందుకు త‌మ‌వంతు స‌హ‌కారం అందించారు. శ్రీ‌కాకుళం న‌గ‌రంలో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుకు కె.సౌమ్యారాణికి ముందునుంచి యుద్ధ విద్యలు నేర్చుకోవాలన్న త‌ప‌న ఉంది. ఆట పాట‌ల‌తో పాటు ఆమె  చ‌దువులోనూ మంచి శ్ర‌ద్ధ చూపుతోంది. ఆమె శ్ర‌ద్ధాస‌క్తులు గ‌మ‌నించిన కొంద‌రు స్థానికంగా ఉన్న కోచ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొంద‌మ‌ని చెప్పారు. ఆ విధంగా జూడో అసోసియేష‌న్ త‌రుఫున అదేవిధంగా శాప్ త‌ర‌ఫున మంచి ప్రోత్సాహం ద‌క్కింది. ఇటీవ‌ల స‌బ్ జూనియ‌ర్ జూడో పోటీలు (రాష్ట్ర స్థాయిలో జ‌రిగాయి) నిర్వ‌హించగా అక్క‌డ బంగారు ప‌త‌కం కైవ‌సం చేసుకుంది. సౌమ్య ఆస‌క్తిని గ‌మ‌నించి, ఆమెను జాతీయ స్థాయి పోటీల‌కు పంపేందుకు అసోసియేష‌న్ జిల్లా అధ్యక్షులు డాక్ట‌ర్ చింతాడ ర‌వి కుమార్ త‌న‌వంతు సాయం అందించారు. దీంతో ఆ బుజ్జాయి త‌న క‌ల‌లను నెర‌వేర్చుకునేందుకు జాతీయ స్థాయిలో విజేత‌గా నిలిచేందుకు మ‌రింత సాధ‌న చేసింది. పంజాబ్ రాష్ట్రం, చండీగ‌ఢ్ లో నిర్వ‌హించిన జాతీయ స్థాయి పోటీల‌లో పాల్గొని 32 కేజీల విభాగంలో బంగారు ప‌త‌కం కైవ‌సం చేసుకుంది.

శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన జూడో క్రీడాకారుల్లోనే కాదు ఎంద‌రికో తానొక స్ఫూర్తిగా నిలిచింది. చరిత్రలో ముందెన్న‌డూ లేని రికార్డును న‌మోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ జూ డో అసోసియేషన్ ను పేరు తెచ్చింది. విజేత‌ను డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ దాసు అభినందించారు. విజేత‌కు శుభాకాంక్ష‌లు అం దించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూడో అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ నామి శెట్టి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుం దరావు, శ్రీకాకుళం జిల్లా జూడో అసోసియేషన్ చైర్మన్ చింతాడ రవికుమార్, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ , జిల్లా జూడో అసో సియేష న్ అధ్యక్ష  కార్యదర్శి పి .సూర్య ప్రకాశ్, ఎం.వి.ర‌మణ, జూడో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పైడి.సునీత , జిల్లా జూడో అసోసియే షన్ వైస్ ప్రెసిడెంట్  ఎం.తిరుపతిరావు, శాప్ జూడో కోచ్ పి.ఎస్.మ‌ణికుమార్, జిల్లా జూడో అసోసియేషన్ సభ్యులు, సీనియర్ జూడో క్రీడాకారులు  ఉన్నారు.











ప్రభాస్ విషయంలో కృష్ణం రాజు చేసిన అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా..?

మూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయి

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ

బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుద‌ల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?

బుల్లి పిట్ట: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ తో రన్ అయ్యే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

దేశంలోనే ఫ‌స్ట్ టీఆర్ఎస్‌.. సెకండ్ టీడీపీ...!

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>