Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china0b22065f-90c6-4f05-a995-8d9bb2a8f553-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china0b22065f-90c6-4f05-a995-8d9bb2a8f553-415x250-IndiaHerald.jpgఎన్నో ఏళ్ల నుంచి తైవాన్ ను చైనాలో కలిపేసుకోవాలని భావిస్తున్న చైనా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేసింది. ఇటీవలి కాలంలో కాస్త తెగించింది అనే చెప్పాలి. ఏకంగా తైవాన్ గగనతలం లోకి భారీగా యుద్ధ విమానాలను పంపించడం.. సరిహద్దుల్లో భారీ మొత్తంలో చైనా సైనికులను మోహరించడం లాంటివి చేసింది. దీంతో ఈ క్షణంలో తైవాన్ తో చైనా యుద్ధానికి ఎప్పుడు దిగుతుందో అన్న విధంగానే మారిపోయింది సరిహద్దుల్లో పరిస్థితి. అయితే తైవాన్ పై చైనా తీరు మార్చుకోవాలి అంటూ ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు హెచ్చరిస్తున్నాయి అన్న విషయం China{#}Hong Kong;war;Governmentతైవాన్ పై చైనా హాంకాంగ్ వ్యూహం.. ఏం జరుగుతుందో?తైవాన్ పై చైనా హాంకాంగ్ వ్యూహం.. ఏం జరుగుతుందో?China{#}Hong Kong;war;GovernmentWed, 10 Nov 2021 15:45:00 GMTఎన్నో ఏళ్ల నుంచి తైవాన్ ను చైనాలో కలిపేసుకోవాలని భావిస్తున్న చైనా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేసింది. ఇటీవలి కాలంలో కాస్త తెగించింది అనే చెప్పాలి. ఏకంగా తైవాన్ గగనతలం లోకి భారీగా యుద్ధ విమానాలను పంపించడం.. సరిహద్దుల్లో భారీ మొత్తంలో చైనా సైనికులను మోహరించడం లాంటివి చేసింది. దీంతో ఈ క్షణంలో తైవాన్ తో చైనా యుద్ధానికి ఎప్పుడు దిగుతుందో అన్న విధంగానే మారిపోయింది సరిహద్దుల్లో పరిస్థితి. అయితే తైవాన్ పై చైనా తీరు మార్చుకోవాలి అంటూ ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు హెచ్చరిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగానే వ్యవహరిస్తోంది చైనా.



 అయితే ఇక మరికొన్ని రోజుల్లో చైనా యుద్ధం చేస్తుంది అనుకుంటున్న సమయంలో.. తైవాన్ స్వాధీనం చేసుకోవడానికి చైనా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. గతంలో తైవాన్ లాగానే స్వతంత్ర దేశంగా ఉన్న హాంకాంగ్ ను ఎంతో వ్యూహాత్మకంగా తమ దేశంలో కలుపుకుంది చైనా. ఇక ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా ఇలాంటి తరహా వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. అడుగడుగునా తమకు అడ్డు వస్తున్న తైవాన్ అధ్యక్షురాలుని గద్దె దించి ఇక తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని అధికారంలోకి తీసుకు రావాలని భావిస్తోంది.


 తైవాన్ లో చైనా కు అనుకూలంగా ఉన్న వారందరితో కూడా.. స్వతంత్ర దేశంగా ఉండటం కంటే చైనాలో కలిస్తేనే ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది అని ప్రచారం చేయించి  అందరిలో మార్పు తీసుకు వచ్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా క్రమక్రమంగా చైనా తైవాన్ ప్రజలందరూ కూడా చైనాతో కలవడానికే సిద్ధం అయ్యేలా ఆలోచన మార్చేందుకు ప్రస్తుతం చైనా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నేరుగా యుద్దానికి దిగితే తైవాన్ ప్రజలందరూ వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉందని ఇక ఇలా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తైవాన్ చైనాలో కలిసిపోతుందని చైనా భావిస్తుందట. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాలి మరి.



తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..ఛాన్స్ ఎవరికీ..?

సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. !

నిఘా నీడలో తిరుపతి... హై అలర్ట్...!

ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌కు పుల్ మీల్స్‌..

అరుదైన శిశువు.. ప్రతి వెయ్యిమందిలో ఒక్కరే?

పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్టు

బిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?

వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

నాగ చైతన్య ఒత్తిడిలో ఉన్నాడా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>