PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/amavathi-movement-becomes-more-intense013e5c4d-1506-45e0-aba7-a1ed44a735ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/amavathi-movement-becomes-more-intense013e5c4d-1506-45e0-aba7-a1ed44a735ba-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, అమరావతిని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. శాసన రాజధానిగా ఉంచుతామని చెప్పిన..అదే పేరుకే అని అర్ధమవుతుంది. అంటే అమరావతినే లేకుండా చేయాలనేది జగన్ కాన్సెప్ట్ అని అందరికీ అర్ధమైంది. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో...అప్పటినుంచి అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని దాదాపు రెండేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. అలా ఉద్యమం చేస్తున్న రైతులని, ప్రజలని వైసీపీ ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బందులamaravathi{#}Jagan;Amaravati;Tirupati;local language;YCPఅమరావతి ఉద్య‌మానికి సైలెంట్ స‌పోర్ట్ ఇంత ఉందా...!అమరావతి ఉద్య‌మానికి సైలెంట్ స‌పోర్ట్ ఇంత ఉందా...!amaravathi{#}Jagan;Amaravati;Tirupati;local language;YCPWed, 10 Nov 2021 11:04:35 GMTజగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, అమరావతిని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. శాసన రాజధానిగా ఉంచుతామని చెప్పిన..అదే పేరుకే అని అర్ధమవుతుంది. అంటే అమరావతినే లేకుండా చేయాలనేది జగన్ కాన్సెప్ట్ అని అందరికీ అర్ధమైంది. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో...అప్పటినుంచి అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని దాదాపు రెండేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. అలా ఉద్యమం చేస్తున్న రైతులని, ప్రజలని వైసీపీ ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టిందో చెప్పాల్సిన పని లేదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ విమర్శలు చేసింది.

పెయిడ్ ఆర్టిస్టులే అయితే...ఒకటి, రెండు రోజులు డబ్బులు తీసుకుని హడావిడి చేసి వెళ్లిపోతారు..ఇన్ని రోజులు ఉద్యమం చేయరు...అలాగే పోలీసుల చేత దెబ్బలు తినరు. అందుకే అనుకుంటా అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు వస్తుంది. అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్ధతుగా ప్రజలు వస్తున్నారు.

ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్న పాదయాత్రకు అక్కడ ఉన్న చుట్టూ పక్కల ఉన్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్ధతు ఇస్తున్నారు. చెప్పాలంటే ఊహించని విధంగా అమరావతికి మద్ధతు వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదంతా ఇప్పటివరకు ఎందుకు కనబడలేదు? అంటే అదంతా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమే అని చెప్పొచ్చు. అమరావతి ఉద్యమం 29 గ్రామాలకు సంబంధించిందే అని మాట్లాడారు. దానికి మిగిలిన ప్రజల మద్ధతు లేదని అన్నారు.

కానీ రాష్ట్ర ప్రజల మద్ధతు ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఇప్పుడు బయటకొచ్చి ఉద్యమాలు చేసిన ఉపయోగం ఉండదు...వారు మనసు మార్చుకోరు...అలా అని స్థానిక ఎన్నికల్లో ఓడించిన ప్రభుత్వ పథకాలు అందవు. ఇలా అనేక కారణాలతో ప్రజలు...అమరావతికి మద్ధతు తెలపలేదని చెప్పొచ్చు. కానీ సైలెంట్‌గా మాత్రం అమరావతి వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.  



అంతుచిక్కని కొండపల్లి ఓటరు నాడి....!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>