PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8fb69302-cbb3-401d-b2f4-869546da2298-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8fb69302-cbb3-401d-b2f4-869546da2298-415x250-IndiaHerald.jpgతాను తీసిన గోతిలో తానే ప‌డ్డ‌ట్టు అనే సామెత‌ రాజ‌కీయాల్లో అనేక‌సార్లు నిరూపితం అయింది. ఎన్నిక‌ల వ్యూహాలు, రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌ నేప‌థ్యంలో పార్టీలో వ‌ల‌స‌లకు రెడ్ కార్పెట్ వేస్తుంది. పార్టీకి బ‌లం పెరిగేందుకు చేరిక‌లు, వ‌ల‌స‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. అయితే, పార్టీని గెలిపించడంలోనూ అదే సంద‌ర్భంలోనూ ఓడించ‌డంలోనూ ఈ ప‌ద్ద‌తి ముందు వ‌రుస‌లో ఉంటుంది. మితంగా తింటేనే ఆహారం జీర్ణం అవుతుంది.. అదే అమితంగా తింటే విషంగా మారే ప‌రిస్థితులు కూడా ఏర్ప‌డుతాయి. ఈ మాట‌లు టీఆర్ఎస్ పార్టీకి అచ్చంగా సూట్ అవుతాయి. kcr{#}vivek;Red;Car;Telangana Rashtra Samithi TRS;KCR;MLA;Reddy;Party;CM;local languageఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. కేసీఆర్‌కు త‌ల‌నొప్పి తెస్తాయా..?ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. కేసీఆర్‌కు త‌ల‌నొప్పి తెస్తాయా..?kcr{#}vivek;Red;Car;Telangana Rashtra Samithi TRS;KCR;MLA;Reddy;Party;CM;local languageThu, 11 Nov 2021 09:59:19 GMTతాను తీసిన గోతిలో తానే ప‌డ్డ‌ట్టు అనే సామెత‌ రాజ‌కీయాల్లో అనేక‌సార్లు నిరూపితం అయింది. ఎన్నిక‌ల వ్యూహాలు, రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌ నేప‌థ్యంలో పార్టీలో వ‌ల‌స‌లకు రెడ్ కార్పెట్ వేస్తుంది. పార్టీకి బ‌లం పెరిగేందుకు చేరిక‌లు, వ‌ల‌స‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. అయితే, పార్టీని గెలిపించడంలోనూ అదే సంద‌ర్భంలోనూ ఓడించ‌డంలోనూ ఈ ప‌ద్ద‌తి ముందు వ‌రుస‌లో ఉంటుంది. మితంగా తింటేనే ఆహారం జీర్ణం అవుతుంది.. అదే అమితంగా తింటే విషంగా మారే ప‌రిస్థితులు కూడా ఏర్ప‌డుతాయి. ఈ మాట‌లు టీఆర్ఎస్ పార్టీకి అచ్చంగా సూట్ అవుతాయి.


 ఎందుకంటే గులాబీ కారు ఎన్న‌డో ఫుల్ అయిపోయింది. త‌న బ‌లానికి మించిన భారాన్ని మోస్త‌న్న కారు ఎప్పుడో పంచ‌ర్ అవుతుంది అని రాజ‌కీయ విశ్లేష‌కులు ఎన్న‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నారు. ఇలా గ‌తంలో  ఇత‌ర నేత‌ల కార‌ణంగా టీఆర్ఎస్ ను వీడిన నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వివేక్ వెంక‌ట స్వామి, జితేంద‌ర్ రెడ్డి లాంటి కొంద‌రు నేత‌లు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇంకా పార్టీలోనే ఉంటూ త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని చాలామంది నేత‌లు ఎంతో ఆశ‌లు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ ప‌ద‌వులు అయినా వ‌రిస్తాయ‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.


   ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆశావాహుల పాలిట దీపంలా మారింది. అయితే.. ఎమ్మెల్యే కోటా, గ‌వ‌ర్న‌ర్ కోటా, ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం చాలామంది నేత‌లు లైనులో ఉన్నారు. ఈ క్ర‌మంలో పార్టీలో చాలా కాలంగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుల‌కు పోటీగా ఇటీవ‌ల ఇత‌ర పార్టీల నుంచి చేరిన న నేత‌లు ఎమ్మెల్సీ టికెట్ లు ఆశిస్తున్నారు. అలాగే, గ‌తంలో ఎమ్మెల్సీలుగా ఉన్న‌వారు కూడా రెన్యూవ‌ల్ కోసం ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌తంలో ఎమ్మెల్సీ టికెట్‌లు ఆశించిన వారికి కూడా కేసీఆర్ హామీలు ఇవ్వ‌డంతో ఈసారి త‌ప్ప‌కుండా త‌మ‌కు ప‌ద‌వులు వ‌స్తాయని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.


 అయితే, ఆశావాహులు ఎక్కువ‌గా ఉండ‌డంతో సీఎం కేసీఆర్‌కు ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యంలో త‌ల‌నొప్పిగా మారింది అని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్ప‌టికే చాలామంది అసంతృప్తులు ఉన్నారు. వాళ్ల‌కు ఏదో చెప్పి ఇన్ని రోజుల ఆపారు.. ఇప్పుడు కూడా ఆ నేత‌ల‌కు టికెట్లు ఇవ్వ‌క‌పోతే కారు దిగుతార‌నేది  కేసీఆర్‌కు తెలుసు. దీంతో ఎవ‌రిని ఎలా బుజ్జ‌గించాలో అనే ప్ర‌య‌త్నాల్లో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.



మున్సిపల్ లెవల్ కు పడిపోయిన బాబు.. కారణం..!

దలైలామాతో.. చైనా చర్చలు.. షరతులు వర్తిస్తాయట..!

ఆఫ్ఘన్ లో శాంతికి.. ఎన్ఎస్ఎ చర్చలు..!

పాపం అంగన్‌వాడీలు... అన్ని కొరతే...!

విశాఖలో ఐటీ దాడులు కలకలం..!

ఆ స్కీమ్ తో ప్రతి నెలా చేతికి రూ.5 వేలు..!

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>