MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrrajamoulife055998-8dc2-4ac8-877d-d09d17a9afe6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrrajamoulife055998-8dc2-4ac8-877d-d09d17a9afe6-415x250-IndiaHerald.jpgప్రేక్షకుల నాడి రాజమౌళికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందుకే అతడి కెరియర్ లో ఇప్పటివరకు పరాజయం అన్నది లేదు. సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ ప్రస్తుతం అత్యంత భారీ సినిమాలకు చిరునామాగా మారిన రాజమౌళి లేటెస్ట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ పై ఉన్న అంచనాలను లేటెస్ట్ గా విడుదల అయిన ఈసినిమాకు సంబంధించిన ‘నాటు నాటు’ పాట మరింత పెంచింది.ఈ పాట విడుదలైన కొన్ని గంటలలోనే ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ పాట పై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఈ పాటను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాటలో RRRRAJAMOULI{#}Alluri Seetha Rama Raju;Alluri Sitarama Raju;Komaram Bheem;Jr NTR;Rajamouli;Telangana;Telugu;Mass;Industry;Cinemaఆర్ ఆర్ ఆర్ నాటు పాట పై విమర్శలు !ఆర్ ఆర్ ఆర్ నాటు పాట పై విమర్శలు !RRRRAJAMOULI{#}Alluri Seetha Rama Raju;Alluri Sitarama Raju;Komaram Bheem;Jr NTR;Rajamouli;Telangana;Telugu;Mass;Industry;CinemaThu, 11 Nov 2021 08:08:06 GMTప్రేక్షకుల నాడి రాజమౌళికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందుకే అతడి కెరియర్ లో ఇప్పటివరకు పరాజయం అన్నది లేదు. సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ ప్రస్తుతం అత్యంత భారీ సినిమాలకు చిరునామాగా మారిన రాజమౌళి లేటెస్ట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ పై ఉన్న అంచనాలను లేటెస్ట్ గా విడుదల అయిన ఈసినిమాకు సంబంధించిన ‘నాటు నాటు’ పాట మరింత పెంచింది.



ఈ పాట విడుదలైన కొన్ని గంటలలోనే ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ పాట పై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఈ పాటను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాటలో జూనియర్ చరణ్ లు వేసిన మాస్ స్టెప్స్ వారి అభిమానులకు పండుగగా మారింది. ఇది అంతా నాణానికి ఒకవైపు.



‘ఆర్ ఆర్ ఆర్’ మూల కథ 19వ శతాబ్దం తొలి రోజులకు సంబంధించింది. అలాంటి కాలంలో ఒక ఉత్తరాది ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లు ఒకచోట అనుకోకుండా కలిసినప్పుడు ఏమి జరిగింది అన్న ఊహ చుట్టూ ఈకథ అల్లబడింది. తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్ర సమరయోదులుగా అల్లూరికి అదేవిధంగా కొమరం భీమ్ కు విపరీతమైన ఆదరణ ఉండటమే కాకుండా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో వీరిద్దరినీ అక్కడి గిరిజనులు దేవుడుగా ఆరాధిస్తూ ఉంటారు.



అలాంటి ఉదాత్తమైన నేపధ్యం గల వీరిద్దరి పాత్రలతో సినిమాలు తీస్తున్న రాజమౌళి వీరి పాత్రల స్వభావంతో సంబంధం లేకుండా ఈ పాత్రల చేత మాస్ స్టెప్స్ వేయించడం ఏమిటి అంటూ కొందరు విశ్లేషకులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమరం భీమ్ సామాజిక వర్గానికి చెందిన కొందరు తమ నాయకుడి పాత్రను ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకుండా ఊహాజనిత పాత్రగా ‘ఆర్ ఆర్ ఆర్’ లో చూపిస్తే తాము అంగీకరించము అని చెపుతున్న ప్రస్తుత పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ చారిత్రాత్మిక సినిమాగా రాజమౌళి తీస్తున్నాడా లేకుంటే చారిత్రాత్మిక ముసుకులో ఒక పక్కా మాస్ సినిమాను నిర్మిస్తున్నాడా అన్న సందేహాలు కలగడం సహజం..  






ఆర్ ఆర్ ఆర్ నాటు పాట పై విమర్శలు !

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>