PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-amaravathi-police-tirupathiab89c7ba-40fb-434b-b924-e1533280507f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-amaravathi-police-tirupathiab89c7ba-40fb-434b-b924-e1533280507f-415x250-IndiaHerald.jpgఅమరావతి రైతుల మహా పాదయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సేవ్ అమరావతి పేరుతో అమరావతి ప్రాంత రైతులు... న్యాయ స్థానం టూ దేవస్థానం పేరుతో రాష్ట్ర హైకోర్టు నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే పర్చూరు నియోజకవర్గంలో యాత్ర దాదాపు పూర్తి కావస్తుంది. యాత్ర ఆరంభం నుంచి పోలీసుల వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగానే ఉంది. ముందుగా కొవిడ్ సాకు చూపించిన పోలీసులు యాత్రకు అనుమతి నిFarmers{#}Amaravati;Tirupati;High court;Guntur;Parchoor;Prakasam;Maha;Cheque;Yatra;Akkineni Nagarjuna;local language;policeరైతులపై పోలీసుల లాఠీఛార్జ్... విమర్శల వెల్లువ...!రైతులపై పోలీసుల లాఠీఛార్జ్... విమర్శల వెల్లువ...!Farmers{#}Amaravati;Tirupati;High court;Guntur;Parchoor;Prakasam;Maha;Cheque;Yatra;Akkineni Nagarjuna;local language;policeThu, 11 Nov 2021 13:15:57 GMTఅమరావతి రైతుల మహా పాదయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సేవ్ అమరావతి పేరుతో అమరావతి ప్రాంత రైతులు... న్యాయ స్థానం టూ దేవస్థానం పేరుతో రాష్ట్ర హైకోర్టు నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే పర్చూరు నియోజకవర్గంలో యాత్ర దాదాపు పూర్తి కావస్తుంది. యాత్ర ఆరంభం నుంచి పోలీసుల వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగానే ఉంది. ముందుగా కొవిడ్ సాకు చూపించిన పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు. అయితే రైతులు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. 157 మంతి మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని హైకోర్టు సూచించింది. అయితే పాదయాత్రకు విపక్షాలు మద్దతు తెలపడంతో... యాత్రకు భారీ స్పందన వస్తోంది.

యాత్రకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుగా నిలిచాయి. వీటికి తోడు స్థానిక రైతులు కూడా యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఎక్కడికి అక్కడ యాత్ర చేస్తున్న రైతులకు కావాల్సిన ఏర్పాట్లను రైతులే ఏర్పాటు చేస్తున్నారు. అయితే యాత్ర ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు దాటి చదలవాడ ప్రాంతానికి చేరుకోగాని తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాత్రకు చదలవాడ రైతులు సంఘీభావం తెలిపేందుకు ముందుకు రాగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీఛార్జ్ చేశారు. ఈ తోపులాటలో సంతనూతలపాడు గ్రామానికి చెందిన నాగార్జున అనే రైతు చెయ్యి విరిగింది. రైతుల పట్ల పోలీసుల వ్యవహార శైలిని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యాత్రకు మద్దతు తెలిపితే తప్పేంటి అని నిలదీస్తున్నారు. అటు యాత్రలో పాల్గొనేందుకు వచ్చే స్థానిక ప్రజల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై చెక్ పోస్టులు పెట్టి యాత్రకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. దీనిపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.





జ‌ల‌దిగ్బంధంలో చెన్నై.. జోరుగా వాన

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>