PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-chandrababue9da1667-d9e0-4415-a07f-abdeffead4c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-chandrababue9da1667-d9e0-4415-a07f-abdeffead4c9-415x250-IndiaHerald.jpgవిభ‌జ‌న అనంత‌రం ఏపీ సీఎంగా.. ఉమ్మ‌డిఏపీ సీఎంగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఉన్న రికార్డును ఎవ‌రూ చెరిపేయ‌లేరు. ఆయ‌న‌కు ఆయ‌నే చెప్పుకొన్న‌ట్టుగా.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో ఆయ‌న దూసుకు పోతున్నారు. అయితే.. వ్యూహాల విష‌యంలోనే ఆయ‌న వెనుక‌బ‌డుతున్నార‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి పైకి చెప్పి.. ప్ర‌జ‌ల‌ను ఒప్పించ‌డం.. రెండు.. చేసి.. చూపించి.. ప్ర‌జ‌లు త‌మంత‌ట త‌మే.. ఒప్పుకొనేలా చేయ‌డం. ఈ రెండు విధానాల్లో ఇటీవ‌ల కాలంలో బాగా వ‌ర్కువుట్ అవుతోంది.. నాయ‌కులు నమ్ముతున్jagan chandrababu{#}Odisha;Allu Sneha;Fidaa;Telugu;Telugu Desam Party;Telangana;TDP;Andhra Pradeshజ‌గ‌న్ వ్యూహం.. చంద్ర‌బాబుకు లోపించిందా... మేధావుల మాటేంటంటే..!జ‌గ‌న్ వ్యూహం.. చంద్ర‌బాబుకు లోపించిందా... మేధావుల మాటేంటంటే..!jagan chandrababu{#}Odisha;Allu Sneha;Fidaa;Telugu;Telugu Desam Party;Telangana;TDP;Andhra PradeshWed, 10 Nov 2021 14:35:00 GMTవిభ‌జ‌న అనంత‌రం ఏపీ సీఎంగా.. ఉమ్మ‌డిఏపీ సీఎంగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఉన్న రికార్డును ఎవ‌రూ చెరిపేయ‌లేరు. ఆయ‌న‌కు ఆయ‌నే చెప్పుకొన్న‌ట్టుగా.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో ఆయ‌న దూసుకు పోతున్నారు. అయితే.. వ్యూహాల విష‌యంలోనే ఆయ‌న వెనుక‌బ‌డుతున్నార‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి పైకి చెప్పి.. ప్ర‌జ‌ల‌ను ఒప్పించ‌డం.. రెండు.. చేసి.. చూపించి.. ప్ర‌జ‌లు త‌మంత‌ట త‌మే.. ఒప్పుకొనేలా చేయ‌డం. ఈ రెండు విధానాల్లో ఇటీవ‌ల కాలంలో బాగా వ‌ర్కువుట్ అవుతోంది.. నాయ‌కులు నమ్ముతున్న‌ది కూడా రెండో కాన్సెప్టునే. ఎందుకంటే.. ఇప్పుడు చెబితే వినేవారు.. న‌మ్మేవారు క‌నిపించ‌డం లేదు. సో.. రెండో కాన్సెప్టుకే నాయ‌కులు.. రెడీ అవుతున్నారు.

ఈ విష‌యం ఎందుకు చ‌ర్చ‌కు వ‌చ్చిందంటే.. ఏపీ సీఎం.. కానీ.. అటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కానీ.. చంద్ర‌బాబుతో పోల్చుకుంటే.. చాలా జూనియ‌ర్ల‌నే చెప్పాలి. అయితే.. ఇప్పుడు వారు అనుస‌రిస్తున్న తీరుతో.. ప్ర‌జ‌ల్లో వారికి మార్కులు ఆటోమేటిక్‌గా ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలా అంటే.. ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వ‌డం.. అనేది ఎప్పుడో చెప్పిందే. ఇప్పుడు ఈ ఇద్ద‌రు సీఎంలు కూడా ఇదే త‌ర‌హాలో ర‌చ్చ గెలుస్తున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రినే తీసుకుంటే.. ఆయ‌న పాల‌న‌కు క‌ర్ణాట‌క‌లోనూ.. మ‌హారాష్ట్ర‌లోనూ ఉన్న‌.. కొన్ని స‌రిహద్దు ప్రాంతాల ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నారు. ఇదే త‌ర‌హా ప‌రిస్తితి ఏపీలోనూ జ‌రుగుతోంది. ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై పొరుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప్ర‌జ‌లు మ‌క్కువ చూపుతున్నారు.

తాజాగా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఒడిశాకు వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి పెట్టారు. అయితే.. ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌పై దృష్టి పెట్టార‌ని.. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నార‌ని తెలియ‌గానే.. ఒడిశా స‌రిహ‌ద్దు ప్ర‌జ‌లు ఆనందంతో ఊగిపోయారు. ఎక్క‌డిక‌క్క‌డ‌.. జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేశారు. ఇక‌, ఒడిశాలోనూ తెలుగు సంఘాలు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. అదేస‌మ‌యంలో.. ఆయా స‌మ‌స్య‌ల విష‌యంలో అక్క‌డి రైతులు కూడా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగతిస్తూ.. ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఇక‌, త‌మిళ‌నాడులోనూ.. జ‌గ‌న్‌కు ఫాలోయింగ్ ఉంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డ‌కు వ‌చ్చి ప్ర‌చారం చేయాల‌ని డిమాండ్లు కూడా వ‌చ్చాయి. మ‌రి .. ఇదంతా.. ఎవ‌రో చేస్తేనో.. ఎవ‌రో వెన‌కాల ఉండి చేయిస్తోనో.. రాలేదు. కేవ‌లం.. వ్యూహంతోనే వ‌చ్చింది. పొరుగు రాష్ట్రాలతో అనుస‌రించిన స్నేహ పూర్వ‌క విధానాల‌తోనే వ‌చ్చింద‌ని అంటున్నారు మేధావులు. మ‌రి ఈ త‌ర‌హా వ్యూహాల‌ను చంద్ర‌బాబు ఎందుకు మిస్స‌య్యారో.!  ఇక్క‌డే ఒక మాట చెప్పుకోవాలి. చంద్ర‌బాబు అదికారంలో ఉండ‌గా.. అటు త‌మిళ‌నాడులోను, ఇటు ఒడిసాలోనూ.. తెలుగు దేశం పార్టీ ఉంద‌ని.. పోటీ చేస్తుంద‌ని.. ప్ర‌క‌టించారు. బ‌హుశ ఇలాంటి తెలివి త‌క్కువ  నిర్ణ‌యాలే అక్క‌డి ప్ర‌జ‌లకు ఆగ్ర‌హం తెప్పించి ఉంటాయ‌ని అంటున్నారు.



పసుపు ముళ్లు : ఎవ్వరినీ నమ్మలేం బాబూ!

వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

నాగ చైతన్య ఒత్తిడిలో ఉన్నాడా...?

2024లో ఏపీ ముఖ్య‌మంత్రి కాపు వ్య‌క్తే : చింతా మోహన్

బ్రేకింగ్: లోకేష్ కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం చైనా అడుగులు..!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>