PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan8dde47f2-efde-44a5-9e51-0acef8a63403-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan8dde47f2-efde-44a5-9e51-0acef8a63403-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఒకప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్‌లు ఏపీ రాజకీయాలని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. అయితే వీరు గెలవడం కష్టం గానీ, వేరే పార్టీల గెలుపోటముల్ని మాత్రం ప్రభావితం చేస్తారు. ఇక వీరి వల్ల ఎక్కువగా నష్టపోయింది టీడీపీ మాత్రమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం వల్ల గెలిచి అధికారంలోకి రావాల్సిన టీడీపీ..ఓట్లు చీలిపోవడం వల్ల ఘోరంగా దెబ్బతిని ఓటమి పాలైంది. pawan{#}kakinada;Dwarampudi Chandrasekhara Reddy;Janasena;Cheque;TDP;Chiranjeevi;Andhra Pradesh;Congressద్వారంపూడిని మళ్ళీ మెగా ఫ్యామిలీ సేవ్ చేయడం కష్టమే?ద్వారంపూడిని మళ్ళీ మెగా ఫ్యామిలీ సేవ్ చేయడం కష్టమే?pawan{#}kakinada;Dwarampudi Chandrasekhara Reddy;Janasena;Cheque;TDP;Chiranjeevi;Andhra Pradesh;CongressFri, 12 Nov 2021 02:00:00 GMTఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఒకప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్‌లు ఏపీ రాజకీయాలని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. అయితే వీరు గెలవడం కష్టం గానీ, వేరే పార్టీల గెలుపోటముల్ని మాత్రం ప్రభావితం చేస్తారు. ఇక వీరి వల్ల ఎక్కువగా నష్టపోయింది టీడీపీ మాత్రమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం వల్ల గెలిచి అధికారంలోకి రావాల్సిన టీడీపీ..ఓట్లు చీలిపోవడం వల్ల ఘోరంగా దెబ్బతిని ఓటమి పాలైంది.

కానీ 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్...టీడీపీకి బెనిఫిట్ చేశారు. ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చి అధికారంలోకి రావడానికి సాయం చేశారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఊహిచని దెబ్బవేశారు. పవన్ నేతృత్వంలోని జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి భారీగానే నష్టం జరిగింది. అలాగే వైసీపీకి బాగా లబ్ది జరిగింది. ఇక వీరి వల్ల టీడీపీకి నష్టం జరిగితే కొందరు నాయకులకు మాత్రం బాగా లాభం జరిగింది. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నవారికి...ఇప్పుడు వైసీపీలో ఉన్నవారికి బాగా ప్లస్ అయింది.

అలా అప్పుడు కాంగ్రెస్‌లో, ఇప్పుడు వైసీపీలో ఉండి బెనిఫిట్ పొందినవారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరని చెప్పొచ్చు. 2009 ఎన్నికల్లో ద్వారంపూడి  కాంగ్రెస్ తరుపున కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం, టీడీపీల మధ్య ఓట్లు చీలిపోయి ద్వారంపూడి విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో పవన్..టీడీపీకి సపోర్ట్ చేయడంతో ద్వారంపూడి గెలుపు సాధ్యం కాలేదు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల మళ్ళీ ఓట్లు చీలిపోయి టీడీపీకి నష్టం జరిగి...ద్వారంపూడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి ఉపయోగపడింది. ద్వారంపూడి టీడీపీపై 14 వేల మెజారిటీతో గెలిస్తే, జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి. అంటే టీడీపీ జనసేనలు కలిస్తే ద్వారంపూడి పరిస్తితి ఏమయ్యేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి పవన్..ద్వారంపూడికి ఆ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఈసారి టీడీపీతో గెలిస్తే ద్వారంపూడికి చెక్ పడిపోతుంది.  



ద్వారంపూడిని మళ్ళీ మెగా ఫ్యామిలీ సేవ్ చేయడం కష్టమే?

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>