PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp0f41f0b5-a5c9-4e73-a23f-1449c86979fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp0f41f0b5-a5c9-4e73-a23f-1449c86979fe-415x250-IndiaHerald.jpgఎప్పుడైనా అధికార పార్టీలో ఉండే నేతలకున్న అడ్వాంటేజ్....ప్రతిపక్షంలో ఉండే నేతలకు ఉండదనే చెప్పాలి. అధికార బలం, ఆర్ధిక బలం విషయంలో ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలదే పైచేయి. అందుకే ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాలోనూ వైసీపీ నేతల హవా నడుస్తోంది. ఇక టీడీపీలో ఇలాంటి హడావిడి లేదు...ఏదో కొద్దిమంది తప్ప మిగిలిన నేతలు కాస్త సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇప్పుడే హడావిడి చేస్తే ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడతామని అనుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా తమ్ముళ్ళు అదే బాటలో ముందుకెళుతున్నారు. కృష్ణా జిల్లాలోTDP{#}Krishna River;devineni avinash;MP;krishna district;YCP;District;MLA;TDP;Partyకృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!TDP{#}Krishna River;devineni avinash;MP;krishna district;YCP;District;MLA;TDP;PartyFri, 12 Nov 2021 10:00:00 GMTఎప్పుడైనా అధికార పార్టీలో ఉండే నేతలకున్న అడ్వాంటేజ్....ప్రతిపక్షంలో ఉండే నేతలకు ఉండదనే చెప్పాలి. అధికార బలం, ఆర్ధిక బలం విషయంలో ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలదే పైచేయి. అందుకే ఆ జిల్లాజిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాలోనూ వైసీపీ నేతల హవా నడుస్తోంది. ఇక టీడీపీలో ఇలాంటి హడావిడి లేదు...ఏదో కొద్దిమంది తప్ప మిగిలిన నేతలు కాస్త సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇప్పుడే హడావిడి చేస్తే ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడతామని అనుకుంటున్నారు.

ముఖ్యంగా కృష్ణా జిల్లా తమ్ముళ్ళు అదే బాటలో ముందుకెళుతున్నారు. కృష్ణా జిల్లాలో చాలామంది టీడీపీ నేతలు ఫుల్‌గా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో తప్ప, మిగిలిన సమయంలో పెద్దగా హడావిడి చేయడం లేదు. పరిస్తుతులకు తగ్గట్టుగా రాజకీయం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నానిలకు పదవులు ఉండటంతో వీరు కాస్త ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఆర్ధిక పరంగా కూడా బలంగానే ఉన్నారు కాబట్టి ఇబ్బందులు లేవు.

అలాగే కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాలు సైతం ఎక్కువగా కనిపిస్తున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరిద్దరు యాక్టివ్ గా ఉండటానికి కారణాలు లేకపోలేదు. గత ప్రభుత్వంలో వీరు మంత్రులుగా పనిచేశారు. అందుకే కాస్త ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు. ఇక మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇంచార్జ్‌లు మాత్రం ఏదో పార్టీ కార్యక్రమాల్లో తప్ప, నియోజకవర్గాల్లో నిత్యం తిరగడం లేదు.

దాదాపు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు నుంచే హడావిడి చేస్తే ఆర్ధిక పరంగా ఇబ్బందులు పడతామనేది తమ్ముళ్ళ బాధ...అందుకే ఎన్నికల ముందు ఫుల్‌గా బరిలో దిగితే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని, ఇప్పుడు హడావిడి చేయడం వల్ల ఉపయోగం ఉండదని కృష్ణా తమ్ముళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  



ఈటల సీఎం కేసీఆర్ కు మరో షాక్.. ఇవ్వనన్నారా..!

కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!

నాలుగు సీట్లున్న బీజేపీ.. కేసీఆర్ ను బయపెట్టిద్దా..!

భారత్ : వీరవనితలకు.. పుట్టినిల్లు..!

కంగనా... నీకిది అవసరమా...!

నెల్లూరు నగర రాజకీయం : జంట మిత్రులకు పరీక్ష

చలికాలంలో ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ?

అచ్చ తెలుగందం ప్రియాంక జవాల్కర్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>