PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/easy-to-tell-where-to-put-the-ink-marke07a6fa3-5ded-45d5-a47b-c49e21934ce6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/easy-to-tell-where-to-put-the-ink-marke07a6fa3-5ded-45d5-a47b-c49e21934ce6-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఏపీలో నవంబర్ 16న ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికలు.. అంతేకాకుండా డిసెంబర్ 10వ తేదీన రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, ఏపీలోని 3స్థానాలకు ఎలక్షన్లు జరుగనున్నాయి. దీంతో ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. Easy to tell where to put the ink mark{#}Vijayanagaram;Vizianagaram;Elections;Hyderabad;December;November;shashank;Vishakapatnam;Evening;Telanganaసిరా గుర్తు ఎక్కడ వేయాలో చెప్పిన ఈసీ..!సిరా గుర్తు ఎక్కడ వేయాలో చెప్పిన ఈసీ..!Easy to tell where to put the ink mark{#}Vijayanagaram;Vizianagaram;Elections;Hyderabad;December;November;shashank;Vishakapatnam;Evening;TelanganaThu, 11 Nov 2021 19:30:49 GMTఏపీలో నవంబర్ 16న జరిగే ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే వారికి ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పలు గ్రామాల్లో 14వ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరకు ఎడమ చేయి చూపుడు వేలిపై.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎడమ చెయ్యి చిటికెన వేలిపై సిరా గుర్తు వేయనున్నారు.

ఏపీలో 11ఎమ్మెల్సీ స్థానాల బర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. డిసెంబర్ 10న ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 14న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుండగా.. 8జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 8జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎలక్షన్ కోడ్ ను పటిష్టంగా అమలు చేయాలని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కోడ్ ను రాజకీయ నేతలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది, ఓటర్లు టీకా డోసులు తీసుకునే వరకు చూడాలని సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సభలు, సమావేశాల్లో 500లకు మించరాదు. నామినేషన్ల సమయంలో ర్యాలీకి అనుమతిలేదు. పాదయాత్రలు, ధర్నాలు, సమావేశాలకు కలెక్టర్ల అనుమతి తప్పనిసరి. కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.



సిరా గుర్తు ఎక్కడ వేయాలో చెప్పిన ఈసీ..!

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>