PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/96-countries-give-green-signal-for-vaccination-certificated54766c0-32c2-4416-a763-cc8ecab0e920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/96-countries-give-green-signal-for-vaccination-certificated54766c0-32c2-4416-a763-cc8ecab0e920-415x250-IndiaHerald.jpgకేంద్ర ఆరోగ్య శాఖ కీలక విషయాలు వెల్లడించింది. కొవిన్ పోర్టల్ నుంచి టీకా సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చనే విషయాన్ని వెల్లడించింది. ఆ సర్టిఫికేట్ కు 96దేశాలు ఆమోదం తెలిపినట్టు వెల్లడించాయి. మరోవైపు కొవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం 50వేల రూపాయల పరిహారం ఇస్తోంది. 96 countries give green signal for vaccination certificate{#}University;Application;Coronavirus;central government;Bank;Government;Indiaఆ టీకా సర్టిఫికేట్ కు 96దేశాలు గ్రీన్ సిగ్నల్ ..!ఆ టీకా సర్టిఫికేట్ కు 96దేశాలు గ్రీన్ సిగ్నల్ ..!96 countries give green signal for vaccination certificate{#}University;Application;Coronavirus;central government;Bank;Government;IndiaWed, 10 Nov 2021 20:32:49 GMTకరోనా టీకా సర్టిఫేకేట్ ను గుర్తించేందుకు భారత్ తో 96దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగతా దేశాల ఆమోదం కోసం కేంద్రం వారితో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. దీని ద్వారా విద్య, వ్యాపారం, పర్యటన కోసం విదేశీ రాకపోకలకు ఇబ్బంది ఉండదని చెప్పింది. ఇకపై భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారు కూడా కొవిన్ పోర్టల్ నుంచి టీకా సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

మరోవైపు కొవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం 50వేల రూపాయల పరిహారం ఇస్తోంది. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తు చేసేటప్పుడు ప్రభుత్వం కొవిన్ డెత్ అని జారీ చేసిన సర్టిఫికేట్ తో పాటు కరోనా పాజిటివ్ రిపోర్టును జత చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ లేకపోతే వైరస్ కారణంగా అడ్మిట్ అయిన ఆసుపత్రి నుంచి డెత్ సర్టిఫికేట్ సమర్పించాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి.

ఇక కరోనాకు గురైన వారిలో సహజంగా వచ్చే యాంటీబాడీలతో పోలిస్తే.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న వారిలో అధికంగా యాంటీబాడీలు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. డెల్టా వేరియంట్ ను కూడా ఈ టీకాలు అడ్డుకుంటున్నాయని కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. యువకుల్లో కంటే 50ఏళ్ల వయసు వారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు.

ఇక నిన్నటితో పోలిస్తే.. మన దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 10వేల 126 నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 11వేల 466 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 460మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 61వేల 849కి చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం లక్షా 39వేల 683యాక్టివ్ కేసులున్నాయి. మొత్తానికి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక విషయం ప్రకటించింది.





 






ఆ టీకా సర్టిఫికేట్ కు 96దేశాలు గ్రీన్ సిగ్నల్ ..!

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>