PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-red-alert-for-tamil-nadu-no-one-should-come-out-f06a8a80-20dd-4be3-b90e-c4fe93d1693b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-red-alert-for-tamil-nadu-no-one-should-come-out-f06a8a80-20dd-4be3-b90e-c4fe93d1693b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ తమిళనాడు వర్షాలతో వణికిపోతోంది. ధాటిగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలెవరూ ఇళ్ల బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది. అటు అధికారులు, రెస్క్యూటీమ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నైలో భయానక వాతావరణం నెలకొంది. AP Red Alert for Tamil Nadu No one should come out {#}srihari;Red;Capital;Huzur Nagar;electricity;Traffic police;Tamilnadu;Andhra Pradesh;Chennai;Governmentఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఎవరూ బయటకు రాకండి..!ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఎవరూ బయటకు రాకండి..!AP Red Alert for Tamil Nadu No one should come out {#}srihari;Red;Capital;Huzur Nagar;electricity;Traffic police;Tamilnadu;Andhra Pradesh;Chennai;GovernmentThu, 11 Nov 2021 18:04:06 GMTబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురుగాలులు, భారీ వర్షాలతో ముంచెత్తుతోంది. నేడు తుపాను తీరం దాటనున్న కారణంగా.. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. అత్యవసర పనులుంటేనే కానీ ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుపాను కొద్ది గంటల్లో తమిళనాడులోని కరైకర్, ఏపీలోని శ్రీహరి కోట దగ్గర ఉన్న కడలూరు సమీపంలో తీరం దాటనుంది.  

కుండపోత వర్షాలకు తమిళనాడు చిగురుటాకులా వణుకుతోంది. ధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా వరద ఉప్పొంగుతోంది. వర్షాల కారణంగా గత నాలుగు రోజుల్లో 91మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. చెన్నై, చెంగల్ పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం, విల్లుపురం ప్రాంతాల్లో ఇళ్లు, ఆసుపత్రుల్లోకి నీరు చేరింది. చెన్నై కేకే నగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్ పూర్తిగా జలమయమైంది.

రానున్న నాలుగు గంటల్లో చెన్నై, తిరువల్లూర్ లో అతి భారీ వర్షాలు పడనున్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై లోని అన్ని సబ్ వేలను మూసివేయాలని.. మరో రెండు రోజుల పాటు ప్రజలు నిత్యావసరాలను అందుబాటులో ఉంచుకోవాలని.. బయటకు రావొద్దని ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నైలో భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం, అధిారులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరీ చేసిన పని అందరితో శెభాష్ అనిపించుకుంటోంది. అనారోగ్యంతో శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని తన భుజాలపై వేసుకొని ఆస్పత్రికి ఆమె తరలించింది. ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అందరూ ఆ మహిళా పోలీస్ ను ఫ్రశంసిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతోంది.












ఇష్టం లేకుండానే ఆయనతో రొమాన్స్..సీక్రేట్స్ బయటపెట్టేసిన రాశి ?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>