MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpakavimanam365ad725-e3a5-4a71-95e1-01ace852830a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpakavimanam365ad725-e3a5-4a71-95e1-01ace852830a-415x250-IndiaHerald.jpg ఈరోజు విడుదల కాబోతున్న ‘పుష్పక విమానం’ ఆనంద్ దేవరకొండ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించడంతో ఈమూవీ విజయవంతం అయితే నిర్మాతగా విజయ్ నుండి మరిన్ని సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆనంద్ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈమూవీ పై చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ బయట పెట్టాడు.చాల సంవత్సరాల క్రితం సింగీతం కమలహాసన్ అమల లతో ‘పుష్పకవిమానం’ అనే మూకీ పిక్చర్ తీసిన విషయం తెలిసిందే. టాకీ సినిమాలు రాకమpushpakavimanam{#}Amala Akkineni;vijay deverakonda;media;Joseph Vijay;Yevaru;Devarakonda;Darsakudu;Director;Anand Deverakonda;Smart phoneపుష్పక విమానం పై సింగీతం శ్రీనివాసరావు షాకింగ్ సమాధానం !పుష్పక విమానం పై సింగీతం శ్రీనివాసరావు షాకింగ్ సమాధానం !pushpakavimanam{#}Amala Akkineni;vijay deverakonda;media;Joseph Vijay;Yevaru;Devarakonda;Darsakudu;Director;Anand Deverakonda;Smart phoneFri, 12 Nov 2021 08:00:00 GMT
ఈరోజు విడుదల కాబోతున్న ‘పుష్పక విమానం’ ఆనంద్ దేవరకొండ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించడంతో ఈమూవీ విజయవంతం అయితే నిర్మాతగా విజయ్ నుండి మరిన్ని సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆనంద్ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈమూవీ పై చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ బయట పెట్టాడు.


చాల సంవత్సరాల క్రితం సింగీతం కమలహాసన్ అమల లతో ‘పుష్పకవిమానం’ అనే మూకీ పిక్చర్ తీసిన విషయం తెలిసిందే. టాకీ సినిమాలు రాకముందు 1920 ప్రాంతాలలో సినిమాలు అన్నీ మూకీ పిక్చర్స్ గా వస్తూ ఉండేవి. ముఖ్యంగా ఛార్లీ చాప్లిన్ సినిమాలు అన్నీ ఇలా మూకీ పిక్చర్స్ గా వచ్చినవే. అప్పటి ఈ మూకీ పిక్చర్స్ ప్రయోగాన్ని 1980 ప్రాంతాలలో ఉండే అప్పటి యూత్ కు ప్రయోగాత్మకంగా తీసిన ‘పుష్పకవిమానం’ అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్.


ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా తీస్తున్న పరిస్థితులలో సింగీతం కు ఫోన్ చేసి అతడి అనుమతి అడిగారట. అయితే ఈ విషయం పై సింగీతం వేసిన జోక్ ను ఆనంద దేవరకొండ బయట పెట్టాడు. ‘పుష్పకవిమానం’ అనే టైటిల్ తన క్రియేషన్ కాదని దేవేంద్రుడు వాహనం ‘పుష్పకవిమానం’ అని పురాణాలలో చెపుతూ ఉంటారు కాబట్టి ఆ పదాన్ని తాను కాపీ చేసాను అంటూ జోక్ చేసాడట.


అంతేకాదు ‘పుష్పకవిమానం’ టైటిల్ తో ఎవరు ఎన్ని ఎన్ని సినిమాలు అయినా తీసుకోవచ్చని దానికి తన అనుమతి దేనికి అంటూ మరొక సెటైర్ వేసారట. 80 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్నా ఇప్పటికీ సింగీతం టాప్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నా మన టాప్ హీరోలు మాత్రం సింగీతం ను పట్టించుకోవడం లేదు అన్నది వాస్తవం..  







డబ్బుల కోసం.. స్నేహితుడి హత్య !

అచ్చ తెలుగందం ప్రియాంక జవాల్కర్

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>