PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-do-farmers-follow-the-rules-during-the-padayatra078784b7-41dc-4dd7-894b-d29a5ef9ef66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-do-farmers-follow-the-rules-during-the-padayatra078784b7-41dc-4dd7-894b-d29a5ef9ef66-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన శాఖ ఏదీ అంటే... అంతా ఠక్కున చెప్పే సమాధానం పోలీసు శాఖ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యధిక ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖ పోలీసులు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉంది పోలీసులు నడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎన్నో విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసుల తీరుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది కూడా. ఇకFarmers{#}Amaravati;K S Ravikumar;gautham new;gautham;Prakasam;Maha;Y. S. Rajasekhara Reddy;House;Yatra;Hanu Raghavapudi;central government;court;News;YCP;Telugu Desam Party;Party;TDP;policeవివాదాస్పదమవుతున్న పోలీసుల తీరు..!వివాదాస్పదమవుతున్న పోలీసుల తీరు..!Farmers{#}Amaravati;K S Ravikumar;gautham new;gautham;Prakasam;Maha;Y. S. Rajasekhara Reddy;House;Yatra;Hanu Raghavapudi;central government;court;News;YCP;Telugu Desam Party;Party;TDP;policeThu, 11 Nov 2021 12:55:52 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన శాఖ ఏదీ అంటే... అంతా ఠక్కున చెప్పే సమాధానం పోలీసు శాఖ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యధిక ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖ పోలీసులు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉంది పోలీసులు నడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎన్నో విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసుల తీరుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది కూడా. ఇక పోలీసు బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఇప్పటికే రెండు, మూడు సార్లు హైకోర్టుకు స్వయంగా హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసుల వ్యవహార శైలిలో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఓ వైపు ప్రతిపక్షాలు, మరోవైపు న్యాయస్థానాలు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అయితే... ఒక అడుగు ముందుకు వేసి... ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేస్తే... వారిని వదిలేసి.. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు చేశారు. ఇప్పుడు సేవ్ అమరావతి పేరుతో రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర పై మొదటి నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఈ యాత్రలో పాల్గొంటున్న నేతల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే నేతలను కంట్రోల్ చేసేందుకు కూడా పోలీసులు వెనుకాడటం లేదు. పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ తో పాటు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామాచర్ల జనార్దన్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కారణం అడిగితే మాత్రం... ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.





అమెరికాలో మన పాత విగ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నట్టు...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>