PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/marri69bdcf37-82ac-49d7-b00c-c7a95786000b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/marri69bdcf37-82ac-49d7-b00c-c7a95786000b-415x250-IndiaHerald.jpgమర్రి రాజశేఖర్... శాసన మండలి ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ పేరు తప్పని సరిగా వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తున్నారు మర్రి రాజశేఖర్. ఇంకా చెప్పాలంటే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో ఇండిపెండెంట్‌గా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మర్రి రాజశేఖర్... అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం వెంటే నడుస్తున్నారు. అప్పట్లో వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సోదరిmarri{#}Sharmila;dr rajasekhar;Chilakaluripeta;Guntur;Hanu Raghavapudi;Telangana Chief Minister;local language;Yatra;Jagan;Assembly;Reddy;Y. S. Rajasekhara Reddy;Partyమర్రి రాజశేఖర్‌కు మళ్లీ మొండిచెయ్యి...!మర్రి రాజశేఖర్‌కు మళ్లీ మొండిచెయ్యి...!marri{#}Sharmila;dr rajasekhar;Chilakaluripeta;Guntur;Hanu Raghavapudi;Telangana Chief Minister;local language;Yatra;Jagan;Assembly;Reddy;Y. S. Rajasekhara Reddy;PartyFri, 12 Nov 2021 18:24:46 GMTమర్రి రాజశేఖర్... శాసన మండలి ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ పేరు తప్పని సరిగా వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తున్నారు మర్రి రాజశేఖర్. ఇంకా చెప్పాలంటే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో ఇండిపెండెంట్‌గా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మర్రి రాజశేఖర్... అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం వెంటే నడుస్తున్నారు. అప్పట్లో వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రలో అడుగు కలిపారు. ఇక 2018లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సమయంలో కూడా జగన్ వెంటనే నడిచారు మర్రి రాజశేఖర్. వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందారు కూడా. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజనీకి చిలకలూరిపేట నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయించారు వైఎస్ జగన్.

పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మర్రి రాజశేఖర్‌కు సముచిత స్థానం ఇస్తానని హామీ కూడా ఇచ్చారు వైఎస్ జగన. కానీ ఆ హామీ అలాగే మిగిలిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు శాసన మండలిలో స్థానాలను భర్తీ చేశారు. అలా మండలి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా మర్రి రాజశేఖర్ పేరు బలంగా వినిపిస్తూనే ఉంది. అంతా అయిపోయింది అని అనుకూనే లోపే... నిజంగాన అయిపోతుంది. చివరి జాబితాలో పేరు మాత్రం ఉండటం లేదు. గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ అన్నారు... అది దక్కలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో మర్రి రాజశేఖర్ పేరు తప్పనిసరిగా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు కూడా మర్రి రాజశేఖర్‌కు అవకాశం దక్కలేదు. గుంటూరు జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లో ఒకటి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రెండో దాన్ని మురుగుడు హనుమంతరావుకు కేటాయించారు. మర్రికి మరోసారి అవకాశం ఉంటుందని చెప్పకనే చెప్పరు. ఆ మరోసారి ఎప్పుడో చూడాలి మరి.





ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాటలివే?

పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..?

డ్రగ్స్ వాడే వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్...?

ప్రభుత్వంపై కేసు పెడతాం: ఏపీ ఉద్యోగులు

హసన్ అలీకి మద్దతుగా నిలిచిన బాబర్...

ఆ ఒక్క విషయంలో రాఘవేంద్రరావు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటారట..?

కేసీఆర్ టాక్స్ : ఒక ధర్నా లక్ష సందేహాలు!

తెరాస బీజేపీల మధ్య ముదురుతున్న వార్.. ఏం..!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి పరిస్థితి విషమం !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>