PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాల్పడిన కుంభకోణాల్లో ఇసుక కుంభకోణం అత్యంతకీలకమైనది అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ప్రతిపక్షం ఇసుక దోపిడీపై ప్రశ్నించినా, నిర్మాణ రంగ కార్మికులు పస్తులుండి చనిపోయినా, ఈ ప్రభుత్వం తనపంథా మార్చుకోలేదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇసుక టెండర్లను ముందే ఫిక్సింగ్ చేసిన ప్రభుత్వం, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కోసం ఆ నిజాన్ని దాచేసింది అని మండిప‌డ్డారు. రాజన్నరాజ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగాయంటున్న ఇసుక టెండర్లలో ఫిక్సింగ్ap politics{#}raja;Mister;TDP;workers;Reddy;Telangana Chief Minister;Minister;CM;Governmentఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీap politics{#}raja;Mister;TDP;workers;Reddy;Telangana Chief Minister;Minister;CM;GovernmentThu, 11 Nov 2021 12:21:27 GMTజగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాల్పడిన కుంభకోణాల్లో ఇసుక కుంభకోణం అత్యంతకీలకమైనది అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ప్రతిపక్షం ఇసుక దోపిడీపై ప్రశ్నించినా, నిర్మాణ రంగ కార్మికులు పస్తులుండి చనిపోయినా, ఈ ప్రభుత్వం తనపంథా మార్చుకోలేదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇసుక టెండర్లను ముందే ఫిక్సింగ్ చేసిన ప్రభుత్వం, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కోసం ఆ నిజాన్ని దాచేసింది అని మండిప‌డ్డారు. రాజన్నరాజ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగాయంటున్న ఇసుక టెండర్లలో ఫిక్సింగ్ రాజా ఎవరో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు కొమ్మారెడ్డి ప‌ట్టాభీరామ్‌.



   మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇసుక టెండర్లకు సంబంధించిన ఒక్క కాగితాన్నికూడా జ్యూడీషియల్ ప్రివ్యూకి ఎందుకు పంపలేదు అని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని అని ప్ర‌శ్నించారు.  ఇసుక టెండర్లలో చేయాల్సిందంతా చేసి, నీతి నిజాయితీ అంటూ పెద్దపెద్ద పదాలు వాడతారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇసుక టెండర్లకు సంబంధించిన టెక్నికల్ గైడ్ లైన్స్ తో తమకు సంబంధం లేదని ఎంఎస్ డీసీ గతంలోనే కుండబద్దలుకొట్టింది అని గుర్తుచేశారు. 01-10-2021 న ఎంఎస్ డీసీ వారు తాము అడిగిన ఆర్టీఏ సమాచారానికి సమాధానమిచ్చారు అని వివ‌రించారు.


   స‌మాచారం ప్రకారం ఎన్నిప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు, ఏ కంపెనీలను ఎల్ 1 గా పరిగణించి టెండర్లు కట్టబెట్టారనే సమాచారమిచ్చారు అని చెప్పారు. మొదటి ప్యాకేజీకి కే.ఎన్.ఆర్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ మాత్రమే టెండర్లు దాఖలు చేశాయని, రెండో ప్యాకేజీకి కూడా అవే కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా, మూడో ప్యాకేజీకి ట్రైడెంట్ కెమ్ ఫర్ లిమిటెడ్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ టెండర్లు దాఖలు చేశాయి వివ‌రించారు.


 ఈ మొత్తం వ్యవహారంలోనే జగ‌న్‌మోహన్ రెడ్డి  ప్రభుత్వం టెండర్లలో ఫిక్సింగ్ కి పాల్పడింది అని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. మొదటి ప్యాకేజీకి ప్రభుత్వం నిర్ణయించిన కనీసధర రూ. 470కోట్లు అయితే, టెండర్లలో పాల్గొన్న కేఎన్ఆర్ కనస్ట్రక్షన్స్ అత్యంత అద్భుతంగా కేవలం రూ. 472 కోట్ల‌తో టెండ‌ర్  వేసింది అని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు రూ. 477.05 కోట్లకు టెండ‌ర్ వేస్తే, దానికే టెండర్ కట్టబెట్టారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొమ్మారెడ్డి ప‌ట్టాభీరామ్‌.



హైదరాబాద్ అమ్మాయిని ఈ రేంజ్ లో కొట్టాడా...? ఆమె పరిస్థితి ఏంటీ...?

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!

వానాకాలం పంటనే కొంటాం : గంగుల

ఛీ ఛీ.. సానిటరీ ప్యాడ్ తో.. ఆ పాడు పని చేసిన మహిళ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>