PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpgఏపీ బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న అంశం. ఏపీలో పెట్రోల్ ధరలకు సంబంధించి బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొన్ని చోట్ల హీట్ పెంచుతున్నాయి అనే విషయం చెప్పాలి. ఇక దీనికి సంబంధించి సోము వీర్రాజు చేసే కామెంట్స్ బాగా మీడియాలో హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆయన వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేసారు నేడు. నెల్లూరు మేయర్ స్థానాన్ని మేమె కైవసం చేసుకుంటాం అని ఆయన స్పష్టం చేసాbjp{#}amrutha;Nellore;Badvel;Somu Veerraju;Petrol;Guntur;Reddy;YCP;Bharatiya Janata Party;Elections;local language;TDP;Governmentస్వరం పెంచిన సోము... జగన్ పై లెక్కలతో దాడి...!స్వరం పెంచిన సోము... జగన్ పై లెక్కలతో దాడి...!bjp{#}amrutha;Nellore;Badvel;Somu Veerraju;Petrol;Guntur;Reddy;YCP;Bharatiya Janata Party;Elections;local language;TDP;GovernmentWed, 10 Nov 2021 19:25:46 GMTఏపీ బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న అంశం. ఏపీలో పెట్రోల్ ధరలకు సంబంధించి బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొన్ని చోట్ల హీట్ పెంచుతున్నాయి అనే విషయం చెప్పాలి. ఇక దీనికి సంబంధించి సోము వీర్రాజు చేసే కామెంట్స్ బాగా మీడియాలో హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆయన వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేసారు నేడు.

నెల్లూరు మేయర్ స్థానాన్ని మేమె కైవసం చేసుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పక్షంతో ప్రతిపక్ష టిడిపి కుమ్మక్కైంది అని విమర్శలు చేసారు. బద్వేలు ఎన్నికల్లో టిడిపి పోటీ చేయలేక చేతులెత్తేసింది అని సోము వీర్రాజు ఎద్దేవా చేసారు. అన్ని చోట్లా టిడిపి పోటీపడలేక వెనుకబడుతోంది అన్నారు సోము. వైసిపి ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న... స్థానిక సంస్థల ఎన్నికలకి అభివృద్ధి లో మీ భాగస్వామ్యం ఏమిటి అని ప్రశ్నించారు. మీకు ప్రజాబలం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకు ఎన్నికలు జరపడం లేదు అని నిలదీశారు.

గుంటూరు జిల్లా కారంపూడి లో అభ్యర్థికి ఎం.ఓ.సి. ఇవ్వకుండా దారుణాలకు పాల్పడ్డారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అధికారులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. మీకు జీతాలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాదు.. ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేసారు. స్థానిక సంస్థల్లో కేంద్రం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కి ప్రతి యేటా తలకు 640 రూ ఇస్తున్నాం అన్నారు ఆయన. కేంద్రం నుంచి ప్రతి యేటా 5 కోట్లు ఇస్తున్నాము అన్నారు. అమృత పధకం కింద నెల్లూరుకి 1150 కోట్లు నిధులు కేటాయించాం అని తెలిపారు. స్థానిక సంస్థల్లో మీ భాగస్వామ్యం ఏముంది అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.



"సోను సూద్" ఎక్కడికెళ్లినా సక్సెస్ ఖాయం...

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>