PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpca5c1888-5543-4886-995f-6291b029aebf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpca5c1888-5543-4886-995f-6291b029aebf-415x250-IndiaHerald.jpg వాస్తవానికి మొన్న‌టి జెడ్పీ ఎన్నిక‌ల అనంత‌రం సంబంధిత చైర్ ప‌ర్సన్ ప‌ద‌వి ఈ కుటుంబానికే ద‌క్కుతుంద‌ని ఆశించినా చివ‌రి నిమిషంలో అది చేజారింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీంతో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ కు బ‌దులు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి జ‌గ‌న్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు. మొద‌ట్నుంచి పార్టీకి విధేయులుగా ఉన్న ఈ కుటుంబం అందుకు త‌గ్గ విధంగానే ప‌ద‌వుల్లో స‌ముచిత స్థానం అందుకుంటుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం ఎంపీ స్థానానికి మ‌ళ్లీ పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో రెడ్డి శాంతి ఉన్నార‌ని స‌మాచారం. ఈ ద‌శ‌లో ఆ కుటుంబానycp{#}BOTCHA SATYANARAYANA;Deputy Chief Minister;REDDY SHANTHI;vikranth;MP;Wife;YCP;Districtశ్రీకాకుళం వార్త : ఆ ఒక్క ఇంటికే ఇన్ని పదవులా జగన్!శ్రీకాకుళం వార్త : ఆ ఒక్క ఇంటికే ఇన్ని పదవులా జగన్!ycp{#}BOTCHA SATYANARAYANA;Deputy Chief Minister;REDDY SHANTHI;vikranth;MP;Wife;YCP;DistrictThu, 11 Nov 2021 18:03:28 GMTశ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లోనూ ఇంకా చెప్పాలంటే ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లోనూ కాపు సామాజిక‌వ‌ర్గం స్థానం ప్ర‌త్యేకం. అటు విజ‌య‌న‌గ రంలో ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణే అంతా అయి ఉంటాయి. అక్క‌డ తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ య‌న ప్రాబ‌ల్యం ప్రాధాన్యం ఉంటూనే ఉంటుంది. ఇక శ్రీ‌కాకుళం జిల్లాలోనూ ఎచ్చెర్ల‌, రాజాం, పాత‌ప‌ట్నం, పాల‌కొండ నియోజ‌క‌వ ర్గాల్లో ఈ సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువే! అదేవిధంగా అటు విశాఖ‌లోనూ, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఈ సామాజిక‌వ‌ర్గం బా గా విస్త‌రించి ఉంది. రాజ‌కీయ ప్రాబ‌ల్యం కార‌ణంగానే జ‌గ‌న్ కూడా ఈ సామాజిక వ‌ర్గాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ విష‌య‌మై చంద్ర‌బాబు చేసిన త‌ప్పిదాలు తాను చేయ‌కూడ‌దు అన్న స్పృహలో ఉంటూ ప‌నిచేస్తున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఒక డిప్యూటీ సీఎం పోస్టు నిమ్మ‌కాయ‌ల చిన రాజ‌ప్ప‌కు ఇచ్చి అంతా తానై న‌డిపారు. అదే వ్య‌క్తికి హోం శాఖ కూడా ఇచ్చారు. కానీ అది కూడా పూర్తిగా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపి కాపుల‌కు ఇచ్చిన ప‌ద‌వుల‌కు ప్రాధాన్యం అన్న‌దే లేకుండా చేశారు.

ఇక తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గ కాపు నేత పాల‌వ‌ల‌స విక్రాంత్ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు జ‌గ‌న్. గ‌తంలో ఈయ‌న‌కే డీసీసీబీ ప‌ద‌వి కూడా ఇచ్చారు. ఈ ప‌ద‌వి నుంచి దిగిన వెంట‌నే ఈయ‌న‌కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి గౌర‌వం అందించారు. ఇదే స‌మ‌యంలో ఇంకొన్ని విష‌యాలు ఇక్క‌డ ప్ర‌స్తావించాలి. పాల‌వ‌ల‌స విక్రాంత్ సోద‌రి రెడ్డి శాంతి పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే. ఆయ‌న త‌ల్లి పాల‌వ‌ల‌స ఇందుమ‌తి రేగిడి జెడ్పీటీసీ, భార్య గౌరీ పార్వ‌తి, పాల‌కొండ జెడ్పీటీసీ ఇలా ఒకే ఇంట్లో ఇన్ని కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త జ‌గ‌న‌న్న‌దే కావ‌డం విశేషం.


వాస్తవానికి మొన్న‌టి జెడ్పీ ఎన్నిక‌ల అనంత‌రం సంబంధిత చైర్ ప‌ర్సన్ ప‌ద‌వి ఈ కుటుంబానికే ద‌క్కుతుంద‌ని ఆశించినా చివ‌రి నిమిషంలో అది చేజారింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీంతో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ కు బ‌దులు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి  జ‌గ‌న్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు. మొద‌ట్నుంచి పార్టీకి విధేయులుగా ఉన్న ఈ కుటుంబం అందుకు త‌గ్గ విధంగానే ప‌ద‌వుల్లో స‌ముచిత స్థానం అందుకుంటుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం ఎంపీ స్థానానికి మ‌ళ్లీ పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో రెడ్డి శాంతి ఉన్నార‌ని స‌మాచారం. ఈ ద‌శ‌లో ఆ కుటుంబానికి ఎమ్మెల్సీ ప‌ద‌వి రావ‌డం పాల‌కొండ‌, పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ శ్రేణుల‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.



ఇష్టం లేకుండానే ఆయనతో రొమాన్స్..సీక్రేట్స్ బయటపెట్టేసిన రాశి ?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>